Suryaa.co.in

Telangana

సర్కారు దవాఖానలో సకల సౌలత్ లు ఉన్నాయ్..

– కాన్పులకి ప్రభుత్వ దవాఖానకె రావాలి..
– నాకు జరిగిన మేలు అందరికి జరగాలి..
– మీరు చెప్పినట్టే సాధారణ కాన్పు చేపించిన..బిడ్డ మనవడు మంచిగుండ్రు…
– మంత్రి హరీష్ రావు కు ఉత్తరం వ్రాసిన సిరిసిల్ల వాసి..

” రాజన్న సిరిసిల్ల జిల్లా చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీ కి చెందిన పోచయ బిడ్డ పురిటి నొప్పులతో బాధపడుతుంటే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కి తీసుకెళ్లాడు.. వైద్యులకు చూపించారు..వారు ఎలాంటి ఇబ్బంది లేదు కొంచెం ఓపిక పట్టు సాధారణ కాన్పు చేద్దాం అనడం తో.. మంత్రి హరీష్ రావు సర్ టీవీల్లో చెప్పిన మాట విని సాధారణ కాన్పుకు సిద్ధం అయ్యాడు.. ఓపిక పట్టి సాదరణ కాన్పు చేపించాడు.. పండంటి మగబిడ్డ పుట్టాడు.. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.. ఈ సంతోషం లో మంత్రి హరీష్ రావు గారికి పోచయ , అదేవిధంగా తన బిడ్డ వసంత లు పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరం వ్రాసి పంపారు..

” సారు.. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా కేసీఆర్ సర్ వలన మంచిగ వసతులు ఉన్నాయని సిరిసిల్ల సర్కారు దవాఖాన కు తీసుక పోయిన మా కేటీఆర్ సారు కూడా ఆసుపత్రిని బాగా చేసాడు అని ఉత్తరం లో వ్రాసారు..అదే విధంగా బాగా నొప్పుల తో ఆసుపత్రికి వెళ్లినం అక్కడ డాక్టర్ లు మంచిగ చూసి ఓపిక పట్టు సాధారణ కాన్పు చేపించుకో అన్నారు.. మీరు( హరిశ్ రావు) టీవీల్లో చెపుతారు కదా సాధారణ కాన్పులుWhats-App-Image-2022-07-05-at-3-37-08-PMగురించి అని అలానే చేపించినానని ఆ ఉత్తరంలో వ్రాసారు.. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు వల్ల పైసా ఖర్చు లేదు.. పైగా కేసీఆర్ కిట్ ఇచ్చిర్రు.. పైసా తీసుకోకుండా అమ్మ ఒడి వాహనం లో ఇంట్లో దింపిండ్రు.. కడుపుకోతలు నివారించేందుకు మీరు పడుతున్న కష్టం చూసి నాకు బిడ్డకు మనవడికి కలిగిన మేలు అందరికి తెలవాలన్న ఉద్దేశ్యం తో మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖ రాయించి పంపుతున్నాను… సార్ అంటూ..
” సర్కారు దవాఖానలో సకల సౌలత్ లు ఉన్నాయ్.. ! కాన్పులకి ప్రభుత్వ ఆసుపత్రికె రావాలి.. !! నాకు జరిగిన మేలు అందరికి జరగాలని ఆ లేఖలో పేర్కొన్నారు..

– ఉత్తరం సాధారణ కాన్పులకు చైతన్యం…
– నూరు వసంతాలు వసంత వర్ధిల్లాలి..
– సంతోషం వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు గారు..
సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేపించుకొని ప్రభుత్వ ఆసుపత్రి సేవలను , అదేవిధంగా సాధారణ కాన్పులు చేపించుకోవాలని నీకు జరిగిన మేలు అందరికి జరగాలని ఉత్తరం ద్వారా ఒక మంచి ఉపదేశం చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీ కి చెందిన వసంత ఉత్తరం నాకు అందింది చాలా సంతోషంగా ఉందని వసంత నూరు వసంతాలు పిల్లపాపాల తో వర్ధిల్లాలని మంత్రి హరీష్ రావు గారు కోరుకున్నారు.. ఈ ఉత్తరం మహిళలో ప్రజల్లో గోప్ప చైతన్యం స్పూర్తిని ఇస్తుందన్నారు..

LEAVE A RESPONSE