• రూ.281 కోట్ల వ్యయమైన ప్రాజెక్ట్ లో రూ.2 వేలకోట్ల అవినీతి జరిగిందంటున్న వీళ్లకంటే పరమానందయ్య శిష్యులే నయం
• ప్రాజెక్టులో లోకేశ్ కీలకంగా వ్యవహరించాడు…అతని సంతకం ఉందంటున్న వారు.. అధికారుల సంతకాలపై ఎందుకు మాట్లాడరు?
• ప్రాజెక్ట్ విధివిధానాల్లో ప్రముఖపాత్ర వహించిన అధికారుల్ని విచారించకుండా… లోకేశ్ ది తప్పని ఎలా చెబుతారు?
– టీడీపీ వాణిజ్యవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేశ్
ఆంధ్రరాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రపంచమంతా గమనిస్తోందని, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని అక్రమంగా జైలుకు పంపిన జగన్ రెడ్డి అండ్ కోకి ఇప్పుడు లోకేశ్ ఫోబియా పట్టుకుందని, ఏపీ.ఎస్.ఎఫ్.ఎల్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్) ప్రాజెక్ట్ ను తెరపైకి తెచ్చి వైసీపీ నేతలు, మంత్రులు ఇంగితజ్ఞానం లేకుండా టీడీపీ యువనేతకు ఏవేవో ఆపాదిస్తూ.. ఏదేదో మాట్లాడుతున్నారని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డూండీ రాకేశ్ తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే….
“ టీడీపీ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ను ఏపీలో అమలు చేయడానికి మూలం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీ.బీ.ఎన్.ఎల్ (భారత్ బ్రాండ్ బ్యాండ్ నెట్ లిమిటెడ్) ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ లో భాగంగా నాడు చంద్రబాబునాయుడు పేదలు, మధ్యతరగతి, చిన్నాచిత కా వ్యాపారులకు తక్కువ ఖర్చుతోనే కేబుల్ కనెక్షన్, ఇంటర్నెట్, టెలిఫోన్ సదుపా యం కల్పించాలని నిర్ణయించారు. నేటి సమాజంలో చదువుతో పనిలేకుండా ప్రతి ఒక్కరూ టీవీ.. ఇంటర్నెట్ వినియోగంలో మునిగి తేలుతున్నారు. కానీ అందుకోసం నెలకు రూ.600 నుంచి రూ.1000వరకు ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి.
అలాంటి పరిస్థితు ల్లో దూరదృష్టితో ఆలోచించిన చంద్రబాబునాయుడు బీ.బీ.ఎన్.ఎల్ ప్రాజెక్ట్ లోభాగం గా ఏపీలో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ అమలుకు శ్రీకారం చుట్టాడు. అందుకోసం కారుచౌకగా నెలకు కేవలం రూ.149కే కేబుల్ కనెక్షన్.. ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యాన్ని అదుపులోకి తీ సుకొచ్చారు.టీడీపీ ప్రభుత్వ తక్కువ ధరలో అమల్లోకి తీసుకొచ్చిన ఈ సదుపాయం ముఖ్యంగా చిరువ్యాపారులకు బాగా ఉపయోగపడిందనే చెప్పాలి.
ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ అమలుకోసం నాటి టీడీపీ ప్రభుత్వం నిపుణులు, అధికారులతో ఒక కమిటీ వేసి సాధ్యాసాధ్యాల అమలుపై నివేదిక ఇవ్వాలని సూచించింది. ఆ కమిటీ నివేదిక అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్ట్ అమలుకోసం మార్గదర్శకాలు సూచిస్తూ రూ.330కోట్లతో టెండర్లు పిలిస్తే.. రూ.321కోట్లకే టెండర్ ఫైనల్ అయ్యింది. తరువాత ప్రాజెక్ట్ పనుల్ని ఎమ్.ఎన్.సీ స్థాయి కంపెనీలకే నాటి ప్రభుత్వం అప్పగించింది.
