Suryaa.co.in

Andhra Pradesh

తెలుగు రాష్ట్రాల అభివృద్ధే, తెలుగుజాతి వృద్ధి

– నేటి పాలకులు ఇప్పుడు చెబుతున్న, చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి అంతా – తెలుగుదేశంపార్టీ చేసిన దానికి కొనసాగింపు మాత్రమే
– తెలుగుదేశం పొలిట్ బ్యూరోసభ్యులు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ

“తెలుగుదేశంపార్టీ 42వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఇన్నేళ్లనుంచి పార్టీని తమభుజస్కంధాలపై మోస్తూ, అకుంఠితదీక్షతో పనిచేస్తున్న కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. యువతరానికి ప్రతినిధులు, నవతరా నికి నాయకులు, భావితరాలకు భారతదేశపు మహాశక్తి అయిన తెలుగుదేశంకార్యకర్తల శక్తికి నా పాదాభివందనాలు. నన్ను మీ అందరిహృదయాల్లో నిలిపిన దైవాంశసంభూతుడు, విశ్వ విఖ్యాతనటసౌర్వభౌముడు, స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి శతజయంతి సంద ర్భంగా, ఆ మహానుభావుడికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ఏపాత్ర పోషించి నా ఆపాత్రకు తనదైనశైలిలో న్యాయంచేసిన మహానీయుడు నందమూరి తారకరామారావు గారు.

ప్రతి బిడ్డ బొడ్డు ఊడకముందే వాడికి రాజకీయం అంటే ఏంటో నేర్పిన వ్యక్తి. రాజకీయ విప్లవం, రాజకీయచైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి. అనేకపథకాలు ప్రవేశపెట్టి ప్రజలహృదయాల్లో శాశ్వతస్థానం పొందారు. ఎన్నిపార్టీలు వచ్చినా, ఆయనపెట్టినపథకాలు, అభివృద్ధిని కొనసా గించేలా చేసిన గొప్పవ్యక్తి. ఎన్టీఆర్ అంటే నవజాతికే మార్గదర్శకుడు. యువతకు ఆదర్శం.. భగభగమండే అగ్నికణం. అందుకే మర్మంలేని చిరస్మరణీయుడిగా ప్రజల హృదయాల్లో కొలు వై ఉన్నాడు. మహోన్నతమహోత్తమమైన దీపం ఎన్టీఆర్.

నేటిపాలకులు ఇప్పుడు చెబుతున్న అభివృద్ధి, సంక్షేమం అంతా ఎన్టీఆర్ చేసిన దానికి కొనసాగింపు మాత్రమే. కిలోబియ్యం రూ.2లకే. భూమిశిస్తురద్దు, రూ.50కే హర్స్ పవర్ విద్యుత్, పేదలకు రూ.30లపింఛన్, చేనేతలను ఆదుకోవడానికి జనతావస్త్రాలపంపిణీ, పేదలకోసం పక్కాఇళ్లు (కాంక్రీట్ భవనాల నిర్మాణం), పటేల్ పట్వారీ వ్యవస్థనిర్మూలన, మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టి 340 తాలూకాలను, 1104 మండలాలుగా మార్చడం, ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు పెంపు, బీసీలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు, మహిళలకు ఆస్తిలో సమానహక్కు, మహిళావిద్యకోసం పద్మావతీమహిళా యూనివర్శిటీ, దేశంలోనే తొలిసారి ఆరోగ్యవిశ్వవిద్యాలయం ఏర్పాటు, గురుకులవిద్యాబోధన, సంక్షేమహాస్టళ్ల ఏర్పాటు, జోగినీ దేవదాసీ వ్యవస్థరద్దు, కృష్ణజలాలు హైదరాబాద్ కు తీసుకురావడం, కృష్ణా, కావేరీ నదుల అనుసంధానం, నేషనల్ ఫ్రంట్ ద్వారా మండల్ కమిషన్ ఏర్పాటుచేసి, దాని సిపార్సులు అమలు చేయడం, సర్కారియా కమిషన్ తో రాష్ట్రాలకు, కేంద్రప్రభుత్వంతో స్నేహసంబంధాలు కొనసాగేలా చేయడం … ఇవన్నీ ఎన్టీఆర్ సాధించిన విజయాలు. ఎన్టీఆర్ తెలుగువారిలో రాజకీయచైతన్యం తీసుకొస్తే, ఆయన బాటలోనడుస్తూ చంద్రబాబుగారు తెలుగుమేథస్సుని ప్రపంచానికి పరిచయం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగుతల్లికి రెండుకళ్లు. చంద్రబాబు నాయుడు హాయాంలో విద్యా, వైద్యరంగాల్లో అనేకసంస్కరణలు తీసుకొచ్చారు. ప్రతి కిలో మీటర్ కు ఒకప్రాథమికపాఠశాల, ప్రతి రెండుకిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ పాఠశాల, ప్రతి 5కిలోమీటర్లకు ఒక హైస్కూల్, ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాల, ప్రతి డివిజన్ కు ఒక డిగ్రీకళాశాల, ప్రతిజిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుచేశారు. బీసీ రిజర్వేషన్లు చంద్రబాబు 50శాతానికి పెంచారు.

మహిళలకు విద్యలో 33శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారు. డ్వాక్రాసంఘాలతో తెలుగురాష్ట్రాల్లో పొదుపువిప్లవం సృష్టించారు. సైబరాబాద్ నిర్మాణంతో యువత భవితను మార్చారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ను, జీనోమ్ వ్యాలీని హైదరా బాద్ కు తీసుకొచ్చారు. కర్ఫ్యూనగరాన్ని కరోనా వ్యాక్సిన్ తయారీకేంద్రంగా మార్చారు. కల్వకుర్తి నెట్టెంపాడు-బీమా ఎత్తిపోతలపథకం, దేవాదుల ఎత్తిపోతలపథకం నిర్మాణం చేపట్టా రు. హైదరాబాద్ లోనే ప్రపంచంమెచ్చేలా శంషాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మించారు.

హైదరాబాద్, సిక్రిందాబాద్ లలో 28 ఫ్లైఓవర్లు నిర్మించారు. 8లైన్లతో కూడిన 158కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంచేపట్టారు. దానినిర్మాణంతో జంటనగరాల రూపురేఖలే మారిపో యాయి. ఎం.ఎం.టీ.ఎస్ వ్యవస్థకు శ్రీకారంచుట్టారు. గాంధీ ఆసుపత్రినిర్మాణంతో పాటు, 155 వరకు ఆసుపత్రులు నిర్మించారు. 9 స్టేడియాలు, స్పోర్స్ట్ అథారిటీని ఏర్పాటు చేశారు. నేషనల్ గేమ్స్ నిర్వహణకు హైదరాబాద్ ను వేదికగా మార్చారు. ఇలా చెప్పుకుంటూపోతే చంద్రబాబు చేసిన అభివృద్ధి మాటల్లో చెప్పలేనిది.

తెలుగుదేశంపార్టీ తెలుగుజాతికి ఏంచేసిందో నేటి యువత కచ్చితంగా తెలుసుకోవాలి. చరిత్ర మర్చిపోయినవాడు తల్లిపాలుతాగి విషంకక్కేవాడితో సమానం. ఆంధ్రరాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి ఘనవిజయం కట్టబెట్టారు. అలానే అధికారపార్టీలో ఉన్న అసంతృప్తిని ఆపార్టీ ఎమ్మెల్యేలే వెళ్లగక్కారు. మనం దరం వసుదైకకుటుంబం. తెలుగురాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే తెలుగుజాతి అభివృద్ధి చెందుతుంది.”

LEAVE A RESPONSE