– ప్రజల సొమ్ముకొట్టేయడం.. షెల్ కంపెనీలతో దాన్ని మాయం చేసి, తిరిగి తన కంపెనీల్లోకి రాబట్టుకోవడం జగన్ కు మాత్రమే అబ్బిన అవినీతి విద్య
– అసత్య ఆరోపణలతో కాలయాపన చేయకుండా ఏ షెల్ కంపెనీల నుంచి, ఏ టీడీపీ నేతల ఖాతాలకు డబ్బులువచ్చాయో వారంలో జగన్ బయటపెట్టాలి
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో జగన్ మతిభ్రమించింది. అందుకే పసలేని అసంబద్ధ ఆరోపణలతో పవిత్రమైన శాసనసభను అపవిత్రం చేశాడు. అసెంబ్లీ సాక్షిగా కట్టుకథలు అల్లి, ప్రజల్ని నమ్మించే ప్రయత్నంచేశాడు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లోఅవినీతి జరిగితే, దానికి సంబంధించిన ఒప్పందం మొదలు, ప్రాజెక్ట్ కార్యకలాపాలు అమలు వరకు భాగస్వాములైన అధికారుల్ని ఏపీ సీఐడీ ఎందుకు విచారించదు? సీమెన్స్ సంస్థను, దానిలోని ఉద్యోగుల్ని సీఐడీ ఎందుకు ఇప్పటివరకు టచ్ చేయలేదు? ప్రాజెక్ట్ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వవాటా రూ.371కోట్లు అయితే, ఆమొత్తంసొమ్ము మాయమైతే, రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఎలా అమలైంది.
కళాశాలల్లో నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఎలా ఏర్పడ్డాయి. 2.94లక్షల మంది యువత శిక్షణ ఎలా పొందారు.. 70 వేలమందికి ఉద్యోగాలు ఎలా వచ్చాయో జగన్ చెప్పాలి. 28 రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద ఉన్న సొమ్ము మొత్తం కలిపినా జగన్ సొమ్ముకి సరిపోదు. అంతసొమ్ము అక్రమమార్గంలో కొల్లగొట్టినవ్యక్తి, మచ్చలేని చంద్రబాబుపై ఆరోపణలుచేస్తుంటే తెలుగు ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎక్కడా, ఎలాంటి అవినీతిలేని స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై జగన్మోహన్ రెడ్డి పవిత్రమైన అసెంబ్లీలో నిన్న 2 గంటలపాటు అసంబద్ధ ఆరోపణలు చేశాడని, దొంగే దొంగదొంగ అన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఉందని, రూ.371 కోట్ల అవినీతిసొమ్ము ఎక్కడి నుంచి ఎవరికి వచ్చిందో చెప్పకుండా ఊరికే నిందారోపణలు చేయడం సిగ్గుచేటని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు స్పష్టంచేశారు. మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే … “తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షలకోట్ల అవినీతికి పాల్పడి, సీబీఐ ఈడీ విచారణలు ఎదుర్కొని, రూ.43 వేలకోట్లు ఈడీ జప్తు చేస్తే, 16నెలలు జైల్లో ఉండి వచ్చిన జగన్, మచ్చలేని చంద్రబాబునాయుడిపై అవినీతి ఆరోపణలు చేస్తుంటే, రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఆరోపణ: హైదరాబాద్ లోని టిడిపి నేతల అకౌంట్ లోకి డబ్బులు చేరాయి
