Suryaa.co.in

Telangana

రేవంత్ బాటలోనే బీర్ల ఐలయ్య

– ఐలయ్య భూ దందాలు మరిన్నిటిని త్వరలోనే బయట పెడతా
– మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత

హైదరాబాద్ : ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భూ కబ్జాలు ఎపిసోడ్లుగా బయటకు వస్తున్నాయి. గతం లో కొలనుపాక లో భూ కబ్జా బాగోతం బయట పెట్టాం. తాజాగా ఆలేరు రెవెన్యూ తండా లో బీర్ల ఐలయ్య భూ దందాలకు తెరలేపాడు.

1996 లో 16 ఎకరాలు కొందరు ఎస్టీ లకు అసైన్డ్ భూములు కేటాయించారు. అందులో రెండు ఎకరాల భూమిని ఇద్దరు వ్యక్తులకు అమ్మారు. అందులో కొన్ని ఎకరాలు నవంబర్ 2024 లో కుమార స్వామి ,బాలరాజు అనే వ్యక్తులకు జి పి ఏ చేశారు. .కుమార స్వామి ఎమ్మెల్యే ఐలయ్య డ్రైవర్ కాగా బాలరాజు అయన పీ ఏ.

వారిద్దరి పేరిట జి పి ఏ అయిన కొన్ని రోజులకే ఆ భూములను అమ్మేశారు. అసైన్ మెంట్ భూములు అమ్మడానికి కొనడానికి వీలు లేదు. అలాంటపుడు ఎమ్మెల్యే అసైన్ మెంటు భూములతో వ్యాపారం ఎలా చేస్తారు ? ఆ భూములు కొన్న వారు కూడా ఐలయ్య బంధువులే.

ఎమ్మెల్యే ఐలయ్య బంధువులు కొన్న భూములకు డిసెంబర్ లో నాలా కన్వెర్షన్ కూడా జరిగింది. వెంటనే ఈ సేల్ డీడ్స్ రద్దు చేసి అసలైన హక్కుదారులైన గిరిజనులకు భూములు తిరిగి అప్పగించాలి. చదువురాని అమాయక గిరిజనుల భూములపై ఎమ్మెల్యే కన్నేసి భూ దందా చేస్తున్నారు. బీ ఆర్ ఎస్ నేతలపై చిన్న చిన్న అంశాల పై కేసులు పెట్టే ప్రభుత్వం, బీర్ల ఐలయ్య విషయం లో చోద్యం చూస్తోంది.

అధికార పార్టీ ఎమ్మెల్యే ఏ తప్పు చేసినా చర్యలు ఉండవా ? అసైన్ మెంట్ ,సీలింగ్ భూములను అక్రమంగా కొంటూ భూ దందా చేస్తున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పై చర్యలు తీసుకోవాలి. త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని కలిసి భూ దందాల ఐలయ్య పై చర్యలు తీసుకోవాలని కోరుతాం.

ఐలయ్య పై చర్యలు తీసుకోకపోతే బీ ఆర్ ఎస్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తాం. సీఎం రేవంత్ బాటలోనే బీర్ల ఐలయ్య పోకడలు ఉన్నాయి. భూ దందాల్లో సీఎం రేవంత్ ను ఎమ్మెల్యేలు ఫాలో అవుతున్నారు. యధా రాజా తదా ప్రజా అన్నట్టు వ్యవహారాలు నడిపిస్తున్నారు. ఐలయ్య భూ దందాలు మరిన్నిటిని త్వరలోనే బయట పెడతా

LEAVE A RESPONSE