Suryaa.co.in

National

50 వేల కోట్లతో ఈడబ్ల్యుఎస్‌ కార్పోరేషన్‌ పెట్టండి

– 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయని రాష్ట్రాలు
– కార్పొరేషన్‌ ద్వారా విద్య, వ్యవసాయానికి రుణాలు
– ఢిల్లీలో అఖిల భారత ఓసీ సంఘం రిలే నిరాహారదీక్ష

అగ్రవర్ణాల సంక్షేమం కోసం పార్లమెంటులో 50 వేల కోట్లతో ఈడబ్ల్యుఎస్‌ బిల్లు పెట్టాలని కోరుతూ అఖిల భారత ఓసీ సంఘం ప్రతినిధులు కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆ మేరకు వారు ఢిల్లీoc1 జంతర్‌మంతర్‌ వద్ద రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్‌ ఇచ్చినందుకు ఓసీ సంఘం ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపింది. ఆ మేరకు తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ సంఘం ప్రతినిధులు ప్రధాని కార్యాలయానికి వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా అఖిలభారత ఓసీ సంఘం జాతీయ అధ్యక్షుడు పెంజర్ల మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని అగ్రకులాల్లో ప్రతిభ ఉన్నా, వివిధ కారణాల వల్ల వారికి అన్ని రంగాల్లో అవకాశాలు అడుగంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం అగ్రకులాలకు ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లoc2 అమలు కోసం కూడా, తాము రాష్ర్టాల్లో పోరాటం చేయాల్సివస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 10 శాతం రిజర్వేషన్లు ఏ రాష్ట్రం కూడా విధిగా అమలు చేయడం లేదన్నారు. ఇతర కులాలకు మాదిరిగానే ఓసీలు చదువుకునేందుకు గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేయాలని, వ్యవసాయదారులకు పనిముట్ల కోసం రుణాలు, ఉన్నత విద్య అభ్యసించాలంటే ఇలాంటి కార్పొరేషన్‌ అవసమని స్పష్టం చేశారు.

ఈ సమస్యలను అధిగమించాలంటే దేశవ్యాప్తంగా అగ్రకులాల కోసం 50 వేల కోట్లతో ఈడబ్ల్యుఎస్‌ కార్పొరేషన్‌ పెట్టడమే ప్రత్యామ్నాయమని పెంజర్ల స్పష్టం చేశారు. ఆ మేరకు తాము ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులు, వివిధ పార్టీలకు చెందిన ఎంపీలను కలిశామని చెప్పారు. సోమవారం రాష్ట్రపతిని కలుస్తామన్నారు. వివిధ రాష్ష్ట్రాలకు చెందిన 150 మంది ప్రతినిధులు ఈ రిలేనిరాహారదీక్షకు హాజరయ్యారు.

LEAVE A RESPONSE