– అఖండ 2 అద్బుతమైన సినిమా
– ధర్మం దారి తప్పిన వాళ్లకు ఈ సినిమా ఓ గుణపాఠం
– సనాతన ధర్మ రక్షణ అవసరాన్ని నొక్కి చెప్పిన సినిమా
– ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో మరిన్ని రావాలి
– ఇప్పటికైనా హిందూ ధర్మమనే గొడుగు కిందకు రావాలని కోరుతున్నా
– సనాతన ధర్మాన్ని రక్షించే యోధుడు నరేంద్రమోదీ
– మోదీ పాలనలో కరోనా వ్యాక్సిన్ ను ప్రపంచానికి అందించగలిగాం
– కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి
– దర్శకుడు బోయపాటితో కలిసి అఖండ 2 సినిమాను వీక్షించిన కేంద్ర మంత్రి
హైదరాబాద్: ప్రతి ఒక్క హిందువుతోపాటు ప్రతీ భారతీయుడు తప్పకుండా చూడాల్సిన సినిమా అఖండ 2 అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అని అన్నారు. ధర్మాన్ని దారి తప్పిన వాళ్లకు ఈ సినిమా ఓ గుణపాఠమని చెప్పారు. సనాతన ధర్మాన్ని రక్షించే యోధుడు నరేంద్రమోదీ ఈ దేశాన్ని పాలిస్తున్నారు కాబట్టే కరోనా వంటి మహమ్మారికి విరుగుడుగా వ్యాక్సిన్ ను కనుగొని ప్రపంచానికి అందించగలిగామని తెలిపారు.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ‘‘అఖండ 2 తాండవం’’ సినిమాను బండి సంజయ్ వీక్షించారు. బీజేప రాష్ట్ర ఉపాధ్యక్షలు కాసం వెంకటేశ్వర్లు, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, అధికార ప్రతినిధి జె.సంగప్ప, జిల్లా అధ్యక్షులు ఉమా మహేందర్ సహా పలువురు బీజేపీ రాష్ట్ర నాయకులు బండి సంజయ్ తో కలిసి ఈ సినిమాను చూశారు.
సినిమా అనంతరం బోయపాటితో కలిసి బండి సంజయ్ ఏమన్నారంటే…అఖండ 2 సినిమా చూడటం చాలా సంతోషంగా ఉంది. సంచలనాలకు మారుపేరు బోయపాటి శ్రీను. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీస్తున్నారు. పరమేశ్వరుడు ఆవహించడంతో ఈ సినిమా చేసినట్లున్నారు. కమర్షియల్ హంగులకు అద్బుతమైన సందేశాన్ని ఇస్తూ తీసిన సినిమా. సనాతన ధర్మం గురించి సినిమా చేయాలంటే చాలా ధైర్యముండాలి. ఈ దేశంపైన, సనాతన ధర్మం, సంస్క్రుతి, సాంప్రదాయాలపై దాడులు జరుగుతున్నా తట్టుకుని నిలబడిదంటే… దానికి కారణం మనం నమ్ముకున్న సనాతన ధర్మమే.
ఆ నిరంతర చరిత్రను అద్బుతంగా సినిమా అఖండ తాండవం. దేశ సరిహద్దులను సైనికులు రక్షిస్తే… ధర్మాన్ని సమాజం రక్షించుకోవాలి. అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండటం కూడా తప్పే. అన్యాయాన్ని ఎదురించి సమాజాన్ని రక్షించేవాడే గొప్ప. సనాతన ధర్మం గొప్పతనం వినడం కంటే అఖండ తాండవం సినిమా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై, భారతీయుడిపై ఉంది.
మిగిలిన ఈ జీవితాన్ని ధర్మం, దేశం కోసం అర్పించాలనే సినిమా అఖండ. భారత్ ఎప్పటికీ ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం. కోవిడ్ తరుణంలో ప్రపంచమంతా దిక్కులు చూస్తుంటే…. సనాతన ధర్మాన్ని రక్షించే యోధుడు ఈ దేశాన్ని పాలిస్తున్న సందర్భంలో కోవిడ్ వస్తే.. ఏ విధంగా ఎదుర్కొన్నారో, ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన ద్రుశ్యాలను మనం కళ్లారా చూశాం. అంతటి యోధుడు నరేంద్రుడు భారత్ ను పాలిస్తున్నాడు కాబట్టే వ్యాక్సిన్ ను అందించగలిగినం. సైంటిస్టులను ప్రోత్సహించినం. కరోనా వ్యాక్సిన్ అందించిన భారత్ బయోటెక్ హైదరాబాద్ లో ఉంది. మోదీ స్వయంగా ఇక్కడికి వచ్చి వ్యాక్సిన్ ను పరీక్షించాడు.
అఖండ తాండవం సినిమాను ప్రతి హిందువు, భారతీయుడు తప్పకుండా చూడాల్సిన సినిమా. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో బాలక్రిష్ణ అద్బుతంగా నటించారు. బాలయ్య సినిమాల కోసం విద్యార్థులు, కాలేజీలు, యువకులు బెట్టింగులు పెట్టి మరీ వెళుతున్నారు. ఎన్టీఆర్ రూపంలో బాలయ్యను చూస్తున్నాం. అఖండ సినిమాలో బాలయ్యను చూస్తే శివుడే మన ముందు కన్పించినట్లుంది. అఖండ సినిమాను లీనమై చూశాం. ఎక్కడా రాజీపడకుండా అఖండ 2 సినిమా చూసిన బోయపాటి శ్రీనుకు ప్రత్యేక అభినందనలు. ఈ సినిమాను అందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
సనాతన ధర్మాన్ని కాపాడేలా మరిన్ని సినిమాలు రావాలి. ఈ దేశంలో అంతర్గతంగా జరుగుతున్న దాడులను, పరిస్థితులను ఆసరాగా చేసుకుని సినిమాలు తీసి ప్రజలను మేల్కోల్పాల్సిన అవసరం ఉంది. కొంత మంది ధర్మం విషయంలో దారి తప్పుతున్నారు. దేవుడు లేడు, హిందూ సనాతన ధర్మం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారందరికీ అఖండ 2 సినిమా గుణపాఠం. అటు ఇటు దారి తప్పిన వాళ్లంతా హిందూ ధర్మమనే గొడుగు కిందకు రావాలని కోరుతున్నా.