-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
317 జీవోను సవరించాలంటూ ప్రగతి భవన్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న టీచర్లను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరెస్టు చేసిన టీచర్లందరిని ప్రభుత్వం భేషరుతుగా విడుదల చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ‘స్థానికత’కు గొడ్డలిపెట్టుగా ఉన్న 317 జీవోను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు.317 జీవోను సవరించే వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులు చేసే ఉద్యమానికి బీజేపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు 317 జీవోను వెంటనే సవరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పోరాటలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని బండి సంజయ్ హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరిని మార్చుకోవాలని సూచించారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిస్తామని బండి తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవడం లేదని బండిసంజయ్ మండిపడ్డారు.