Suryaa.co.in

Andhra Pradesh

వివేకా హత్య కేసులో అన్ని వేళ్లు జగన్ వైపే చూపిస్తున్నాయి

-పులివెందులలో జగన్ బంధువులు సందుకొకరు, గొందికొకరు ఉన్నా..జగన్, అవినాష్ రెడ్డిల ఇండ్లకే సీబీఐ అధికారులు ఎందుకు కొలతలు వేశారు?
-వివేకా హత్యలో ముద్దాయి దేవిరెడ్డి శంకర్ రెడ్డితో ప్రాణహాని ఉందని అనంతపురం ఎస్పీని రెండు సార్లు గంగాధర్ రెడ్డి మొత్తుకున్నా ఫలితంలేదు
– మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు

పులివెందులలో జగన్ బంధువులు సందుకొకరు, గొందికొకరు ఉన్నా.. జగన్, అవినాష్ రెడ్డిల ఇండ్లకే సీబీఐ అధికారులు ఎందుకు కొలతలు వేశారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పత్రికాముఖంగా ప్రశ్నించారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మాట్లాడిన మాటలు… వివేకానందరెడ్డి హత్య కేసును నీరుగారుస్తున్నారు. ఇది చూసిన ప్రజలు నివ్వెరపోతున్నారు. వివేకా హత్య కేసులో అన్ని వేళ్లు జగన్ వైపే చూపిస్తున్నాయి. సాక్షాధారాలతో సహా సొంత చెల్లి సనీతమ్మ చూపుతోంది. వివేకా కుటుంబ సభ్యులు చూపుతున్నారు. సీబీఐ అధికారులు చూపుతున్నారు. సొంత బాబాయి హత్య జరిగిన విషయం తెలియనట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు.

నిందితుల పక్షాన నిలిచి నిందితులను బయట పడేయడానికి తాపత్రయ పడుతున్నారు. వివేకా హత్య కేసులో వెలుగులోకి రావాల్సిన విషయాలు చాలా వున్నాయి. వివేకాహత్య జరిగిన రోజు హత్యని గుండెపోటుగా మార్చి మొదట విజయసాయిరెడ్డి, జగన్, మాట్లాడారు. గొడ్డలి పోటును గుండెపోటుగా చూపడానికి అన్ని రకాలుగా ప్రయత్నించారు.  వివేకాది గొడ్డలిపోటు కాదు గుండెపోటు అని నమ్మించాలని విశ్వప్రయత్నాలు చేసిన విషయం అందరికీ తెలుసు. ప్రతిపక్షంవారు హత్య చేయించారని ప్రచారం చేసి ఆ సానుభూతితో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి రాకముందేమో సీబీఐ ఎంక్వైరీ కావాలన్నారు. సీబీఐ ఎంక్వైరీ కావాలని వేసిన పిటిషన్ ని ముఖ్యమంత్రి అయ్యాక వెనక్కి తీసుకున్నారు. సొంత తండ్రిలాంటి చిన్నాన్న హత్యకు గురైతే హంతకులను ఇవాల్టి వరకు పట్టుకోలేకపోయిన అసమర్థుడు జగన్. ముఖ్యమంత్రి సహకారంతో నిందితులు యదేచ్ఛగా తిరుగుతున్నారు. సాక్ష్యుల్ని మిగలనివ్వరని జగన్ గత చరిత్ర చెబుతోంది.

పరిటాల రవి కేసులో హత్య చేసినవాళ్లను, చేయించినవాళ్లని, చూసినోళ్లని జైళ్లల్లో, ట్రైన్లలో, డాక్టర్ లు, ఊళ్లల్లో చంపేశారు. వివేకా హత్య కేసు సాక్షాలు, ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నా ఎందుకు ఉదాసీనంగా ఉన్నారు? అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా వదిలేశారంటే ఏదో మతలబు ఉంది. సాక్ష్యుల్ని చంపేస్తున్నారు. కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఈసీ గంగిరెడ్డి లు ఎలా వెళ్లిపోయారో తెలియదు. ముద్దాయి దేవిరెడ్డి శంకర్ రెడ్డి చనిపోయిన గంగాధర్ రెడ్డిని పావుగా వాడుకోవాలని చూశారు.

ఈ కేసును త్వరితగతిన ఓ కొలిక్కి తీసుకురావాలి. నిందితులందరిని నిష్పక్షపాతంగా అరెస్టు చేయాలి. కేసులోని నిందితులు, అనుమానితులు, దొరికిన సాక్షాలను తారుమారు చేయడానికి అవినాష్ రెడ్డి పూర్తిగా ప్రయత్నించారు. వివేకా హత్య కేసులో బయటపడుతున్న నేరస్థులను మట్టుపెట్టడమే వైసీపీ నాయకులు పనిగా పెట్టుకున్నారు. కేసు ఒప్పుకుంటే 10 కోట్లు ఇస్తామని చనిపోయిన గంగాధర్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. వివేకా హత్య కేసులో ప్రత్యేక దృష్టి పెట్టి నిందితులకు శిక్ష పడేలా చేయాలి. వివేకా హత్య కేసును వెంటనే నిగ్గు తేల్చాలి. లని టీడీపీ పోరాటం చేస్తోందని విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు.

LEAVE A RESPONSE