వాస్తవం: స్కిల్ డెవలప్ మెంట్ లో షెల్ కంపెనీల ద్వారా అవినీతి సొమ్ము విదేశాలకు వెళ్లి తిరిగి హైదరాబాద్ కు వచ్చిందని జగన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి వద్ద ఆధారాలు ఉంటే ఎందుకు బయటపెట్టడంలేదు? ఎవరి అకౌంట్ కి, ఏ నంబంర్ అకౌంట్ కి ఎంత డబ్బులు వచ్చాయో ఎందుకు చెప్పలేకపోతున్నారు. లేని అవినీతిని చంద్రబాబు నాయుడికి అంటించడానికి జగన్ రెడ్డి మూడేళ్లుగా విశ్వప్రయత్నం చేస్తున్నాడు. కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లుగా నిన్న అసెంబ్లీలో జగన్ రెడ్డి తీరు ఉంది. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా తన కంపెనీల్లోకి అవినీతి సొమ్మును మళ్లించుకున్న చరిత్ర జగన్ రెడ్డిది. మారిషస్, లక్సెంబర్గ్, బ్రిటీష్ వర్జీనియా ఐలాండ్ లాంటి దేశాల్లోనూ జగన్ రెడ్డి షెల్ కంపెనీలు పెట్టిన మాట వాస్తవం కాదా? బాలినేని శ్రీనివాసరెడ్డికి చెందిన సొమ్ము, హావాలా ద్వారా చెన్నైలోని జగన్ షెల్ కంపెనీలకు తరలిస్తుండగా పట్టుబడింది నిజంకాదా? ఆ వెంటనే జగన్ భార్యభారతి చెన్నైలోని కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామాచేయలేదా? ఆర్ధిక లావాదేవీల్లో ఉగ్రవాదులు వాడే భాష కూడా జగన్ రెడ్డికి బాగా తెలుసు. తెలుగురాష్ట్రాలకు క్విడ్ ప్రోకో, మనీలాండరింగ్ ను పరిచయం చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డే.
జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గరనుంచీ లక్షలకోట్లు కొల్లగొట్టి, హావాలాద్వారా విదేశాలకు తరలిస్తూనే ఉన్నాడు. తన కేబినెట్ లో మంత్రిగా పని చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి, హావాల ద్వారా కోట్లాది రూపాయలు చెన్నైకి తరలిస్తుంటే పట్టుకున్నారు. ఆసొమ్ము ఎక్కడికి పోతుందా అని ఆరాతీస్తే, చెన్నైలో ఒకే అడ్రస్ తో నాలుగుషెల్ కంపెనీలు ఉన్నట్టు గుర్తించారు. ఆయా కంపె నీలు అన్నింటికీ వై.ఎస్.భారతి (జగన్ భార్య) , వై.ఎస్.అనిల్ రెడ్డి, వై.ఎస్. సునీల్ రెడ్డి, వై. ఎస్. మలినీరెడ్డి, వై.ఎస్.కులశ్రీ రెడ్డిలు డైరెక్టర్లుగా ఉన్నది నిజంకాదా? హవాలా సొమ్ము పట్టుబడ్డాక, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ సంస్థలో డైరెక్టర్ గా ఉన్న భారతిరెడ్డి, రాత్రికి రాత్రి ఆపదవికి రాజీనామాచేసింది నిజంకాదా? షెల్ కంపెనీలు సృష్టించడం.. లక్షలకోట్లప్రజలసొ మ్ముకొల్లగొట్టి, దాన్ని విదేశాలకుతరలించి, తిరిగి తనకంపెనీల్లోకి వచ్చేలాచేయడం జగన్ కు, అతనికుటుంబసభ్యులకు అవినీతితో అబ్బిన విద్య అనే చెప్పాలి. జగన్ అవినీతిలో భా గస్వామ్యమైన కంపెనీలజాబితానే పెద్దచాంతాడంత ఉంది. 64కంపెనీలు జగన్మోహన్ రెడ్డిపై ఉన్న 12 ఛార్జ్ షీట్లలో ఉన్నాయి. వాటిలో 70శాతంకంపెనీలు జగన్మోహన్ రెడ్డివి…అతని బినామీలు, బంధువులవే.ఈ విధంగా లక్షలకోట్లు కొట్టేసి జైలుకెళ్లిందిచాలక, సిగ్గులేకుండా ఇంకా ఏముఖం పెట్టుకొని చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు తప్పుచేశాడని నిరూపించడానికి రాజశేఖర్ రెడ్డి ప్రయత్నించి భంగపడ్డాడు. ఇప్పుడు జగన్ అదేపనిగా తవ్విన కొండనే తవ్వుతూ, మరలా చంద్రబాబుకి అవినీతి మకిల అంటించాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ కోవలనే నిన్న అసెంబ్లీసాక్షిగా అర్థంపర్థంలేని చౌకబారు ఆరోపణలు చేశాడు.
