– రాష్ట్రంలో 5నిమిషాలకో అత్యాచారం, 10నిమిషాలకో అఘాయిత్యం, అరగంటకో హత్య
• మోసకారీసంక్షేమంతో పేదల్ని రోడ్డునపడేసి, విచ్చలవిడిగా సాగిస్తున్న దోపిడీని మరింతపెంచుకోవడానికి, లూఠీచేసినసొమ్ముని జాగ్రత్తచేసుకోవడానికి ఇంత దుర్మార్గపు పాలన సాగిస్తున్నారా
• హత్యలు, అత్యాచారాలు, ఇతరత్రా అసాంఘిక కార్యకలాపాలకు కారణం ముఖ్యమంత్రి పెంచిపోషిస్తున్న గంజాయి, మాదకద్రవ్యాలమాఫియానే
• గతప్రభుత్వంతో పోలిస్తే జగన్ జమానాలో దారుణాలు, దుశ్చర్యలు, దుర్మార్గాల్లో రాష్ట్రం గొప్ప పురోగతిసాధించింది
• నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ముఖ్యమంత్రి ఎంతగా రాష్ట్రాన్ని దుర్మార్గాలకు కేంద్రంగా మార్చాడో స్పష్టంచేస్తోంది
• వైసీపీప్రభుత్వంలో 52వేలమంది మహిళలపై అఘాయిత్యాలు, ఇతరత్రా దారుణాలు జరిగాయి.
• సొంతతల్లి, చెల్లిని భయంతో పరాయిరాష్ట్డానికి పారిపోయేలాచేసి, బాబాయ్ ని చంపినవారిని శిక్షించలేని ముఖ్యమంత్రి, ప్రజల్ని రక్షిస్తాడనుకోవడం మూర్ఖత్వమే
– మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్
జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దుర్మార్గాలకు నెలవు గా మార్చాడని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక అత్యాచారాల్లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పడం బాధాకరమని, గత ప్రభుత్వం తో పోల్చిచూస్తే శాంతిభద్రతలనిర్వహణ ఈ ప్రభుత్వంలో ఎంతఅధ్వాన్నంగా ఉందో అర్థమవుతోందని టీడీ పీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటిరాజేంద్రప్రసాద్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
జగన్ పరిపాలన దోచుకోవడం దాచుకోవడానికే తప్ప, ప్రజల్ని కాపాడటానికి కాదని తేలిపోయింది
“ గతప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన అసాంఘికార్యకలాపాలతో పోలిస్తే, నేడు జగన్ జమానాలో జరిగే దారుణాలు, దుశ్చర్యల్లో రాష్ట్రం చాలాగొప్పపురోగతిసాధించింది. అత్యాచారాల్లో30శాతం, దాడుల్లో15శాతం, ఆత్మగౌరవాన్ని అవమానించే సంఘటన లు 31శాతంవరకు ఈ ప్రభుత్వంలో పెరిగాయి. వైసీపీప్రభుత్వంలో ఇప్పటివరకు 52వేలమంది మహిళలపై అఘాయిత్యాలు, ఇతరత్రా వేధింపులు జరిగాయి.22,278 వరకు మిస్సింగ్ కేసులు నమోదైతే, 9మంది యువతలు, బాలికలపై యాసిడ్ దాడు లు జరిగాయి. 32మంది మహిళలు సామూహికమానభంగాలకు గురయ్యారు.
ఇన్ని దారుణాలు జరగడానికి కారణం రాష్ట్రప్రభుత్వం, పాలకులే. విజయవాడలో కార్పొరేటర్ చెన్నుపాటిగాంధీపై వైసీపీమూకలు చేసినదాడి అత్యంత కిరాతకమైంది. విశాఖపట్నం లో సొంతపార్టీ ఎంపీ కుటుంబసభ్యుల్ని కిడ్నాప్ చేస్తే స్పందించని ముఖ్యమంత్రి ప్రజల్ని ఏంకాపాడతాడు? ప్రజల్నిరక్షించడం అటుంచితే, ప్రభుత్వ విధానాల్ని, అధికారపార్టీనేతల అవినీతిని ప్రశ్నించేవారిపై అకారణంగా తప్పుడు కేసులుపెట్టి వేధిస్తున్నారు. డాక్టర్ సుధాకర్ నుంచి జడ్జిరామకృష్ణవరకు ప్రభుత్వ విధా నాలను నిలదీసినవారిని ఏవిధంగా వేధించారో చూశాం.
గుంటూరుజిల్లాలో దాదాపు 23మంది బీసీలను జగన్ ప్రభుత్వం బలితీసుకుంది. ఇతరత్రావర్గాలకు చెందిన 74మంది రాజకీయహత్యలకు గురయ్యారు. జగన్ పరిపాల న కేవలందోచుకోవడం దాచుకోవడానికే పరిమితమైంది తప్ప, ప్రజల్ని కాపాడేలా లేదు. ముఖ్యమంత్రి సొంతజిల్లాలో జరిగే దారుణాలకు అంతూపొంతూలేకుండా పోయిం ది. ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసంపక్కనే యువతిపై అత్యాచారంజరిగితే ఇంతవరకు నిందితుల్ని శిక్షించలేకపోయా రు. సిగ్గులేకుండా, నిర్లజ్జగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చాడు.
ఎన్నికలొస్తే మా తఢాఖా చూపిస్తామంటూ తెనాలి వైసీపీ శాసనసభ్యుడు వీరంగం వేయడం దేనికి సంకేతం?
తెనాలిశాసనసభ్యుడు ఎన్నికలొస్తే ఉచ్ఛపోయిస్తాను అని ఇప్పుడే ఎందుకు హూంకరి స్తున్నాడు? కన్నుమూసి, తెరిచేలోపే ఎన్నిక అయిపోతుంది అని అనడం దేనికి సంకే తం? ఎన్నికల్లో ప్రజల్ని భయపెట్టి, వారిఓట్లు మీరువేసుకొని గెలవాలనుకుంటున్నా రా? రాష్ట్రంలోజరిగే దారుణాలను సమర్థిస్తూ డీజీపీ అంతాబాగుందని, శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయనిచెప్పడం సిగ్గుచేటు.
మాజీముఖ్యమంత్రి, ప్రధానప్రతిపక్షనేత చంద్రబాబుఇంటిపై దాడికియత్నించడం, ఆయన బస్సుపై చెప్పులు, కర్రలు విసిరిన ప్పుడే రాష్ట్రపోలీస్ శాఖ శాంతిభద్రతలు ఎంతబాగా కాపాడుతోందో ప్రజలకు అర్థమైంది. ఆనాటి నుంచి ఈనాటివరకు కూడా రాష్ట్రంలో 5 నిమిషాలకో అత్యాచారం, పదినిమిషా లకో అఘాయిత్యం, అరగంటకో హత్య జరుగుతున్నాయి? ఇలాంటి దుర్మార్గపుపాలన దేనికోసమో, ఎవరికోసమో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మోసకారీసంక్షేమంతో పేదల్ని మరింతపేదల్నిచేస్తూ, యథేచ్ఛగా విచ్చలవిడిగా సాగిస్తున్న దోపిడీని మరింతపెంచుకోవడానికి, లూఠీచేసినసొమ్ముని జాగ్రత్తచేసుకోవడానికి ఇంత దుర్మార్గ పు పాలనసాగిస్తున్నారా? సొంతతల్లి, చెల్లే రక్షణకోసం పరాయిరాష్ట్రానికి వెళ్లారంటే, ముఖ్యమంత్రి రాష్ట్రంలో శాంతిభద్రతల్ని ఎంతబాగా అమలుచేస్తున్నాడో అర్థంచేసుకోవచ్చు.
బాబాయ్ ని చంపినవారిని శిక్షించలేని ముఖ్యమంత్రి ప్రజల్ని రక్షిస్తాడా? వైసీపీ దుర్మార్గులు హత్యలు, అత్యాచారాలు, సజీవదహనాలకు పాల్పడుతుంటే, ముఖ్యమం త్రి డబ్బిచ్చి, ఉద్యోగాలుఎరవేసి బాధితకుటుంబాల నోరుమూయిస్తున్నాడు
బాబాయ్ ని చంపినవారిని శిక్షించలేని ముఖ్యమంత్రి ప్రజల్ని రక్షిస్తాడా? నిత్యం రాష్ట్రం లో ఏదోఒకమూల హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా ముఖ్యమంత్రిలో కించిత్ చలనంలేదు. బాపట్లజిల్లాలో చిన్నారిని సజీవదహనంచేస్తే డబ్బులిచ్చి, ఉద్యోగాలిచ్చి కుటుంబసభ్యులు నోరుమూయించాలని ప్రయత్నిస్తారా? రాష్ట్రాన్ని గంజాయివనంగా మార్చబట్టే ఏపీలో అత్యాచారాలు, హత్యలు ఎక్కువైంది నిజంకాదా? యువత మద్యం గంజాయిమత్తులో విచక్షణకోల్పోయి పశువులకంటే హీనంగా ప్రవర్తిస్తుంటే, ప్రభుత్వం, పాలకులుమాత్రం ఎవరేమైపోతే మాకేంటి మాకుకావాల్సింది డబ్బే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
అసాంఘికశక్తులకు రాష్ట్రాన్ని కేంద్రంగామార్చి, శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తున్న ఘనత ఈముఖ్యమంత్రికే దక్కింది. తానుమాత్రం పరదాలమాటున, పోలీ సుల పహారాలో దర్జాగా తిరుగుతూ, ప్రజల్నిమాత్రం గాలికివదిలేశాడు. సామాన్యులు న్యాయంకోసం పోలీసుల్ని ఆశ్రయిస్తే వారికి కీచకపర్వాలే ఎదురవుతున్నాయి. తమిళ నాడువాళ్లు బంగారంపోయిందని ఫిర్యాదుచేయడానికి పోలీస్ స్టేషన్ కువెళ్తే, అక్కడి పోలీసులు మహిళపై కీచకపర్వానికి పాల్పడ్డారు. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే కిరాతకం మరోటి ఉంటుందా?
రాష్ట్రంలోజరిగే సంఘటనలు చూస్తుంటే, జగన్మోహన్ రెడ్డికి అసలు మనసుందా.. ఆయన మనిషిగానే ఆలోచిస్తున్నాడా అన్న సందేహం కలుగుతోంది. ప్రజలతోపాటు, ప్రతిపక్షాలను, తనకుగిట్టని రాజకీయనేతల్నికూడా జగన్ నిర్దాక్షణ్యంగా వేధిస్తున్నాడు. తెలుగుదేశంపార్టీ కీలకనేతలపై పెట్టిన తప్పుడు కేసులే అందుకు నిదర్శనం.
నెల్లూరులో సామూహిక అత్యాచారం, పులివెందులలో దళితయువకుడి హత్య, విజయనగరంలో వ్యాపారికళ్లల్లో కారంకొట్టి 50లక్షలు దోచుకో వడం, ఏలూరులో యువతిపై యాసిడ్ దాడి, బాపట్లజిల్లాలో చిన్నారిసజీవదహనం… వంటి ఘటనలు రాష్ట్రప్రజలకు రక్షణలేదు అనడానికి ప్రబలనిదర్శనాలు. ఇలాంటి దురాగతాలపై పోలీసులు, పాలకులు వ్యవహరిస్తున్నతీరుచూస్తే, రాష్ట్రంలో న్యాయా నికి, ధర్మానికి, చట్టానికి స్థానంలేదని చెప్పకతప్పదు.
జగన్మోహన్ రెడ్డి ఇసుకమాఫి యా, మైనింగ్ మాఫియా, ల్యాండ్, శాండ్ మాఫియా, గంజాయి, మాదకద్రవ్యాల మాఫియాతో రాష్ట్రంలోశాంతిభద్రతలు పూర్తిగామంటగలిశాయి. ప్రభుత్వం, పాలకులు ఇదేవిధంగా పేట్రేగితే ప్రజాబలంముందు పలాయనంతో, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోక తప్పదు. ” అని ఆలపాటి తేల్చిచెప్పారు.