వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదే శవరాజకీయాలు

– 40 కోట్ల సుపారీ స్తోమత ఎవరికి ఉంది.?
– అవినాష్ రెడ్డి,భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి కాక మరెవరు.?
– గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుంటూరు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ…సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన వైయస్ వివేకానంద రెడ్డి హత్య ఉద్దేశించి వైసీపీ పార్టీ నాయకులు చేసిన ప్రచారం మరియు సాక్షి ఛానెల్ ,పత్రిక ఏ విధంగా గత రెండు సంవత్సరాలపైగా హత్యను రకంగా ప్రచారంలోకి తీసుకువచ్చారు అనే అంశాలపై మాట్లాడడం అన్నారు.
15 మార్చి 2019 న మాజీ ఎంపీ గారు,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి హత్యగావించ బడ్డారన్నారు. మొట్టమొదటిగా ఈ హత్యను ఆ కుటుంబం యొక్క పత్రిక, సాక్షి ఛానెల్ ప్రచురించిన విధానం ఒక సారి గమనించాలన్నారు. 7 గంటల 15 నిమిషాలకు వాళ్లు ప్రచారం చేసి గుండె పోటు అని నమ్మించాలని చూశారన్నారు.
వైసీపీ నాయకులు విజయసాయి రెడ్డి ఆయన మరణం రాష్ట్రానికి, వైసీపీ పార్టీకి తీరని నష్టం అని చెప్పి తర్వాత హత్య అన్నారు. హత్య జరిగిన రోజే తెలుగుదేశం పార్టీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసిందన్నారు. ఆ హత్య ఉదంతం ఇతరుల మీద నెట్టి శవరాజకీయాలు చేస్తుందన్నారు. వైయస్సార్ పార్టీ పునాది అవినీతి,శవ రాజకీయాలు అన్నారు.
తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని రాజకీయాలు చేసే మీరు ఇతరులను దూషించడం దురదృష్టకరమన్నారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మీద నమ్మకం లేదన్న మీరు మీ ప్రభుత్వం వచ్చాక ఏం చేశారన్నారు.? సిబిఐ ఎంక్వైరీ వద్దని పిటిషన్ విత్డ్రా చేసుకున్నారరన్నారు. పిటిషన్ల వేసి వెనక్కి తీసుకుంటూ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ చంద్రబాబు మీద దుష్ప్రచారం చేయడం వైసీపీ పార్టీకి ఒక అలవాటుగా మారిందన్నారు.
మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ మీద నమ్మకం లేక మీ సోదరి వైయస్ సునీత ఢిల్లీ వెళ్లి సిబిఐ ను కలిసి ప్రెస్ మీట్ పెట్టాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని అన్నారు.? సొంత తండ్రి,బాబాయ్ హత్యలను రాజకీయంగా వాడుకున్న మీరు సామాన్యుల హక్కులను పరిరక్షిస్తామని నమ్మకం మాకు లేదన్నారు.
2019 ఎన్నికల ముందు వివేకానంద గారిని హత్య చేసింది చంద్రబాబు నని నారాసుర రక్త చరిత్ర అని మీ పేపర్ లో పెద్ద పెద్ద వార్తలు రాసిన మీరు ఈ రోజు మాట్లాడరా అని ప్రశ్నించారు.? మీ తండ్రి వైయస్ రాజశేఖర్రెడ్డి మరణించినప్పుడు ఆ నెపం అంబానీ పై వేసి ఈరోజు అంబానీ ముఖ్య అనుచరుడికి రాజ్యసభ ఇచ్చారన్నారు.
కోడి కత్తి కేసును సానుభూతిగా వాడుకొని రాజకీయం చేశారన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం పరిశీలిస్తే హత్య వెనక వైయస్ ఫ్యామిలీ ఉందన్నారు. హత్య వెనుక 40 కోట్ల రూపాయల డీల్ జరిగిందంటే ఇది అంత స్థాయి వ్యక్తులు చేయించడం అనేది ఆలోచించాలన్నారు.
ఒకసారి చరిత్ర చూసుకుంటే పరిటాల రవీంద్ర కూడా పార్టీ ఆఫీసులోనే హత్య చేయబడ్డారన్నారు. సొంత కుటుంబం విషయాలను ఇంత కర్కశంగా ఉండే మీకు పాలించే అర్హత లేదని,వివేకానంద గారి హత్య కేసును త్వరగా సిబిఐ ఎంక్వైరీ చేసి నిందితులను శిక్షించాలని కోరారు.

Leave a Reply