– ఏరియల్ వ్యూ అనంతరం బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్
దేశంలోనే ప్రతిష్టాత్మకంగా గణేష్ ఉత్సవాలు నిమజ్జనం హైదరాబాదులో ఘనంగా ప్రశాంతంగా జరుగుతుంది. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో మేయర్ డిజిపి, పోలీస్ కమిషనర్ , జిహెచ్ఎంసి కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ ఏరియల్ ద్వారా పరిశీలించాం. సాయంత్రం సీఎం ట్యాంక్ బండ్ పై ఆకస్మికంగా నిమజ్జనాన్ని పరిశీలించారు. అన్ని వినాయకులు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ చేరుకుంటున్నాయి. పురానాపూల్, చార్మినార్ ప్రాంతాల నుండి వినాయకుడు ట్యాంక్ బండ్ వైపు వస్తున్నాయి.
ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయింది. ఇక్కడ ఇబ్బందులు జరగలేదు. ప్రజలు అందరి సహకారంతో అన్ని డిపార్ట్మెంట్ లు సమన్వయంతో నిమజ్జనం జరుగుతుంది. దేశంలోనే అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. అన్ని డిపార్ట్మెంట్ లు పోలీసులు సమన్వయం చేసుకొని పని చేస్తున్నాయి. ఇప్పటికీ వరకు మొత్తం 2 లక్షల పైన విగ్రహాలు నిమజ్జనం పూర్తయింది. రేపు యధావిధిగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ రాత్రి నిమజ్జనం పూర్తవుతాయి. నిమజ్జనానికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా పర్యవేక్షణ జరుగుతుంది.