– తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్
ఉయ్యూరు : హనుమాన్ జయంతి సందర్భంగా ఉయ్యూరు 16వ వార్డులోని హనుమాన్ నగర్ లో వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు అన్న ప్రసాదం వడ్డించిన రాజేంద్రప్రసాద్ ఇతర నాయకులు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ హనుమాన్ నగర్ లో ప్రతి హనుమాన్ జయంతికి భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం చేయడం శుభసూచకమని, అందరూ కలిసిమెలిసి ఐకమత్యంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా భావితరాల వారికి భక్తి మార్గం చూపించిన వారం అవుతామని, హనుమంతుని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ చల్లగా ఉండాలని రాజేంద్రప్రసాద్ అన్నారు.
ఈ కార్యక్రమంలో తెదేపా సగర సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజుల పాటి ఫణి, ఆలయ కమిటీ సభ్యులు చలపాటి శ్రీను, జంపాన నరసింహారావు, జంపాన తేజ, ముసలయ్య, లంకె అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.