– ప్రభుత్వం అంటే సజ్జలేనా? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు ఏమయ్యారు?
– ప్రభుత్వంలో చీమ చిటుక్కుమన్న సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడటానికి ఏం అధికారం ఉంది?
– దొంగ లెక్కలు రాసే సజ్జల ప్రపంచ స్థాయి నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేదు.
– కుప్పంలో వైసీపీని గెలిపించడానికి డీజీపీ సవాంగ్ ఎన్నికల అధికారి నీలం సాహ్ని తిప్పలు పడుతున్నారు.
– దొంగ ఓటర్లకు రాచబాట వేసిన ఘనత డీజీపీ సవాంగ్ కే దక్కింది
సజ్జల మరోసారి విలేకర్ల సమావేశం పెడితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కాదని సజ్జల రామకృష్ణా రెడ్డి అని ప్రజలు భావించాల్సి వస్తుంది.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
సజ్జలేమైనా మంత్రా? ఎమ్మెల్యేనా? ప్రభుత్వం అంటే ఆయనేనా? కూలీకి కిరాయికి వచ్చిన సజ్జల చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేదని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ధ్వజమెత్తారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
అధికార పార్టీ, ప్రభుత్వంలో అంతా తానై నడిపిస్తున్న వ్యక్తి సజ్జల రామకృష్ణా రెడ్డి. ఇతనికి ఎటువంటి రాజకీయ నేపధ్యం లేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమైన వ్యక్తిగా అంతా తానై నడిపిస్తున్నాడు? ప్రభుత్వంలో పిల్లి ఈనిన, కుక్క అరిచినా, తాడేపల్లి ప్రసాదంలో ఎలుకలు కొట్టుకున్న సజ్జలే సమాధానం చెబుతాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వస్తే వైఎస్ కు చెడ్డ పేరు వస్తుందని బెంగళూరులోనే జగన్ రెడ్డిని ఉంచి వైఎస్ పంపే వనరులను జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డిలు కలిసి అనుభవించేవారు. తరువాత సాక్షి పత్రిక పెట్టినప్పుడు దానిలో మార్కెటింగ్ అసిస్టెంట్ గా పని చేశారు. దొంగ లెక్కలు రాయడంలో దిట్ట. ఇటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అత్యంత ప్రధాన స్థానంలో కూర్చున్నాడు. పార్టీ తరుపున, ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వాన్ని విమర్శించినా, ముఖ్యమంత్రిని ఎవరైనా ప్రశ్న అడిగితేనా, సజ్జలే సమాధానం చెబుతన్నాడు.
ప్రభుత్వానికి సలహాదారుడిగా రూపాంతరం చెంది నేడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. రాష్ట్రానికి బిల్ క్లింటన్, బిల్ గేట్స్ ను తీసుకువచ్చి ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు ఉన్న చంద్రబాబు నాయుడు ఎక్కడ. దొంగ లెక్కలు రాసే సజ్జల రామకృష్ణా రెడ్డి ఎక్కడ. నీ కంటిలోని దూలాన్ని చూడకుండా ఎదుట కంటిలోని నలసును మరిచిపోయావని బైబిల్ లో స్పష్టంగా ఉంది. ముఖ్యమంత్రికి చదువు సంద్యలు లేవని, అవగాహన లేదని, రాజకీయ పరిణితి చెందిన వాడికి కాడని, పాత్రికేయులతో సరిగ్గా మాట్లాడటం చేతగాదని, ఇంగ్లీష్ లో మాట్లాడలేడని ఆయనను సజ్జల మూల కూర్చోబెట్టడం సిగ్గుచేటు. ప్రజలు జగన్ రెడ్డికి 151 సీట్లు ఇస్తే పక్కన కూర్చోబెడుతున్నారు. జగన్ రెడ్డి పిలక సజ్జల చేతిలో ఉందా? హీరో, హీరోయిన్, కమీడియన్, సపోర్టింగ్ యాక్టింగ్ అన్ని సజ్జలే. వైసీపీలో ఎవరెవరూ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు. అందులో సజ్జల ఎన్ని పెట్టారో లెక్కలు తియ్యండి. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది సజ్జల నడపటానికి కాదు.
కుప్పానికి ఈ కర్మ పట్టానికి వైసీపీ కాదా? కుప్పం నగర పంచాయితీ వైసీపీ గెలవటానికి పోలీసులు తిప్పలు పడుతున్నారు. దొంగలు దోపిడీ దారులు, గంజాయి అమ్ముకుంటున్న వాళ్లను పోలీసులు అరెస్ట్ చేయరు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఏజెంట్, టీడీపీ కి ఓటు వేయడానికి వచ్చన వారిని మాత్రమే అరెస్ట్ చేస్తారా? దొంగ ఓట్లు వేయడానికి బస్సులో వచ్చిన వారిని అడిగే దమ్ము పోలీసులకు ఉందా? బస్సులకు బస్సులు దొంగ ఓటర్లను దింపడం ఏంటి? దొంగ ఓట్ల గురించి సజ్జల మాట్లాడుతుంటే దొంగే దొంగ అని అరిచినట్లుగా ఉంది. రంద్రాన్వేషనల్లో సిద్ద హస్తుడు సజ్జల. నవరత్నాలు కాదు కదా ఏకరత్నం కూడా లేదని ప్రజలకు క్షుణ్ణంగా అర్ధమయ్యింది.
రాష్ట్ర ఆర్ధిక స్థితి మీద సజ్జల ఏమైనా కామెంట్ చేయగలవా? శ్వేతపత్రం విడుదల చేయగలవా? పోలీసులు ఎందుకు నిర్వీర్యం అయ్యారు? పోలీస్ శాఖలో సవాంగ్ మాటలు అందరూ వినడం లేదు. మేము తప్పు చేయడానికి సిద్దంగా లేము, చట్టం ప్రకారం నడుస్తాం గాని తాడు బొంగరం లేని సజ్జల చెప్పినట్లు వినమని చెబుతున్నారు. కుప్పం ఎన్నికలు ఒక ప్రహసనం. డీజీపీ పదవి ఇచ్చిన సవాంగ్, నీలం సాహ్నికి ఎన్నికల అధికారిగా పదవి ఇచ్చినందుకు ఇలా జగన్ రెడ్డికి సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
న్యాయస్థానాలు పిలిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు డీజీపీని కూర్చోబెట్టినా ఆయన ఏం బాధపడటం లేదు. వాలంటీర్లతో ప్రచారం చేయవద్దని ఎలక్షన్ కమీషన్, చట్టం చెప్పినా వైసీపీ నాయకులు వాలెంటీర్లతో దొంగ ఓట్లు వేసుకోవడానికి సాయం చేయిస్తున్నారు. దొంగ ఓట్లర్లకు రాచబాట వేసిన ఘనత సవాంగ్ కే దక్కింది. రిగ్గింగ్ చేసుకోవడం వారి హక్కుగా వైసీపీ నాయకులు భావిస్తున్నారు. దొంగ ఓట్లు వేయడానికి తమిళనాడు నుండి మూడు బస్సుల్లో వస్తే వాటిల్లో ఒక బస్సు టైర్లలో గాలి తీస్తే వారిపై కేసులు పెట్టారు. కాని దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని మాత్రం పట్టుకోలేదు.
రాజ్యాంగాన్ని వెక్కిరిస్తారా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారా? చట్టాలని దిక్కరిస్తారా? న్యాయాన్ని ధర్మాన్ని కాలరాస్తారా? ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి ధర్మం? ప్రభుత్వం అంటే సజ్జల ఒక్కడేనా? ముఖ్యమంత్రి మౌన ముని ఆయన ఎటూ మాట్లాడడు? ఆయన ఏ భాషలో మాట్లాడినా తప్పులు వస్తాయి. నీలం సాహ్ని ఎన్నికలను నిర్వహించుకోవడం విఫలం అయ్యారు. ప్రభుత్వంలో ఏ శాఖ విధానాలు ఆ శాఖ మంత్రో, ఆ అధికారో చెప్పాలి గాని సజ్జల ఎవరు మాట్లాడటానికి? సజ్జలే ముఖ్యమంత్రి నేను కాదని జగన్ రెడ్డిని చెప్పమనండి. హోం మంత్రిని సైతం సజ్జల పక్కన పెట్టారు. ప్రజలు జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేశారు గాని సజ్జలను కాదు. ఇంకో సారి సజ్జల ప్రెస్ మీట్ పెడితే ఇతనే ముఖ్యమంత్రి అని ప్రచారం చేస్తాం.