Suryaa.co.in

Andhra Pradesh

కల్లాల్లో ఉన్న ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలి

– 4,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు.
– 1100 కోట్ల రూపాయిలు ఈరోజు తో మైలురాయి దాటాము..
– రైతుకు గోనసంచెలు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు లేకుండా చూడాలి
– రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
– రైతు సేవా కేంద్రాలను పరిశీలించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

కంకిపాడు: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం లో పునాదిపాడు, కోలవెన్ను రైతు సేవా కేంద్రాలను ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల శాఖ మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో కలిసి పరిశీలించారు.

ధాన్యం కొనుగోలు విషయంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే కనీ విని ఎరుగని ఈ సంవత్సరంలో నాలుగు లక్షల 50 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం పూర్తయింది. వర్షాలు తుఫాను వచ్చే పరిస్థితిలు కనపడటం వల్ల రైతులు ఆవేదన చెందుతున్న సందర్భంలో మిల్లుల వద్దకు హడావిడిగా తరలించే ప్రయత్నంలో గోతాలు గాని లారీ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఈ సమస్యలు అధిగమించడానికి అధికారులకు కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది. కచ్చితంగా రైతుకు ప్రాధాన్యమిచ్చి వారి కోరిన విధంగా వారికి అందుబాటులో దగ్గరలో ఉన్న మిల్లులకు తీసుకువెళ్లే వెసులుబాటు కల్పించాం.

అదే విధంగా స్థానికంగా సమస్యలు ఉన్నప్పుడు స్పందించడానికి పౌరసరఫరాల శాఖ నుండి రెవిన్యూ సిబ్బంది అదే విధంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న ప్రతి ఒక్కరు వ్యవసాయ శాఖతో సహా రైతులకు అందుబాటులో ఉండే విధంగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

కృష్ణాజిల్లా, ఎన్టీఆర్ జిల్లా ఎక్కడైతే ధాన్యం కొనుగోలు చేస్తున్నామో వారికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా 24 నుంచి 48 గంటల్లోపే కల్లాల దగ్గర ఉన్న ధాన్యం మిల్లుల వద్దకు తీసుకెల్లే ఏర్పాట్లు చేయడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది.

ధాన్యం కొనుగోలు విషయంలో మొట్టమొదటిసారి 1100 కోట్ల రూపాయలు ఈరోజు తో మైలురాయి దాటాము .అందులో 93% 24 గంటల్లోపే ధాన్యం కొనుగోలు అవ్వగానే 24 గంటల్లోపు రైతు ఖాతాల్లో జమ అయ్యేవిధంగా ఏర్పాటు చేసి కొన్ని సంస్కరణలను తీసుకొచ్చాం.

ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మన రాష్ట్రంలో అనేకమంది కౌలు రైతులు కాబట్టి వారికి నష్టం కలగకుండా చూసే బాధ్యత మాపై ఉంది . ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అదేవిధంగా కౌలు రైతుల విషయంలో పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా చేసిన కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా ప్రతి రైతుని ఆదుకునే విధంగా ప్రతి ఎకరాను కష్టపడి పండించారో ఆ ధాన్యం కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది అన్నారు.

అనంతరం కంకిపాడు మండలం దావులూరు గ్రామంలోని బాలాజీ రైస్ మిల్ మంత్రి సందర్శించారు. అక్కడ రైతు సమస్యలను విన్న మంత్రి…. రైస్ మిల్ యజమానులు రైతులకు సహకరించాలన్నారు.

LEAVE A RESPONSE