Suryaa.co.in

Telangana

గ్రూప్ 1 పోస్టులన్నిటికీ సమాన వేతనాలు ఉండాలి

పి ఆర్ సి కమిటీ కి గ్రూప్ 1 అధికారుల సంఘం విజ్ఞప్తి

గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా నియామించబడే గ్రూప్ 1 పోస్టుల వేతనాలలో 3 రకాల వ్యత్యాసాలు ఉన్నాయని వాటిని సవరిస్తూ గ్రూప్ 1 పోస్టులన్నిటికి సమాన వేతనాలు ఉండేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాలని తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్, హన్మంతు నాయక్ ఆధ్వర్యంలో గ్రూప్ 1 అధికారుల బృందం ఈ రోజు పి ఆర్ సి కమీషన్ చైర్మన్ శివ శంకర్, సభ్యులు రామయ్య ను కలిసి విజ్ఞప్తి చేసింది. అదే విధం గా గ్రూప్ 1 అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు, స్టేట్ సివిల్ సర్వీస్ గా గ్రూప్ 1 సర్వీస్ లోని పోస్టులను పరిగణించడం తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు గా గ్రూప్ 1 అధికారులను నియమించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేయాలని పి ఆర్ సి కమిషన్ ను కోరారు.

LEAVE A RESPONSE