Suryaa.co.in

Andhra Pradesh

ఈ పాపం అంతా ముఖ్యమంత్రి తమ్ముడు అనిల్ రెడ్డి.. ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీది

పోసాని కోటేశ్వరావు, కృష్ణ, రామారావు ఈ పాపంలో భాగస్వాములు కాదా ?
ఇసుక దోపిడీలో ఎవరైతే భాగస్వాములయ్యారో నాశనం అయిపోతారు
ఇసుక దోపిడీతో తాడేపల్లి కొంపకు 40,000 కోట్లు వెళ్లాయి
జేపీ సంస్థకు రెండేళ్లు అగ్రిమెంట్ అయిపోయింది
ఎక్స్టెన్షన్ డాక్యుమెంట్లు బయట పెట్టండి
మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు , నక్కా ఆనందబాబు , మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇసుక గుంతల కారణంగా కీసర మునేటి వద్ద ముగ్గురు యువకులు మృతి చెందిన ప్రాంతాన్ని సందర్శించిన మాజీ మంత్రులు
మునేటి వద్ద ఇసుకలో బైఠాయించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
ఇసుక అక్రమ దోపిడీ అరికట్టాలంటూ నినాదాలు

ఎన్టీఆర్ జిల్లా (నందిగామ): సీఎం జగన్‌ తమ్ముడు అనిల్‌రెడ్డి ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతోందని టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రతినెల ఇసుక దోపిడి డబ్బంతా తాడేపల్లి కొంపకే వెళుతోందని మాజీ మంత్రులు దేవినేని ఉమ, నక్కా ఆనంద్‌బాబు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆరోపించారు. ఇటీవల ప్రమాదం జరిగిన మునేటి వద్ద వారంతా ఇసుకలో కూర్చుని ఆందోళన నిర్వహించారు. జెపి కంపెనీ కాంట్రాక్టు ముగిసి రెండేళ్లైతే, మరి ఇసుక ఎవరు తవ్వుతున్నారని ప్రశ్నించారు. మైనింగ్‌ డైరక్టర్‌ వెంకటరెడ్డికి నీతి నిజాయితీ, ఇసుకను కాపాడాలన్న చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఎక్స్‌టెన్షన్‌ ఇచ్చిమంటున్న ఆ డాక్యుమెంట్లు తక్షణం మీడియాకు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.
ఇంకా వారేమన్నారంటే..ముఖ్యమంత్రి సోదరుడు అనిల్ రెడ్డి నాయకత్వంలో ఇసుక దోపిడీ జరుగుతుంది.నందిగామ ప్రాంతంలో సహకరించేవారు జగన్మోహన్రావు, అరుణ్ కుమార్, వసంత కృష్ణ ప్రసాద్.మొత్తం దోపిడినే ! అసలు రాష్ట్రంలో టెండర్లు ఫైనల్ అవ్వలేదు. మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి చెబుతున్నాడు ఎక్స్టెన్షన్ చేశామని.. ఆ డాక్యుమెంట్లు బయట పెట్టండి ?

జేపీ సంస్థకు రెండేళ్లు అగ్రిమెంట్ అయిపోయింది ! రెండేళ్ల నుంచి ఎవరు తోలకాలు జరుపుతున్నారు.నేను పత్రికలు, మీడియాతో మైనింగ్ డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లి అడిగాను సమాధానం లేదు.ఇసుక గుంతల కారణంగా ఎంతోమంది చనిపోయిన ఈ ప్రాంతంలో బ్రిక్స్ ఫ్యాక్టరీలు పెట్టి జెసిబి లు ప్రోక్లైన్లతో పందికొక్కుల్లా దోచుకుంటున్నారు. పోసాని కోటేశ్వరావు,కృష్ణ, రామారావు వీళ్ళందరూ ఎవరు ? ఈ పాపంలో భాగస్వాములు కాదా ?వందల కోట్లు సంపాదించారు చాలా లేదా ? మృతుల కుటుంబ సభ్యుల క్షోభ బాధ పట్టడం లేదు.ఈ పాపం అంతా ముఖ్యమంత్రి తమ్ముడు అనిల్ రెడ్డి, ఇద్దరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ది.

ఇసుక దోపిడీతో తాడేపల్లి కొంపకు 40,000 కోట్లు వెళ్లాయి. ఇది జగమెరిగిన సత్యం. దీంట్లో వాటాదారులు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రావు, వసంత కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఈ పాపాలకు వీళ్ళు కాదా బాధ్యులు?సత్యమ్మ తల్లి అమ్మవారు ఉన్నారు ఇక్కడ. మాకు ఏ పాపం తెలీదని ప్రమాణం చేసి చెప్పండి. ఈ ఇసుక దోపిడీలో ఎవరైతే భాగస్వాములయ్యారో నాశనం అయిపోతారు చనిపోయిన కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుటుంబాలకు ఆసుపత్రి ఖర్చులు 10 లక్షలు తగ్గకుండా ఎక్స్గ్రేషియా ప్రకటించాలి.

LEAVE A RESPONSE