ఆరోపణ: స్కిల్ డెవలప్ మెంట్ లో రూ.371 కోట్ల అవినీతి:
వాస్తవం: స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కి రాష్ట్ర ప్రభుత్వం తనవాటాగా ఇచ్చిన రూ.371కోట్లు, టీడీపీనేతల ఖాతాల్లోకి వస్తే, ప్రాజెక్ట్ రాష్ట్రంలో ఎలా అమలైంది. 2.94లక్షలమంది యువత ఎలా శిక్షణపొందారు, వారిలో 70వేలమందికి ఉద్యోగాలు ఎలావచ్చాయి? షెల్ కంపెనీలద్వారా టీడీపీనేతల ఖాతాల్లోకి వచ్చాయన్న జగన్ ఆరోపణలు పచ్చి అబద్ధాలు, నిరాధారాలు. ఒప్పందం ప్రకారం రాష్ట్రంలోని 40 కళాశాలల్లో నైపుణ్యశిక్షణా కేంద్రాలను ఏర్పాటుచేసింది నిజంకాదా? ఆ కేంద్రాల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.94లక్ష లమంది యువత శిక్షణ తీసుకున్నది నిజంకాదా? వారిలో దాదాపు 70వేలమందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించింది వాస్తవం కాదా? ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం, నైపుణ్యాభివృద్ధి శిక్షణకేంద్రాల్లో సీమెన్స్ సంస్థ అవసరమైన సాఫ్ట్ వేర్, పరికరాలు, యంత్రా లు ఏర్పాటు చేసిందో లేదో చూడాలని జగన్ ప్రభుత్వం శరత్ అండ్ అసోసియేట్స్ అనే సంస్థతో తనిఖీలు చేయించింది నిజంకాదా? అదేసంస్థను ఫిజికల్ వెరిఫికేషన్ చేయవద్దని జగన్ ప్రభుత్వ ఆదేశించలేదా? ఆ సంస్థ అన్నికేంద్రాల్లో అన్నిరకాల పరికరాలు, సాఫ్ట్ వేర్ ఉన్నా యని నివేదికఇస్తే, ఎక్కడ తమపరువు పోతుందోనన్న భయంతోనే జగన్ , అతని ప్రభుత్వం ఫిజికల్ వెరిఫికేషన్ కు అనుమతి ఇవ్వలేదా? స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో ఎక్కడా, ఎలాంటి అవినీతి జరగలేదని, ముఖ్యమంత్రికి, అతని ప్రభుత్వానికి తెలుసు. కాబట్టే ముఖ్యమంత్రి అసలువాస్తవాలు బయటపెట్టకుండా, ఉత్తుత్తి ఆరోపణలు, ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నాడు.
ఆరోపణ: చంద్రబాబు నాయుడు సీఎస్ కు ఓరల్ ఆర్డర్స్ (స్పీకింగ్ ఆర్డర్స్) ఇచ్చారు.
వాస్తవం: స్కిల్ డెవలప్మెంట్ పై సి.ఎస్ మరియు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీలు రాసిన నోట్ ఫైల్ లో చంద్రబాబు నాయుడు స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చినట్లు జగన్ రెడ్డి చెబుతున్నాడు. చంద్రబాబునాయుడు కేవలం చెప్పారని మాత్రమే సి.ఎస్ మరియు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీలు నోట్ ఫైల్ లో రాసారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్పీకింగ్ ఆర్డర్స్ తప్పని వారు ఎక్కడా రాయలేదు.చంద్రబాబునాయుడు చెప్పిన దాంట్లో తప్పుఉంటే సి.ఎస్ ఎందుకు అబ్జెక్షన్ నోట్ పెట్టలేదు? ముఖ్యమంత్రి రోజువారీ పరిపాలన కార్యకలాపాలలో స్పీకింగ్ ఆర్డర్స్ ఇవ్వడం సర్వసాధారణం. మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాన్ పిక్ స్కాంలో స్పీకింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదా? మీ తండ్రి ఇచ్చిన ఆదేశాలపై నాటి అధికారులు అభ్యంతరం తెలిపినా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాన్ పిక్ కు ఆమోదం తెలిపారు.
