– బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి
పశ్చిమ నియోజకవర్గం లో వైసీపీకి చోటు లేదని బిజెపి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం 35వ డివిజన్లోని పూర్ణానందంపేట పెజ్జోని పేట బాప్టిస్ట్ పాలెం తదితర ఏరియాలలో పర్యటించారు. అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల అనంతరం వంద రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తారని స్పష్టం చేశారు. నియోజవర్గ అభివృద్ధిని విస్మరించిన వైసీపీ నేతలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలి అన్నారు. ఏపీ ప్రయోజనాల కోసమే కూటమిగా జతకట్టామని ప్రజలందరూ ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జ్ బుద్ధా వెంకన్న టిడిపి అధికార ప్రతినిధి నాగుల మీరా టిడిపి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ 35వ డివిజన్ టిడిపి అధ్యక్షురాలు బూదాల నందకుమారి జనసేన డివిజన్ ప్రెసిడెంట్ నారాయణస్వామి ప్రదీప్ రాజ్ బిజెపి డివిజన్ ఇంచార్జ్ డాక్టర్ హనుమంతరావు మాజీ కార్పొరేటర్ ముప్పా వెంకటేశ్వరరావు బిజెపి టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.