కొరియన్ కంపెనీ అయిన డాట్సన్ అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన 10 లక్షల సెట్ టాప్ బాక్సులు అందించింది. ఆ బాక్సుల్లోనే టీవీ కనెక్షన్ తోపాటు..ఇంటర్నెట్, టెలి ఫోన్ కనెక్షన్లు రెండూ ఏర్పాటు చేసుకోవచ్చు. తరువాత ఇతరత్రా పనులు పూర్తై.. మొత్తంగా ప్రాజెక్ట్ దిగ్విజయంగా అమలైంది. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ అమలయ్యాక, టెండర్ ఫైనల్ అయ్యింది రూ.321కోట్లకు అయితే, నాటి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తక్కువకే పనులు చేయించి.. ఫైనల్ గా చెల్లించింది కేవలం రూ.284 కోట్లు మాత్రమే.
విద్యుత్ స్తంభాల మీదుగా కేబుల్ వేయడం వల్ల అనుకున్నదానికంటే తక్కువ ఖర్చులోనే ప్రాజెక్ట్ ను నాటి టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయగలిగింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు కూడా ఫైబర్ నెట్ కేబుల్ ను నాటి టీడీపీ ప్ర్రభుత్వం తీసుకెళ్లగలిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన అందించడా నికి కూడా ఈ ప్రాజెక్ట్ ను సమర్థవంతంగా అమలుచేశారు. పంచాయతీలు.. సచివా లయాలు.. అనేక ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఫైబర్ నెట్ కనెక్షన్లను నాటి టీడీపీ ప్రభుత్వం అందించింది.
రూ.284కోట్ల ఖర్చుతో పూర్తయిన ప్రాజెక్ట్ లో రూ.2వేలకోట్ల అవినీతి జరిగిందా? వైసీపీ నేతలు…మంత్రుల ఆరోపణలు మతిలేని ఆరోపణలు అనడానికి ఇంతకంటే రుజువేం కావాలి?
నాడు అమలుచేసిన ప్రాజెక్ట్ వల్ల నేడు అంటే ఈ రోజుకి రాష్ట్రవ్యాప్తంగా 2,600 లోకేషన్ల లో ఏపీ ఫైబర్ గ్రిడ్ యాక్టివ్ గా పనిచేస్తోంది. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పరిధిలోని 9 లక్షల కనెక్షన్ల వల్ల అక్షరాలా నెలకు రూ.22 కోట్ల ఆదాయం వస్తుంటే, అందులో కేబుల్ ఆపరేటర్లు…ఇతరఖర్చులు పోను ఈ ప్రభుత్వానికి రూ.14కోట్లు వస్తున్నాయి. 2017 లో నాటి ప్రభుత్వం ప్రారంభించిన ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రభుత్వం ఇప్పటివర కు దాదాపు రూ.700కోట్లవరకు ఆదాయం పొందింది.
ఏపీ.ఎస్.ఎఫ్.ఎల్ ప్రాజెక్ట్ చంద్ర బాబు సొంత సంస్థ కాదు.. దానిపై వచ్చే ఆదాయం ఆయన జేబుల్లోకి వెళ్లడం లేదు అనడానికి ఈ ప్రభుత్వానికి వస్తున్న ఆదాయమే నిదర్శనం. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో నిజంగా అవినీతి జరిగితే గతంలోనే జగన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ వ్యవస్థతో ఇలాంటి అనేక ప్రాజెక్ట్ లపై దాడులు చేయించి చివర కు ఏమీ తేల్చలేకపోయింది. ప్రాజెక్ట్ అమలు.. ఇతర వ్యవహారాల్లో నిజంగా తప్పులు జరిగితే, రెవెన్యూ ఇంటిలిజెన్స్ విభాగం ఎందుకు ఏమి కనిపెట్టలేదు.
తప్పు జరగని ప్రాజెక్ట్ ను బూచిగా చూపుతూ… వైసీపీనేతలు, మంత్రులు సిల్లీ ఆరోపణలు చేస్తున్నా రు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో రూ.2 వేలకోట్ల అవినీతి జరిగిందంటున్న వాళ్లకు నిజంగా మతి ఉందా? మొత్తం ప్రాజెక్ట్ అమలుకు అయిన ఖర్చు రూ.284కోట్లు అయితే రూ.2000కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని కూడా ఆలోచించరా? అలానే బయట మార్కెట్లో రూ.2,200లకు లభించే సెట్ టాప్ బాక్సుల్ని అధికధరకు నాడు చంద్రబాబు కొనిపించారని ఆరోపిస్తున్నారు.
