– జగన్ ప్రభుత్వం 4ఏళ్ల బడ్జెట్ లో సంక్షేమానికి కేవలం 31శాతం నిధులు మాత్రమే వెచ్చించింది. – చంద్రబాబు 45శాతానికిపైగా ఖర్చుపెట్టాడు.
• మొత్తం 43ప్రభుత్వశాఖలుంటే, 40శాఖలపరిధిలో వివిధవర్గాలకోసం చంద్రబాబు ప్రత్యేకంగా 120కి పథకాలు అమలుచేశాడు.
• గడచిన 45నెలల్లో తమప్రభుత్వం ప్రజలకు డీబీటీ, నాన్ డీబీటీ కింద రూ.2లక్షల96వేల148 కోట్లు ఖర్చుపెట్టినట్టు గతవారం పత్రికల్లో జగన్ ప్రకటనలు ఇప్పించాడు.
• జగన్ చేసిన అప్పు రూ.6,75,273కోట్లు అయితే, దానిలో నాన్ డీబీటీ, డీబీటీ కింద ప్రజ లకోసం పెట్టినఖర్చు రూ.2,96,148కోట్లు అయితే, మిగిలిన రూ.4లక్షలకోట్లు ఎటుపోయాయి?
• బటన్ నొక్కుడు పేరుతో ప్రజల్ని మోసగిస్తూ, జగన్ తనఖజానా నింపుకుంటున్నాడు.
• వాలంటీర్ వ్యవస్థతో గొడ్డుచాకిరీ చేయించుకుంటున్నజగన్ వారిని నమ్మకుండా, వారు మాత్రం తననే నమ్మాలనడం విడ్డూరాలకే విడ్డూరం : జవహర్.
• వాలంటీర్ వ్యవస్థపై నమ్మకంలేకే జగన్ వారిపై పెత్తనాన్ని గృహసారథులు, కన్వీనర్లకు అప్పగించాడు. టీడీపీ ప్రభుత్వం వాలంటీర్లను తొలగిస్తుందనేది వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే : జవహర్.
నక్కా ఆనంద్ బాబు (టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి), కే.ఎస్.జవహర్ (మాజీ మంత్రి)
మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, సంక్షేమంపై పచ్చి అబ ద్ధాలుచెబుతూ, ప్రజలసొమ్ముతో తనసొంత మీడియాలో బూటకపు ప్రకటనలు వేయిస్తూ, దళితులు, గిరిజనులు, బీసీ, మైనారిటీ వర్గాలను మరింతగా మోసగించడానికి ప్రయత్నిస్తున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కాఆనంద్ బాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో బుధవారం ఆయన మాజీమంత్రి కే.ఎస్.జవహర్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు వారిమాటల్లోనే మీకోసం…
“వైసీపీప్రభుత్వ నాలుగేళ్లపాలనలో అన్నివర్గాలప్రజలకు మేలుచేసినట్టు జగన్ చెప్పిన అంకెలు, మాటలు అన్నీ అబద్ధాలే. 5, 6 రోజుల వ్యవధిలో పత్రికల్లో ఇచ్చినప్రకటనల్లోనే ప్రభుత్వం అన్నీతప్పుడులెక్కలు చెప్పింది. గడచిన 45నెలల్లో తమప్రభుత్వం ప్రజలకు డీబీటీ, నాన్ డీబీటీ కింద రూ.2లక్షల96వేల148 కోట్లు ఖర్చుపెట్టినట్టు గతవారం పత్రికల్లో జగన్ ప్రకటనలు ఇప్పించాడు. బడ్జెట్లో కేటాయించిననిధుల్లో కేవలం 31శాతం నిధులు మాత్రమే జగన్ సంక్షేమానికి ఖర్చుపెట్టాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3వేల