Suryaa.co.in

Andhra Pradesh

తటస్థులకు తెలుగు దేశం పార్టీలోకి ఆహ్వానం: చంద్రబాబు

-రాక్షస పాలనపై పోరాటానికి అన్ని వర్గాలు కలిసి రావాలి

అమరావతి:- తెలుగు దేశం పార్టీలో చేరికల పరంపర కొనసాగుతుంది. గత కొద్దిరోజులుగా వివిధ ప్రాంతాలకు చెందిన నేతలు, కుల సంఘాల కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారు. వైసిపి విధానాలను వ్యతిరేకించి ఆ పార్టీనుంచి టిడిపిలో చేరుతున్నారు. వీరితో పాటు కొందరు కుల సంఘం నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్యులు, మేధావులు, వ్యాపార వేత్తలు, విద్యావంతులు కూడా పార్టీ లో చేరుతున్నారు. పార్టీ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలోనే ఈ చేరికలు జరుగుతున్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గంటా నరహరి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు.

2017-18 సంవత్సరానికి గాను రాష్ట్రపతి నుంచి బెస్ట్ ఎంగెస్ట్ ఎంట్రర్ప్రెన్యువర్ అవార్డు అందుకున్న గంటా నరహరి…తన వ్యాపారాల ద్వారా వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ….రాజకీయాలకు దూరంగా ఉండేవారు, తటస్థులు తెలుగు దేశం లోకి రావాలని ఆహ్వానించారు. వైసిపి పాలనలో సర్వనాశనం అయిన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అన్ని వర్గాలు కలిసి రావాలని అన్నారు. ప్రజలు ఇప్పటికే టీడీపీకి మద్దతుగా వస్తున్నారని… ఆయా వర్గాల్లో ఉన్న ప్రముఖులు, విద్యావంతులు కూడా తెలుగు దేశంలోకి రావాలని కోరారు. రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి తో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జ్ లు, ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE