Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌ రెడ్డి గూండా రాజ్‌ పాలనకు ప్రజలంతా అంతం పలికారు

– జగన్‌రెడ్డి మాఫియా డాన్‌లకు సినిమా చూపిస్తాం
-టీడీపీ నేతలు, సానుభూతిపరులపై దాడులు దుర్మార్గం

-వైసీపీ నేతల ఫ్రస్టేషన్‌తో టీడీపీ శ్రేణులపై దాడులు
-టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

జగన్‌రెడ్డి గూండా రాజ్‌ పాలన మాకొద్దని ప్రజలంతా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. జూన్‌ 4న వచ్చే ఫలితాల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కే అవకాశం లేదన్న భయం, ఫ్రస్టేషన్‌ లో వైసీపీ నాయకులు గంజాయి బ్యాచ్‌తో రాష్ట్రమంతా పెట్రేగిపోతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. మంగళగిరి జాతీయ కార్యాలయం లో బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పల్నాడులో పిన్నెళ్లి సోదరుల అరాచకాలకు ఏకంగా 144 సెక్షన్‌ విధించాల్సిన దుస్థితి ఏర్పడిరది. భారీగా పోలీసులను మోహరించి పిన్నెళ్లి రౌడీల నుంచి ప్రజలను కాపాడుకోవాల్సి వస్తోందని మండిపడ్డారు. వందలాది మంది రౌడీలు రాళ్లు, రాడ్లు, కత్తులు పట్టుకుని వీరంగం సృష్టిస్తున్నారంటే రాష్ట్రంలో ఏం జరుగుతోంది.

జగన్‌ రెడ్డి అరాచకానికి ఇంకెంత మంది పేదలను బలితీసుకుంటారు? అని ప్రశ్నించారు. మరోవైపు ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రి య అనుచరులపై వైసీపీ నేతలు రాడ్లతో దాడికి పాల్పడ్డారు. అనంత పురంలో జేసీ దివాకర్‌ రెడ్డి ఇంట్లోకి పోలీసులు చొరబడి కార్యకర్తలు, నాయకులపై దాడి చేశారు. ఇంట్లోని పనిమనుషులను కూడా ఎత్తుకెళ్లడం సిగ్గుచేటు. జగన్‌ రెడ్డి గూండాల చేతుల్లో పోలీసులు సైతం కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో దాడులు, దౌర్జన్యాలకు తావులేదనే కనీస విజ్ఞత మరిచి వైసీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. ప్రతి ఒక్క ఘటనకు వడ్డీతో సహా మూల్యం చెల్లించి తీరుతామని హెచ్చరించారు. జగన్‌ రెడ్డి మాఫియా డాన్‌లకు, రౌడీషీటర్లకు ఫుల్‌ క్లారిటీతో 70 ఎంఎం సినిమా త్రీడీలో చూపించి తీరుతామని స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE