– సామాజిక సమరసత సాధించి తీరాలి
– అంటరానితనం రూపుమాపడమే లక్ష్యం
విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సహ సంఘటన కార్యదర్శి వినాయక్ రావు జి
సికింద్రాబాద్ : ” సృష్టిలోని హిందువులందరూ సోదర సమానులే. ఎవరు కూడా అంటారని వారు కాదు” అని విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సహ సంఘటన కార్యదర్శి వినాయక్ రావు దేశ్ పాండే అభిప్రాయపడ్డారు. అగ్రవర్ణము, అనగారిన వర్గము అనే ఉచ్చ నీచ భావాలకు హిందూ సమాజంలో తావు లేదన్నారు. రామాయణం రచించిన మహర్షి వాల్మీకి నుంచి మొదులుకుంటే.. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ వరకు ఎందరో మహనీయులు హిందూ సమాజానికి ఆదర్శనీయలన్నారు.
శుక్రవారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని స్వామి శివానంద ఆశ్రమంలో సామాజిక సమరసత ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. సామాజిక సమరసత బాధ్యులు చిరంజీవులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వినాయక రావు దేశ్ పాండే మాట్లాడారు.
హిందువులందరూ సమానమే అనే అని లక్ష్యంతో విశ్వహిందూ పరిషత్ ఆవిర్భవించిందని చెప్పారు. బాబు జగ్జీవన్ రామ్ తరతరాలకు ఆదర్శమని, అలాంటి మహనీయుల చరిత్రను నేటి సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వివిధ ప్రసారమాధ్యమాలు, పుస్తకాల ద్వారా వీరి చరిత్రను విస్తృతం చేయాలన్నారు. మదనమోహన్ మాలవ్య వంటి గొప్ప మహనీయుల మన్ననలను అందుకున్న గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు.
. తన జీవితాంతం ధర్మరక్షణకై పోరాడారని, అదే క్రమం లో క్రైస్తవ మిషనరీల ఆగడాలను ఎదిరించారన్నారు. తాను పుట్టి పెరిగిన బీహార్ ప్రాంతంలో ముస్లింలు, క్రైస్తవుల ప్రాబల్యం అధికంగా ఉన్నప్పటికీ.. మతమార్పిడికి అనేక ఆఫర్లు వచ్చినప్పటికీ.. వాటిని తిరస్కరించిన హిందుత్వాది బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. తాను హిందువుగానే పుట్టానని, హిందువుగానే చేస్తానని , తన జాతిలో ఏ ఒక్కరిని కూడా మతం మార్చుకోనివ్వని వ్యక్తి అని చెప్పారు.
ఈ దేశంలో ఒకప్పుడు కులాల ప్రస్తావనే లేదని. ఆంగ్లేయులు, మహమ్మదీయుల పరిపాలన కారణంగా మనుషుల మధ్య అంతరాలు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త సామాజిక సమరసత పాటించాలని, అంటారనితనాన్ని రూపుమాపాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో అంటరానితనం వల్లే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని మిషనరీలు మతమార్పిడి చేస్తున్నాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర సంఘటన కార్యదర్శి సత్యం జి, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు భోజనం పల్లి నరసింహా మూర్తి , శాలివాహన పండరీనాథ్ , కసిరెడ్డి వెంకటరెడ్డి , సునీత రామ్మోహన్ రెడ్డి , జగదీశ్వర్ , రాజేశ్వర్ రెడ్డి , లక్ష్మీనారాయణ , దామోదర శెట్టి , బిక్షమయ్య , పగుడాకుల బాలస్వామి , రాజేందర్ రెడ్డి , కుమారస్వామి , శివ రాములు , రమేష్ , తదితరులు పాల్గొన్నారు.