పింఛన్ ఇస్తాన నిచెప్పిన జగన్, ప్రమాణస్వీకారం చేసిన రోజునే దశలవారీగా ఏటా రూ.250చొప్పున పెంచు తాననిచెప్పి ప్రజలపై తొలిదెబ్బ వేశాడు. జగన్ ప్రభుత్వం మార్చి 25న సాక్షిలో ఇచ్చిన పుల్ పేజీ ప్రకటనలో గత 45నెలల్లో 41,77,406 మంది మహిళాలబ్దిదారులకు అందించిన పింఛన్ మొత్తం రూ.40,094 కోట్లుగా వెల్లడించింది. ఈ ప్రభుత్వ లెక్కల ప్రకారమే సగటున నెలకు జగన్ ఇచ్చిన పింఛన్ కేవలం రూ.2,133 మాత్రమే. మాటతప్పిన జగన్ లెక్క ప్రకారమే పింఛన్ పెంపుదల నెలకు రూ.250 నుంచి రూ.750 ఉండవలసి ఉండగా ప్రభుత్వ లెక్క ప్రకారమే అది సగటున రూ.133 మాత్రమే. ఇంతకంటే మహామోసం ఏముంటుంది. పేదలంతా ఈ మోసాన్ని గుర్తించి ముఖ్యమంత్రి జగన్ ని గట్టిగా నిలదీయాలని కోరుతు న్నాం. ఇలా ప్రతిపథకంలో అర్హులైన వారికి జగన్ పంగనామాలు పెట్టాడు. సంక్షేమ క్యాలెండర్ పేరుతో జగన్ విడుదలచేసిన సమాచారం మొత్తం పచ్చి అబద్ధాలే.
సంక్షేమం పేరుతో జగన్ ప్రభుత్వం ఇస్తున్న పత్రికా ప్రకటనల్లోని సమాచారం మొత్తం అబద్ధాలమయం
19-03-2023న సాక్షిపత్రికలో మొదటిపేజీలో ఇచ్చినప్రకటనలో జగనన్న వసతిదీవెన కింద 18లక్షల77వేల863 మందికి రూ.3,363కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. అదే సాక్షిపత్రికలో 25- 03-2023న వైఎస్సార్ ఆసరా పథకం కింద ఇచ్చిన ప్రకటనలో, జగనన్న వసతి దీవెన కింద 27లక్షల57వేల094 మందికి అదే రూ.3,363కోట్ల ఆర్థికసాయంచేసినట్టుచెప్పారు. ఒక్క 5 రోజుల వ్యవధిలో పత్రికల్లో వేసినప్రకటనల్లోనే జగనన్న వసతిదీవెన లబ్ధిదారులసంఖ్యను జగన్ అతని ప్రభుత్వం 9లక్షలకుపైబడి పెంచిచూపింది. ఇచ్చిన సొమ్ము మాత్రం పైసా పెరగ లేదు. ఈ విధంగా ప్రజల్ని అంకెలగారడీతో, తప్పుడులెక్కలతో జగన్ మోసగిస్తున్నాడు. ఇలాంటి వాటిపై ప్రధానప్రతిపక్షం నిలదీస్తే వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు హూంకిరిస్తారు. సంక్షేమంపై పేటేంట్ రైట్స్ మొత్తం తెలుగుదేశానివే. స్వర్గీయ ఎన్టీఆర్ సంక్షేమాన్ని ప్రారంభిస్తే చంద్రబాబు గారు దాన్ని రెట్టింపుస్థాయిలో అమలుచేశారు. ఈవాస్తవాన్ని ఎవరైనా అంగీకరిం చాల్సిందే. ఎందుకుంటే టీడీపీప్రభుత్వం ప్రజలకు అమలుచేసిన సంక్షేమం క్షేత్రస్థాయిలో కని పిస్తోంది. జగన్మోహన్ రెడ్డిలా అబద్ధాలుచెప్పడం, అంకెలగారడీలు చేయడం టీడీపీచేయలే దు. రాష్ట్రంలో మొత్తం 43 ప్రభుత్వ శాఖలుంటే, వాటిలో 40శాఖల్లో వివిధవర్గాలకోసం 120 కు పైగాసంక్షేమ పథకాలు చంద్రబాబు అమలు చేశారు.