ఆరోపణ:టెండర్ పిలవకుండా ఒప్పందం చేసుకున్నారు
వాస్తవం: టెండర్ పిలవకుండా స్కిల్ డెవలప్మెంట్ ఒప్పందం చేసుకున్నారని జగన్ రెడ్డి తప్పు పడుతున్నాడు. సీమెన్స్ తో ఒప్పందం చేసుకున్న గుజరాత్, కర్నాటక, జార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు టెండర్ లేకుండానే ఒప్పందాలు చేసుకున్నాయని జగన్ రెడ్డికి బహుశ తెలియదేమో. ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో ఏపీ ప్రభుత్వం వాటా కేవలం 10 శాతం మాత్రమే. కానీ, గుజరాత్, కర్నాటక రాష్ట్రాలు 20 శాతం ప్రభుత్వ వాటాతో సీమెన్స్ తో ఒప్పందాలు చేసుకున్నాయి. భారీ స్థాయిలో స్కాంలు చేసుకునేందుకు టెండర్లు ఇవ్వకుండా నామినేషన్ పద్దతిలో కాంట్రాక్టులకు దోచిపెట్టిన చరిత్ర నీది. బైజూస్ కు రూ.688 కోట్లు నామినేషన్ పద్దతిలో ఇచ్చి కమీషన్ల కక్కుర్తికి పాల్పడింది నువ్వుకాదా?
ఆరోపణ: కేబినెట్ ఆమోదం ఆ తర్వాత ఇచ్చిన జీవో లో ఉన్న అంశాలను అగ్రిమెంట్ లో మార్చేశారు
వాస్తవం: మంత్రులు చేసిన క్యాబినెట్ నిర్ణయం, ఆ తర్వాత ఇచ్చిన జీవోలో సీమెన్స్ వాటా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ప్రస్తావించి ఒప్పందంలో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని రాసారని జగన్ రెడ్డి మాట్లాడుతున్నారు. జీవోను తయారుచేసి ఒప్పంద కుదుర్చుకున్న 6 మంది ఐఏఎస్ అధికారులకు కనిపించని తప్పు జగన్ రెడ్డికి మాత్రమే కనిపించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైన జగన్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయినట్లు ఉంది. అందుకే స్కిల్ డెవలప్ మెంట్ లో లేని అవినీతి జగన్ రెడ్డికి మాత్రమే కనిపిస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ఒప్పందంపై సంతకం చేసిన ఐఏఎస్ అధికారి ప్రేమచం ద్రారెడ్డిని ఇప్పుడు జగన్ పక్కనే పెట్టుకున్నాడు. అతన్ని ఎందుకు విచారించడం లేదు? అలానే , ఎస్.ఎస్.రావత్, అజయ్ జైన్, రవిచంద్రారెడ్డి, ఉదయలక్ష్మి, లక్ష్మీనారాయణ వీళ్లందరినీ వైసీపీ ప్రభుత్వం ఎందుకు విచారించడం లేదు? సీమెన్స్ కంపెనీ సిబ్బందిని ఎందుకు ఇప్పటివరకు టచ్ చేయలేదు? ఇవేవీ చేయకుండా పొద్దున లేస్తే చంద్రబాబు జపం చేస్తూ, జగన్ అవినీతి గురించి మాట్లాడుతుంటే దేశప్రజలే నోళ్లు వెళ్లబెడుతున్నారు. 28 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి వద్ద లేనంత సొమ్ము జగన్ వద్దే ఉంది. అందరు ముఖ్యమంత్రుల ఆస్తి మొత్తం కలిపినా, జగన్ ఆస్తికి సరి తూగదు. అలాంటి వ్యక్తి పైసా అవినీతి చేయని చంద్రబాబుపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు.
