– టెస్ట్ డ్రైవ్ చేసిన కార్ విశ్లేషకుడు డాన్ నీల్
– ద వాల్ స్ట్రీట్ జనరల్ పత్రిక ప్రత్యేక కథనం
ఆటోమొబైల్ రంగం ఆకాశయానంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ కార్ విశ్లేషకుడు డాన్ నీల్, పివటల్ కంపెనీ రూపొందించిన ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఫ్లయింగ్ కారును అమెరికాలోని కాలిఫోర్నియాలో టెస్ట్ డ్రైవ్ చేశారు. ఇది సామాన్యుల కోసం తయారుచేసిన ఒకే సీటు గల విమాన మోడల్ గల కారు. కేవలం 124 కిలోల బరువుతో కార్బన్ ఫైబర్ ఫ్రేమ్‌తో రూపొందించబడిన ఈ వాహనం… ఎలక్ట్రిక్ బ్యాటరీ శక్తితో 32 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. జాయ్‌స్టిక్‌తో సులభంగా నియంత్రించగలిగే దీనిపై గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని… టేకాఫ్ చాలా సులభంగా జరిగిందని నీల్ తెలిపారు. సాంప్రదాయ కార్ డ్రైవింగ్ అనుభవాన్ని విమాన డ్రైవింగ్‌గా మార్చిన ఈ డ్రైవ్ ఆకాశంలో అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.