– బాధిత కుటుంబాలకు న్యాయంచేసేవరకు, రాష్ట్రాన్ని సారా, మద్యంరహిత రాష్ట్రంగా మార్చేవరకు ముఖ్యమంత్రిని టీడీపీ వదిలిపెట్టదు
– మాజీ మంత్రి పీతల సుజాత
జగన్ రెడ్డి అమ్ముతున్న జేబ్రాండ్స్ పాపం ప్రజారోగ్యానికి శాపంగా మారింది. కల్తీసారా, పిచ్చిబ్రాండ్ల మద్యంఅమ్మకాలతో వైసీపీపాలనలో రాష్ట్రంలో నిత్యంమరణ మృదంగాలే.నాటుసారా, జేబ్రాండ్ మద్యం, గంజాయి వంటి వాటిని తనపార్టీ ఎమ్మెల్యేలద్వారా ముఖ్యమంత్రే విక్రయిస్తున్నాడు. వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు, తమఅనుచరులతో రాష్ట్రంలోయథేచ్ఛగా మద్యం, నాటుసారా, ఇతరమాదకద్రవ్యాల అమ్మకాలుసాగిస్తూ, ముఖ్యమంత్రికి కట్టాల్సిన కప్పాన్ని క్రమంతప్పకుండా చెల్లిస్తున్నారు.
ఏటారూ.30వేలకోట్ల సంపాదనే లక్ష్యంగా జగన్ రెడ్డి తనకల్తీమద్యం, సారా వ్యాపారంసాగిస్తూ, పేదల ప్రాణాలు బలిగొంటున్నాడు. ఏలూరు, జంగారెడ్డి గూడెం ప్రాంతాల్లో 42మంది చనిపోయారంటే ప్రభుత్వం ఎంతలా నాసిరకంమద్యం, కల్తీసారా అమ్మకాలు సాగిస్తోందో చెప్పాల్సిన పనిలేదు.
సారా, కల్తీమద్యంతో మహిళల తాళిబొట్లుతెగిపోతున్నా ముఖ్యమంత్రిలో చలనంలేదు. పేదలు, సాదాసీదాప్రజలంటే జగన్మోహన్ రెడ్డికి చులకనభావం. సారామరణాలపై చట్టసభల్లో చర్చించకుండా, సహజమరణాలని ముఖ్యమంత్రిదుర్మార్గంగా మాట్లాడాడు.
జంగారెడ్డిగూడెం మరణాలన్నీ ప్రభుత్వహత్యలే. ముఖ్యమంత్రిస్వయంగా క్షేత్రస్థాయికి వెళ్తే వాస్తవాలుతెలుస్తాయి. 2018లో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని చంద్రబాబు గారు సారారహిత మున్సిపాలిటీగా మార్చారు.ఎక్సైజ్.. పోలీస్ సిబ్బంది సాయంతో టీడీపీప్రభుత్వం జంగారెడ్డిగూడెంతోపాటు చుట్టుపక్కలప్రాంతాల్లో ఎక్కడా సారా, మద్యంఅమ్మకాలు లేకుండా చేసింది.
వైసీపీనేతలు, ఎక్సైజ్ విభాగం కుమ్మక్కవడంవల్లే జంగారెడ్డిగూడెంలో సారాతాగి అమాయకులు చనిపోయారు.చనిపోయినవారిని అవమానిస్తూ , వారికుటుంబాలను అవహేళనచేస్తూ ముఖ్యమంత్రే శవ రాజకీయాలు చేస్తున్నాడు.
చంద్రబాబు జంగారెడ్డిగూడెంవెళ్తున్నాడని తెలిసి, సారాబాధిత కుటుంబాలవారిని అధికారుల సాయంతో ప్రభుత్వపెద్దలు భయభ్రాంతులకు గురిచేసింది నిజంకాదా? ప్రభుత్వాధికారులు,స్థానిక వైసీపీనేతలు ఎంతలా బాధితులను భయపెట్టినా, ప్రలోభాలకుగురిచేసినా, తమవారిని సారాకాటుకి బలిచేసుకున్నామన్న బాధ వారితో చంద్రబాబుగారికి వాస్తవాలు చెప్పించింది.
ఆడబిడ్డల కన్నీళ్లతో ఎన్నోప్రభుత్వాలు, ఎందరో రాజులు, మహామహులే కాలగర్బంలో కలిసిపోయారన్న వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి త్వరగా గ్రహిస్తే మంచిది.రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న నాసిరకం మద్యం అమ్మకాలు, కల్తీసారావిక్రయాలను ముఖ్యమంత్రి తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నాం.
రాష్ట్రంతోపాటుదేశమంతా జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాలపైచర్చించేలా టీడీపీచేసింది. ముఖ్యమంత్రి అసెంబ్లీలో అబద్ధాలుచెప్పి తప్పించుకున్నంత మాత్రాన వాస్తవం ప్రపంచానికితెలియకుండాపోదు. పిల్లి కళ్లుమూసుకొని పాలుతాగుతూతననుఎవరూ గమనించడం లేదన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు.
జంగారెడ్డిగూడెం నాటుసారామరణాలన్నీ ప్రభుత్వంచేసిన హత్యలే అని బల్లగుద్దిమరీ చెబుతున్నాం.అసెంబ్లీలోముఖ్యమంత్రి జంగారెడ్డిగూడెంలో నాటుసారానే లేదంటే, ఆప్రాంతంతోపాటు, చుట్టుపక్కలప్రాంతాల్లో అధికారులు ధ్వంసంచేస్తున్న సారాబట్టీలు ఎక్కడివి?
రాత్రికిరాత్రే ఆప్రాంతంలోసారాబట్టీలు వెలిశాయా..సారాతయారీ..విక్రయం వరకు అంతా వైసీపీవారే చేస్తున్నారు.మద్యంధరలుపెంచితే తాగేవారి సంఖ్యతగ్గుతుందని చెప్పిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలో పెరిగిన సారావిక్రయాలు,దానివల్ల సంభవించిన మరణాలను ఎలాసమర్థించుకుంటాడో చెప్పాలి?
ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనమేజంగారెడ్డి గూడెం నాటుసారా మరణాలకు ప్రధానకారణం. నాటుసారా తాగిచనిపోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి తక్షణమే రూ.25లక్షలచొప్పున నష్టపరిహారం ప్రకటించాలి. జరిగిన ఘటనపై వెంటనే న్యాయవిచారణకుఆదేశించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రాన్ని సారారహిత, మద్యంరహిత రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం.టీడీపీ లేవనెత్తిన డిమాండ్లపై ముఖ్యమంత్రి స్పందించకుంటే, నాటుసారా, కల్తీమద్యం అమ్మకాలు….దానివల్ల సంభవిస్తున్న మరణాలపై రాజీలేని పోరాటంచేస్తామని స్పష్టంచేస్తున్నాం.