సెట్ టాప్ బాక్సుల్లో ఎన్నిరకాలున్నాయో.. వాటి ధరలు ఎంతో కూడా తెలియకుండా వైసీపీనేతలు.. మంత్రులు పరమానందయ్య శిష్యుల కంటే అధ్వాన్నంగా మాట్లాడుతున్నారు. కేవలం టీవీ సౌకర్యానికి మాత్రమే వినియోగించే సెట్ టాప్ బాక్స్ రేటు ఒకలా ఉంటే… అదనంగా ఇంటర్నెట్.. టెలిఫోన్ సౌకర్యం వంటివి అందించే సెట్ టాప్ బాక్సుల ధరలు కాస్త ఎక్కువగా ఉంటా యి.
ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పై ప్రభుత్వం చేస్తున్నవి తప్పుడు ఆరోపణలు కాబట్టే… ప్రజలు, ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పడంలేదు
ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ లో లోకేశ్ తప్పు చేశాడు…. ఆయన సంతకం ఉంది అని ఈ ప్రభు త్వం అడ్డదిడ్డంగా వాదిస్తోంది. మొత్తం ప్రాజెక్ట్ అమలు.. ఇతరత్రా వ్యవహారాల్లో లోకేశ్ ఒక్కడి సంతకమే ఉందా..ఇతర అధికారుల సంతకాలు లేవా? వారినెందుకు విచారిం చరు? నాడు కొనుగోలు చేసిన సెట్ టాప్ బాక్సులు నాసిరకమైనవని.. డ్యామేజ్ అయ్యాయని చెబుతున్న ప్రభుత్వం దెబ్బతిన్న బాక్సుల్ని ఎందుకు బయటపెట్టడం లేదు?
డ్యామేజ్ అయిన వాటిని అవి సరఫరా చేసిన సంస్థకు తిరిగి ఎందుకు పంపలేదు? సరఫరా చేసిన 10లక్షల సెట్ టాప్ బాక్సులు పాడయితే.. 9లక్షల కనెక్ష న్లు నేటికీ ఉన్నాయని జగన్ ప్రభుత్వ ఎలా చెబుతుంది? ఇలా ప్రజలు.. ప్రతిపక్షాలు లేవనెత్తే అనేక ప్రశ్నలకు ఈ ప్రభుత్వం గానీ, వైసీపీనేతలు..మంత్రులుగానీ సమాధానం చెప్పరు. ఎందుకుంటే వారు చేసే ఆరోపణలు నిరాధారమైనవి.. తప్పుడు వని వారికీ తెలుసుకాబట్టి.
చంద్రబాబు పేరు రాష్ట్రంలో వినపడకూడదన్న దుష్ట ఆలోచన తప్ప మరేమీ లేదు
మా నాయకుడు చంద్రబాబునాయుడిని, యువనేత లోకేశ్ లను బదనాం చేయాలనే పాలకుల దురుద్దేశం తప్ప.. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్.. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్.. ఇలా ఏ అంశంపై అయినా పాలకులు చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటీ నిజంకాదు. అన్నా క్యాం టీన్లు పెట్టి పేదల ఆకలి తీరుస్తున్నాడని.. ఆ పేదలంతా చంద్రబాబుని గుర్తుంచుకుం టారనే వాటిని జగన్ రెడ్డి రద్దుచేశాడు.
అమరావతిలో నిర్మాణపనులు కొనసాగిస్తే.. అక్కడా చంద్రబాబు పేరే వినపడుతుందని, దాన్ని నామరూపాలు లేకుండా చేశారు. చంద్రబాబు 72శాతం నిర్మించిన పోలవరం పూర్తిచేస్తే.. ఎప్పటికీ ఆయన పేరే రాష్ట్రంలో వినపడుతుందన్న అక్కసుతో రాష్ట్రజీవనాడిని గోదాట్లో ముంచేశారు. ఇలాంటి ఆలోచ నలతో ఉన్న ఈ అవినీతి ముఖ్యమంత్రి…దుర్మార్గపు వైసీపీప్రభుత్వం చంద్రబాబు తప్పు చేశాడని చెప్పక… ఆయన గొప్ప వాడు.. ఎన్నో మంచిపనులు చేశాడని చెబుతాయా?” అని రాకేశ్ ఎద్దేవా చేశారు.