• ఆళ్లగడ్డ నియోజకవర్గ రైతులు దొర్నిపాడులో యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
• మా నియోజకవర్గంలో నకిలీ పత్తివిత్తనాలు అమ్మకం అత్యధికంగా ఉంది.
• అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్నా పంట దిగుబడి సరిగా రావడం లేదు.
• అప్పులు తీర్చలేని దుస్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విత్తనాల కంపెనీలు, డిస్ట్రిబ్యూషన్ వాళ్లే రైతుల మరణాలకు కారణం.
• వైసీపీ ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికట్టడంలో విఫలమైంది.
• ఫెర్టిలైజర్స్, ఫెస్టిసైడ్స్ ధరలు కూడా అత్యధికంగా పెంచారు.
• టీడీపీ పాలనలో డీఏపీ ధర రూ.900 ఉంటే నేడు రూ.1,400లకు పెరిగింది.
• కేజీ పత్తివిత్తనాలు కంపెనీలు రైతునుండి రూ.450కు కొనుగోలు చేసి, తిరిగి రైతులకు రూ.1,400లకు అమ్ముతున్నాయి.
• మొక్కజొన్నకు క్వింటాలుకు రూ.2,500 మద్దతు ధర ఇవ్వాలి.
• వరి, మిర్చి, శనగ, జొన్న పంటలకు మద్దతు ధర కల్పించాలి.
• విపత్తుల సమయంలో పంట నష్టపరిహారం అందించాలి. రైతులకు సబ్సిడీ పథకాలు కొనసాగించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విత్తనాల మాఫియాకు కొమ్ముకాస్తున్నాడు.
• జగన్ రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతు ఆత్మహత్యల్లో ఏపీ దేశంలో 3వ స్థానానికి వెళ్లింది.
• ఎరువులు, పురుగుమందులు, విత్తనాల ధరలు అమాంతం పెంచి రైతుల నడ్డి విరుస్తున్నారు.
• టిడిపి అధికారంలోకి రాగానే నకిలీ విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం.
• అన్నిపంటలకు మద్దతు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటాం.
• గతంలో రైతులకు అందించిన సంక్షేమ పథకాలు, రైతు రథాలు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు, సబ్సిడీ పథకాలు పునరుద్ధరిస్తాం.
రామచంద్రపురం గ్రామస్తులు:
• ఆళ్లగడ్డ నియోజకవర్గం రామచంద్రపురం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామానికి 3కి.మీ. దూరంలో 12ఎకరాల్లో తాగునీటి కుంట ఉంది.
• గత ప్రభుత్వ హయాంలో నీరు-చెట్టు పథకం కింద నీటికుంటను ఏర్పాటు చేసుకున్నాము.
• గ్రామంలో బోర్ల నుంచి వచ్చేనీరు ఉప్పునీరుగా మారడంతో మాకు తాగునీటి సమస్య ఉంది.
• గ్రామంలో నీటిశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేసి, నీటికుంట నుంచి పైప్ లైన్ ద్వారా నీరందరిస్తే మా సమస్య తీరుతుంది.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• రాయలసీమ బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీమప్రజలకు గుక్కెడు నీళ్లు ఇవ్వకపోవడం దురదృష్టకరం.
• గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కేంద్రం అమలుచేసే జల్ జీవన్ మిషన్ అమలులో కూడా రాష్ట్రం విఫలమైంది. ఈ పథకం అమలులో దేశంలో 17వ స్థానానికి దిగజారిపోయింది.
• టిడిపి అధికారంలోకి రాగానే వాటర్ గ్రిడ్ ఏర్పాటుద్వారా ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేసి, రాయలసీమలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం.
• రామచంద్రపురానికి నీటకుంటనుంచి వాటర్ పైప్ లైన్, నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటుచేసి తాగునీరు అందిస్తాం.