ఇళ్ల పట్టాల కోసం రూ.76,670కోట్లు ఖర్చుపెట్టినట్టు పత్రికా ప్రకటనల్లో చూపారు
మార్చి25న ప్రభుత్వం పత్రికల్లో ఇచ్చిన ప్రకటనల్లో జగనన్న ఇళ్లపట్టాల కింద 30లక్షల 76వేల018 మంది మహిళలకు, 76వేల670కోట్లు ఖర్చుపెట్టి ఇళ్ల పట్టాలు ఇచ్చినట్టు చెప్పా రు. నాన్ డీబీటీ కింద ఖర్చుపెట్టిన రూ.2లక్షల96వేల కోట్లలో ఇళ్లపట్టాలకు ఖర్చుపెట్టిన దాన్నిచూపారు. ఇదే వైసీపీ ప్రభుత్వం గతంలో అసెంబ్లీలో ఇళ్లపట్టాలకోసం రూ.16వేలు ఖర్చుపెట్టినట్టు చెప్పింది. ఇళ్లపట్టాలకోసం రూ.16వేలకోట్లు ఖర్చుపెట్టిన జగన్ ప్రభుత్వం, దాన్ని రూ.76వేలకోట్లుగా చూపడం ప్రజల్ని వంచించడం కాదా? ఇలాంటి తప్పుడు ప్రకటనలు ఇచ్చినందుకు ప్రభుత్వాధినేత అయిన జగన్ ను జైలుకు పంపాలి. జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలకోసం వెచ్చించిన అసలుసొమ్ము రూ.16వేలకోట్లలో రూ.10వేలకోట్లు వైసీపీఎమ్మెల్యే లు, మంత్రులే కొట్టేశారు. వాస్తవంగా ఖర్చుపెట్టింది మొత్తంగా రూ.6వేలకోట్లుమాత్రమే. ఎక రా భూమిని రూ.10లక్షలకు కొని, రూ.30లక్షలకు కొన్నట్టు ప్రభుత్వంనుంచి డబ్బులు కొట్టేశారు. భూమిచదునుపేరుతో మరింత దిగమింగారు. ఇళ్లపట్టాలు ఇచ్చిన స్థలాల్లో రోడ్లు వేయ కుండా, తగిన వసతులుకల్పించకుండానే అన్నీచేసినట్టు లెక్కల్లో చూపుతున్నారు. చేయ కుండానే అన్నీచేసినట్టు చెప్పుకునే దిక్కుమాలిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే.
జగన్ 4ఏళ్లబడ్జెట్లో సంక్షేమానికి పెట్టినఖర్చు కేవలం 31శాతమే
జగన్ ప్రభుత్వ 4ఏళ్లబడ్జెట్ మొత్తం రూ.9లక్షల39వేల799కోట్లు. ఆ మొత్తంలో జగన్ సంక్షే మానికి ఖర్చుపెట్టింది కేవలం రూ.లక్షా92వేలుకోట్లు మాత్రమే. అంటే 31శాతం మాత్రమే. చంద్రబాబుహాయాంలో మొత్తం బడ్జెట్ రూ.7లక్షల08వేల623కోట్లు. ఆ మొత్తంలో టీడీపీప్ర భుత్వం సంక్షేమానికి 45శాతానికిపైగా ఖర్చుపెట్టింది. ఈలెక్కలు అసెంబ్లీలోరికార్డుల్లో ఉంటా యి..కావాలంటే జగన్ చూసుకోవచ్చు. ఉత్తుత్తిసంక్షేమంపేరుతో జగన్ ప్రజల్ని మోసగిస్తు న్నాడు. చంద్రబాబుప్రభుత్వంతో పోలిస్తే, జగన్ సంక్షేమానికి 14శాతం తక్కువే ఖర్చుపెట్టాడు. ప్రజలసంక్షేమం అమలుచేయడంలోనైనా, రాష్ట్రాభివృద్ధిలోనైనా చంద్రబాబుకంటే జగన్ ఎప్పుడూ అడుగునే ఉంటాడు. కావాలంటే సంక్షేమం అమలుపై టీడీపీప్రభుత్వం చేసిన దాని పై వైసీపీ నుంచి ఎవరైనా సరే చర్చకురావొచ్చు. దమ్ము, ధైర్యం ఉన్నఎవరుచర్చకు వచ్చినా తాము ప్రజలసమక్షంలో చర్చించడానికి సిద్ధం.
జగన్ చేసిన అప్పు రూ.6,75,273కోట్లు అయితే, దానిలో నాన్ డీబీటీ, డీబీటీ కింద ప్రజల కోసం పెట్టినఖర్చు రూ.2,96,148కోట్లు అయితే, మిగిలిన రూ.4లక్షలకోట్లు ఎటుపోయాయి?
రూ.9లక్షల39వేల799కోట్లలో సంక్షేమానికి వైసీపీప్రభుత్వం పెట్టినఖర్చు కేవలం రూ.లక్షా 92వేలకోట్లు మాత్రమే అయితే, మిగిలినసొమ్ము ఎటుపోయిందో జగన్ సమాధానంచెప్పాలి. గత నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వంచేసిన అప్పు రూ.6,75,273 కోట్లు. ఇందులో ప్రత్యక్ష, పరోక్ష నగదు బదిలీ కింద జగన్ ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.2,96,148 కోట్లు మాత్రమే. మరి అప్పులుతెచ్చిన మిగతాసొమ్ము ఎటుపోయింది.? దేనికి ఖర్చుచేశారు? ఆ అప్పుల భారమంతా ప్రజలపైనే పడనుంది. నాన్ డీబీటీ, డీబీటీకింద సంక్షేమానికి పెట్టిన ఖర్చు పోయినా ఇంకా రూ. 4లక్షలకోట్లకు జగన్ అండ్ కో లెక్కలు చెప్పాలి. ఆ సొమ్మంతా జగన్ ప్యాలెస్ కే చేరింది అనడానికి ఎలాంటిసందేహం లేదు. రాష్ట్రంలో ఎక్కడాచిన్నరోడ్డు వేసిందిలేదు. ఒక్క ప్రాజెక్ట్ కట్టిందిలేదు. రూ.4లక్షలకోట్లు ఎక్కడదాచారో వైసీపీనేతలు, మంత్రులు, ముఖ్యమంత్రే చెప్పాలి. అప్పులతాలూకా సొమ్ము రూ.4లక్షలకోట్లతోపాటు, మద్యం, ఇసుక, మైనింగ్ మాఫియాలతో కొల్లగొడుతున్న సొమ్ము ఇంకాఎక్కువే ఉంటుంది. వైసీపీ మునిగిపోతోందని, జగన్ ఆట ముగిసిందని అతని ముఖంలోని ప్రేతకళే చెబుతోంది. అందుకే తనపార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లను జగన్ బతిమాలుకుంటున్నా డు. జగన్ కథముగిసిందని సొంతపార్టీ ఎమ్మెల్యేలకు కూడా అర్థమైంది. అందుకే పక్కచూపు లు చూస్తున్నారు. తాముచెప్పిన అంశాలపై చర్చకు వచ్చే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రికి ఉంటే ఆయన రావచ్చు” అని ఆనంద్ బాబు సవాల్ చేశారు.
టీడీపీ అధికారంలోకి వచ్చినా వాలంటీర్లను తొలగించదు. పనికి తగినవేతనమిచ్చి, వారి గౌరవాన్ని పెంచుతుంది :కే.ఎస్.జవహర్
“పల్లెల్లో ప్రతి50ఇళ్లకు ఒకరు,పట్టణాల్లో ప్రతి 100ఇళ్లకు ఒక వాలంటీర్ ను నియమించిన జగన్ వారితో వెట్టిచాకిరీకంటే ఘోరమైన పనులుచేయిస్తున్నాడు. వాలంటీర్ వ్యవస్థను రాజ్యాంగేతరశక్తిగా మారుస్తూ, తన కుట్రలకు వారిని వాడుకుంటున్నాడు. జగన్ చెప్పే అర్థ సత్యాలు, అసత్యాలను గోబెల్స్ మాదిరి విషప్రచారంచేయవద్దని వాలంటీర్లను కోరుతున్నాం. జగన్ ఎన్నికలవిధుల్లో వాలంటీర్లను వినియోగిస్తూ, వారిని శిక్షార్హుల్ని చేస్తున్నాడు. వాలం టీర్లు ప్రజలకు సేవకులుగానీ, జగన్మోహన్ రెడ్డికో, వైసీపీకో సేవకులు కాదు. జగనన్నే మా నమ్మకం అని వాలంటీర్లు ప్రజలకు ఎందుకుచెప్పాలి? స్వచ్ఛందంగా ప్రజలకు సేవచేస్తున్నది వాలంటీర్లు అయితే, జగన్ ని ఎందుకు నమ్మాలి. జగన్ పై ప్రజలు ఆగ్రహావే శాలతో ఉంటే, దాన్నిచల్లార్చేబాధ్యతను వాలంటీర్లకు అప్పగించాడు. టీడీపీప్రభుత్వం వచ్చిన వెంటనే వాలంటీర్లకు తగినగౌరవం ఇచ్చి, జీతాలు పెంచుతుందని, వారిని వెట్టిచాకిరీ నుంచి విముక్తుల్ని చేస్తుందని స్పష్టం చేస్తున్నాం. 4ఏళ్లుగా వాలంటీర్లతో గొడ్డుచాకిరీ చే యించుకున్న జగన్, ఇప్పుడువారిపై పెత్తనానికి గృహసారథుల్ని, కన్వీనర్లను నియమించాడు.
బీ.టెక్, ఎమ్.టెక్ చేసిన వారు వాలంటీర్ల ఉద్యోగాలంటూ ఎలాంటిపనులుచేస్తున్నారో వారే ఆలోచించుకోవాలి. దోపిడీకి ఏదీ అనర్హంకాదన్నట్టు జగన్ రాష్ట్రాన్నే దోపిడీకి కేరాఫ్ గా మార్చాడు. ఆవభూముల్ని, ద్వీపాల్లోని మట్టిని, గోదావరీ పరీవాహక ప్రాంతంలోని విలువైన మట్టిని వైసీపీనేతలు కొల్లగొడుతున్నది నిజంకాదా? వాస్తవాలు చెప్పకుండా, జగన్ ని కాపా డటంకోసం వాలంటీర్లు ప్రజలకు అబద్ధాలుచెబితే, వారుకూడా జనంచేతిలో చావుదెబ్బలు తి నడం ఖాయమని హెచ్చరిస్తున్నాం. జగన్ చేస్తున్న అబద్ధపు సంక్షేమంపై ప్రజల్ని నమ్మించే ప్రయత్నంచేయవద్దని వాలంటీర్లను కోరుతున్నాం. వైసీపీకి అనుబంధంగా ఉండేవారిపై తప్ప ఎవరిపైనా టీడీపీకి ఎలాంటికక్షలేదు. జగన్ నవరత్నాలపేరుతో జనాన్ని వంచించాడు. ఇళ్ల పట్టాలు, మద్యపాననిషేధం, పింఛన్ పెంపు, రైతురుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అన్నింట్లో జగన్ ప్రజల్ని దారుణంగా వంచించాడు.” అని జవహర్ తేల్చిచెప్పారు.