– లండన్ పర్యటన తర్వాత హాజరు కావాలని కోర్టు నిబంధన
– కోర్టు సూచనల మేరకే హాజరైన వైయస్.జగన్
– మాజీ ముఖ్యమంత్రిగా తన పర్యటన వివరాలు ముందుగానే వెల్లడి
– హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు
హైదరాబాద్: హైదరాబాద్ పర్యటనలో వైయస్.జగన్ కు వచ్చిన ప్రజాదరణతో కూటమి నేతల్లో కడుపుమంట మొదలైందని… వెల్లువలా తరలివచ్చిన జనాలను చూసి ఓర్వలేకే టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని వైయస్సార్సీపీ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ… లండన్ పర్యటన తర్వాత హాజరు కావాలని కోర్టు నిబంధన మేరకు వైయస్.జగన్ ఇవాళ కోర్టుకు హాజరయ్యారని స్పష్టం చేశారు.
మాజీ ముఖ్యమంత్రిగా తన పర్యటన వివరాలు ముందుగానే వెల్లడిస్తే.. దానిపైనా కూటమి నేతలు, ఎల్లో మీడియా విషపు రాతలతో చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన మండిపడ్డారు. న్యాయస్ధానాల మీద వైయస్.జగన్ కు అపారమైన గౌరవం ఉందని.. అందులో భాగంగానే ఇవాళ కోర్టుకు హాజరయ్యారన్న జూపూడి ప్రభాకరరావు… వెల్లువలా తరలివచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన బాబు పతనం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు.
18 నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. ప్రజల ఆశలు, ఆలోచనల నుంచి దూరంగా వెళ్లిన చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తప్పుడు హామీలుగా మిగిలిపోయాయి. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మరలా చంద్రబాబు ప్రభుత్వం, ఎల్లో మీడియా గతంలో వలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై ఆరోపణలు, కుట్రలు మొదలుపెట్టింది. ఇటీవల లండన్ పర్యటనకు వెళ్లిన వైయస్.జగన్ లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కచ్చితంగా కోర్టు ముందు హాజరవుతానని చెప్పారు.
అందులో భాగంగా ఆయన ఇవాళ కోర్టు ముందు హాజరైతే దాన్ని ఎల్లోమీడియా చిలువలు పలువులు చేస్తూ విషపు రాతలు రాసింది. 5-6 సంవత్సరాలుగా జగన్ కోర్టు డైరెక్టన్ లో ఉండి ప్రభుత్వంలో ఉంటూ అనుమతి తీసుకున్న విషయం అందరికీ తెలుసు. ఇవాళ వైయస్.జగన్ కోర్టుకు వస్తుంటే… బేగంపేట ఎయిర్ పోర్టు, నాంపల్లి సీబీఐ కోర్టు, లోటస్ పాండ్ దగ్గర వేలాదిగా జనం ఆయన కోసం వస్తుంటే దాన్ని చూసి ఓర్చుకోలేక ఇష్టం వచ్చినట్లు తప్పుడు రాతలు రాస్తున్నారు. జెడ్ కేటగిరీలో ఉన్న ప్రజాదరణ పొందిన నాయకుడిగా తన షెడ్యూల్డ్ ను కచ్చితంగా ప్రకటిస్తారు.
ఎప్పుడు బయలుదేరుతారు, ఏ మార్గంలో వెళ్తారు, ఎంత టైం పడుతుందన్న విషయాలన్నీ షెడ్యూల్ల్ ఇవ్వడం సహజం. ఇదే పని చంద్రబాబు నాయుడు కూడా చేస్తారు. జగన్ షెడ్యూల్డ్ పై కోర్టుకే టైం ఇచ్చాడని రకరకాలుగా వార్తలు ప్రసారం చేస్తున్నారు. తన పర్యటన నేపధ్యంలో గన్నవరం దగ్గర ప్లైట్ ఎన్ని గంటలకు ఎక్కుతాడు, హైదరాబాద్ లో ఎన్ని గంటలకు దిగుతాడు? అక్కడ నుంచి తన నివాసానికి ఎన్ని గంటలకు చేరుతాడు, నాంపల్లి కోర్టుకు ఎన్ని గంటలకు చేరుతాడు వంటి అంశాలతో షెడ్యూల్ ఇవ్వాల్సిందే.
దీన్ని బూతద్దంలో చూపిస్తూ.. .ఆయన ప్రత్యేకమైన విమానంలో వచ్చాడని.. గంటకు రూ.8 లక్షల ఖర్చు అని ఇష్టం వచ్చినట్లు కూటమి నేతల అప్రజాస్వామిక విధానంలో వ్యవహరిస్తూ.. ప్రజల దగ్గర గౌరవం కోల్పోయే విధంగా వ్యవహరిస్తున్నారు. కోర్టులంటే వైఎస్.జగన్ కు అత్యంత గౌరవం ఉంది. ఆ గౌరవంతోనే ముందుగా చెప్పిన ప్రకారం లండన్ పర్యటన తర్వాత ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. కానీ కూటమి ప్రభుత్వం, దాని అనుకూల ఎల్లో మీడియా మాత్రం పూర్తిగా వక్రీకరిస్తూ… వైయస్.జగన్ పర్యటన వివరాలపై వక్రభాష్యం చెబుతోంది. ఈ రకమైన వ్యాఖ్యలు, వార్తలు కోర్టులకు, న్యాయవ్యవస్థను వ్యతిరేకించినట్లే.