– ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడండి
– సహచర మంత్రులతో కలసి మంత్రి గొట్టిపాటి సమీక్ష
కర్నూల్ : ఈ నెల 16వ తేదీన కర్నూల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సభా ప్రాంగణాన్ని పర్యవేక్షించారు.
సహచర మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్థన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి నాయకులతో కలిసి వేదిక, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ , యువనేత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్న నేపథ్యంలో, మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని సూచించారు.
సభకు భారీగా తరలివచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్, తాగునీరు, భోజన సదుపాయాలు మరియు రవాణా సౌకర్యాలు సమర్థవంతంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.