Suryaa.co.in

Andhra Pradesh

అంచలంచెలుగా ఎదిగిన అక్షర యోధుడు

– అక్షర యోధునికి అశ్రు నివాళులర్పించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత, మీడియా మొఘల్, పద్మవిభూషణ్ రామోజీరావు మరణం పట్ల రాజమండ్రి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసం నందు టీడీపీ నాయకులతో కార్యకర్తలతో కలిసి గోరంట్ల రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ తెలుగు భాషకు రామోజీరావు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేని అని రామోజీ మృతి తెలుగు వారు అందరికీ తీరని లోటు అని గోరంట్ల భావోద్వేగమయ్యారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక అంచలంచెలుగా ఎదిగి అక్షర యోధుడుగా,ఒక మార్గదర్శిగా నిజాయితీ విలువలతో కూడిన జర్నలిజంతో తెలుగువారి గుండెల్లో ఆయన ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారని అలాంటి మహా యోధుడు మన మధ్య లేకపోవడం బాధాకరమని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి యర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు,రాష్ట్ర తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి,రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్,గంగిన హనుమంత రావు, నున్న కృష్ణ,ఆళ్ల ఆనందరావు,యార్లగడ్డ శేఖర్, సింగ్ సురేంద్ర, కోరాడ వెంకటేష్,శ్రీను,రాయుడు సునీల్,పసలపూడి పాపారావు, ఆళ్ల విఠల్, లాజర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE