Suryaa.co.in

Telangana

ప్రభుత్వ స్కూళ్లలో అన్ని సదుపాయాలు: ఉప సభాపతి పద్మారావు

ప్రభుత్వ స్కూళ్లలో అన్ని సదుపాయాలను కల్పించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నామని, సికింద్రాబాద్ పరిధిలో ని 10 ప్రభుత్వ స్కూల్ కు తొలి దశలో నిధులను మంజూరు చేశామని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. ఉప సభాపతి పద్మారావు గౌడ్ పిలుపు మేరకు బౌద్దనగర్ డివిజన్ లోని ఎల్ నారాయణpadmarao నగర్ ప్రభుత్వ స్కూల్ లో విద్యార్థులకు తెరాస నేత సుంకు రామచందర్ తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో, విద్యార్ధులకు ఉచితంగా పుస్తకాలు అందించారు. ఈ కార్యక్రమంలో పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఉప విద్యాధికారి శ్రీనివాస్, కార్పొరేటర్ కంది శైలజ, నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, కంది నారాయణ, ప్రధానోపాధ్యాయురాలు శశికళ తో పాటు నేతలు, అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE