Suryaa.co.in

Andhra Pradesh

కృష్ణా నదిపై తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిలుపుదల చేయాలి

– ఆంధ్రా రైతుల నీటి హక్కులను కాపాడాలి.
– కె.అర్.ఎం. బీ. ఉప సంఘం చైర్మన్ ఆర్.కె.పీళ్లై కు విజ్ఞప్తి చేసిన సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు
ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు
కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలమేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన గెజిట్ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ప్రక్రియలను పూర్తి చేసి ఆపరేషన్ ప్రోటోకాల్ ను అమలు చేయటానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు ఉపసంఘం చైర్మన్ ఆర్.కె.పీళ్లై నేతృత్వంలోని ప్రతినిధుల బృందం క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా గా నాగార్జున సాగర్ డ్యాం లోని లో లెవెల్ కెనాల్ పంప్ హౌజ్ దగ్గరకు వచ్చిన సందర్భం గా, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మాజీ ఎపెక్స్ కమిటీ సభ్యులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు నేతృత్వంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ యనమద్ది పుల్లయ్య చౌదరి తదితరులు కలిసి ఆంధ్రప్రదేశ్ రైతులకు నాగార్జున సాగర్ ఎడమ కాలువ, కుడి కాలువల పై జరుగుతున్న అన్యాయం, ఇతర వివరాలపై పూర్తి వివరాలతో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ శ్రీశైలం ఎగువ భాగాన తెలంగాణ ప్రభత్వం C.W.C, కె.ఆర్.ఎం.బి, ఎపెక్స్ కౌన్సిల్ తదితర చట్టబద్ధ సంస్థల నుంచి ఏ విధమైన అనుమతులు తీసుకోకుండా పాలమూరు 90 టీ.ఎం.సీ.లతోనూ, దిండి 30 టీ.ఎం.సీ.లతో అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుందని దీనిమీద 2016 లో రిట్ పిటిషన్ 116 ద్వారా సుప్రీం కోర్టును ఆంధ్రా రైతులు ఆశ్రయించగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులేనని సుప్రీం కోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది.
దేనిమీద 2016 సెప్టెంబరులో జరిగిన మొదటి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ, తరువాత 2021 ఫిబ్రవరిలో జరిగిన రెండవ ఎపెక్స్ కౌన్సిల్ సమవేశంలోనూ నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులకు న్యాయం జరగలేదని, దీనిమీద నిరంతరం కె.అర్.ఎం.బి. కి, కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నామని అలాగే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి కేటాయించిన 811 టీ.ఎం.సీ లలో తెలంగాణకు 299 టీ.ఎం.సీ.లు ఆంధ్రప్రదేశ్ కు 512 టీ.ఎం.సీ.లు, తాత్కాలిక కేటాయింపులు ఉండగా శ్రీశైలం దిగువ భాగాన ఆంధ్రప్రదేశ్ కు 380 టీ.ఎం.సీ.లు, తెలంగాణ కు 121 టీ.ఎం.సీ.లు జలవిద్యుత్ ద్వారా వాడుకునే అవకాశం ఉండగా చట్టవిరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ అవసరాలు లేని సమయం లో శ్రీశైలం, నాగార్జున సాగర్,పులిచింతల, జలవిద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసి వృధాగా 150 టీ.ఎం.సీ లకు పై గా సాగునీటిని క్రిందకు వదలటం వల్ల ఆంధ్రా ప్రాంతంలో నీటి నిల్వకు అవకాశం లేక సాగునీరు అంతిమంగా ప్రకాశం బ్యారేజి నుంచి సముద్రంలోకి వెళ్ళేటట్లు చేస్తుందని, దేనివలన వ్యసాయ అవసరాలు ఉన్నప్పుడు ఆంధ్రప్రాంత రైతులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని, తెలంగాణలో కామన్ ప్రాజెక్టులలో ఉన్నటువంటి అన్ని జలవిద్యుత్ కేంద్రాలు కె.అర్. ఎం. బి. పరిధిలోకి తీసుకుని అక్రమ జలవిద్యుత్ ఉత్పాదనకు అడ్డుకట్ట వేయాలని ఉపసంఘం ఛైర్మెన్ అర్. కె. పీళ్లై ని కోరారు.
