బద్వేలు ఉపఎన్నికలో బలిజ కులస్తులంతా ఐక్యంగా ఉండి వైసిపిని ఆదరించి అఖండ మెజారిటీతో డాక్టర్. సుధా ను గెలిపించాలని ఎమ్మెల్సీ రామచంద్రయ్య అన్నారు. అడా ఛైర్మన్ సింగసాని గురుమోహన్ స్వగృహంలో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో బలిజ కులస్థులు ముప్పై మూడు వేల ఓటర్లు ఉన్నారని వీరంతా వైసిపి ని ఆదరిస్తే భవిష్యత్తులో బలిజలకు వైసిపి అండగా ఉంటుందన్నారు.
ఏ ప్రభుత్వమూ చేయని విధంగా బలిజ కులస్థులను వైసిపి ఆదరించి పదవులు ఇవ్వడమే కాక ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసిందన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలిజ కులస్తులు మీద ఆదరణ చూపుతున్నారని ఆయనకు కానుకగా బద్వేలు అసెంబ్లీ నుంచి అత్యధిక మెజారిటీతో సుదా గెలిపించడమే కాక బలిజ కులస్తులను వైసీపీ వైపే ఉన్నారని చాటాలన్నారు. ముఖ్యమంత్రి వద్ద మన హక్కులను మనం సాధించుకోవాలన్న బలిజ కులస్థులు అగ్రస్థానాలకు వెళ్లాలన్న ఉపఎన్నిక ఒక ఉదాహరణగా ఉంటుంది. ఈరోజు బద్వేల్ ప్రాంతంలో సింగసాని పరంధామయ్య తర్వాత సింగసాని గురుమోహన్ నేరుగా జగన్ మోహన్ రెడ్డి ఆదరించారు. ఆ కుటుంబంపై ఉన్న ప్రేమ అలాంటిదని అందుకే ఈరోజు పరంధామయ్య అడుగుజాడల్లో, గురుమోహన్ నడిచారని రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ప్రజలకు ఏం న్యాయం జరగాలన్న ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మక తీసుకొని విజయవంతంగా చేపట్టాలని కోరారు.
నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల బలిజ కులస్థులు విడివిడిగా హాజరైన వారి సమస్యలు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందన్నారు. మనకు ఇదొక అవకాశమని ఈ ఎన్నికలో మన సత్తాచాటి బలిజ కులస్థులు లంతా వైసీపీ వైపే ఉన్నారని నిరూపించాలని కోరారు. కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ శేషు టీటీడీ బోర్డు మెంబర్ అశోక్ కుమార్, అనంతపురం హిందూపురం అడా ఛైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ సింగసాని శివయ్య నియోజకవర్గ వైసిపి నాయకులు బలిజ కులస్థులు పాల్గొన్నారు.