సెంట్రల్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అనే కేంద్ర సంస్థ ప్రాజెక్టు అంచనాలను క్షుణ్ణంగా పరిశీలించి అన్ని సరిగానే ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా ఆరోపణలు చేయడం జగన్ రెడ్డి సైకో మనస్థత్వానికి నిదర్శనం. శరత్ అసోసియేట్స్ చేసిన వెరిఫికేషన్ లో సైతం 40 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలకు సీమెన్స్ పరికరాలు అందాయని చెప్పిన వాస్తవం జగన్ రెడ్డికి తెలియదా? స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై వచ్చిన అవినీతి ఆరోపణల నిజానిజాలు నిగ్గుతేల్చే పనిలో ఈడీ ఉంది. ఒకపక్క ఈడీ విచార ణజరుగుతుండగానే, జగన్ సీఐడీతో సమాంతర విచారణ జరిపిస్తున్నాడు. అంతటితో ఆగక నిన్న అసెంబ్లీలో దానిపై మాట్లాడటం ఈడీ విచారణను ప్రభావితంచేయడం కాదా? స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో జరిగిందని జగన్ చెబుతున్న అవినీతి అంతా కట్టుకథే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో, ప్రజలంతా నరకాసురపాలనకు చంద్రబాబు ముగింపు పలకబోతున్నాడని ఆనందిస్తున్న తరుణంలో జగన్ కావాలనే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై బురదజల్లుతున్నాడు. జగన్ కు దమ్ము, ధైర్యం ఉంటే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని చెబుతున్న డబ్బు, ఎక్కడి నుంచి ఎవరి ఖాతాలకు వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో వారంలో నిరూపించాలని సవాల్ విసురుతున్నాం.
ప్రజలు తనకు, తన ప్రభుత్వానికి చెప్పుతో కొట్టినట్టు తీర్పు ఇచ్చారన్న అక్కసుతోనే జగన్, చంద్రబాబుపై, టీడీపీ పై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నాడు. చంద్రబాబు అవినీతిపై జగన్ చేస్తున్న ఆరోపణలు కొత్తవి కాదు. గతంలో ఆయన తండ్రి, తల్లి కూడా ఇలానే ఆరోపించి, తప్పుడు రాతలతో పుస్తకాలు ముద్రించి చివరకు ఏం చేయలేక జారుకున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పిచ్చిపిచ్చిగా మాట్లాడటం.. నాలుగేళ్లలో కొండను తవ్వి జగన్ ఎలుకతోక మీద ఈకనుకూడా పట్టలేకపోయాడు. జగన్ కు రోజులు దగ్గరపడ్డాయి. ముఖ్యమంత్రి పని అయిపోయిందని అధికారులందరూ గుర్తిస్తే మంచిది. అతని అండతో తప్పుడు పనులు చేసేవారంతా జైలుకెళ్లక తప్పదు. జగన్మోహన్ రెడ్డి అవినీతికి సహకరించి, ఎందరు అధికారులు జైలు ఊచలు లెక్క పెట్టారో గుర్తుంచుకోండి. చంద్రబాబు వద్ద పనిచేసిన అధికారులు చిన్న మచ్చకూడా లేకుండా దర్జాగా, గౌరవంగా బతుకుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పాపాల చిట్టా బయట పెడితే, అధికా రులకు ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఆకాశంమీద జగన్ ఉమ్మేస్తున్నాడు..తిరిగి అది అతని ముఖంపైనే పడుతుంది.. తుడుచుకుంటూ కూర్చుంటాడు.” అని ఆనంద్ బాబు ఎద్దేవాచేశారు.