అలాగే గతంలో కె.అర్.ఎం. బి దగ్గర జరిగిన ఒప్పందం ప్రకారం నీటి విడుదల ఆంధ్రప్రదేశ్ 70, తెలంగాణ కు 30 శాతం జరగాలని ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం 50-50 శాతం ఇరు రాష్ట్రాలకు జరగాలనే తెలంగాణ ప్రభుత్వ చట్టవ్యతిరేక వాదనకు అడ్డుకట్ట వేయాలని, అట్లాగే శ్రీశైలం, నాగార్జున సాగర్ కామన్ ప్రాజెక్టులలో హెడ్ రెగ్యులేటర్లు, కాలువలు మొత్తం కె.అర్. ఎం. బి అధీనంలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీ.ఐ.ఎస్.ఎఫ్. బలగాలతో నేఘా ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ లోని చివరి అయకట్టువరకు సాగునీరు అందయనికి చర్యలు తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం గతం లో కె.అర్.ఎం. బి. లో ఇరు రాష్ట్రాలు చేసిన తీర్మానం మేరకు రెండు రాష్ట్రాలకు రైల్,రోడ్డు, విమాన సౌకర్యం ఉన్న కృష్ణానది బేసిన్ విజయవాడ లోని కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, శ్రీశైలం ఎగువ భాగాన తెలంగాణ ప్రభత్వం ఏ విధమైన అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా 250 టీ.ఎం.సీ లతో కోతప్రోజెక్టులు, 105 టీ.ఎం.సీ లతో విస్తరణ చేస్తే శ్రీశైలం దిగువ భాగాన, నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల క్రింద ఉన్న 15 లక్షల ఏకరాలు, ప్రకాశం బ్యారేజి క్రింద ఉన్న 13లక్షలు, ఎస్.అర్.బీ.సీ క్రింద ఉన్న 2లక్షల మొత్తం 30 లక్షల ఎకరాల ఆయకట్టు బీడుబారే ప్రమాదం ఉన్నందున వీటికి అడ్డుకట్ట వేసి ఆంధ్రా రైతుల నీటి హక్కులను కాపాడాలని కె.అర్. ఎం. బి. ఉపసంఘం ఛైర్మెన్ అర్. కె. పీళ్ళై కి విజ్ఞప్తి చేశారు.
నాగార్జున సాగర్ ఎడమ కాలువ కీ. మీ.73,77,83,94 దగ్గర గతం లో నిర్మించిన క్రాస్ వాల్స్ ను ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం 2 మీ. ఎత్తు నుంచి 3.35 మీటర్లు ఎత్తుకు పెంచటంవల్ల ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా 3వ జోన్ లో ఉన్న ఆయకట్టుకు సాగునీరు రాక రైతులు ఇబ్బంది పడుచున్నారని వీటిని తొలగించి 3వ జోన్ ఆయకట్టు రైతులకు న్యాయం చేయాలని,అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం 2014 కి ఉన్న వెలుగొండ ప్రాజెక్టును కేంద్ర గెజెట్ లో చేర్చాలని, వివాదం లేని ప్రకాశం బ్యారేజి ని కేంద్ర గెజెట్ నుంచి తొలగించాలని కె.అర్. ఎం. బి ఉపసంఘాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ లు బొర్రా అశోక్ కుమార్ (కృష్ణా), అంకాళ్ళ ప్రభు దాసు (గుంటూరు), ఉప్పలపాటి చక్రపాణి(ప్రకాశం), కవులూరి రాజా చంద్రమౌళి (కృష్ణా), నర్సరావుపేట పార్లమెంట్ టీడీపీ కమిటీ అధికార ప్రతినిధి పూజల వెంకట కోటయ్య,మండల టీడీపీ అధ్యక్షులు అంచుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE