Suryaa.co.in

Andhra Pradesh

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి న్యూఢిల్లీలో భూమి కేటాయించండి

కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరీని కోరిన వైకాపా ఎంపీలు

న్యూఢిల్లీ, మార్చి 15: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణానికి న్యూఢిల్లీలో స్థలం కేటాయించాలని కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీని వైకాపా ఎంపీల బృందం కోరింది. రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, లోక్ సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ బృందం బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఎంపీలు సత్యవతి, ఎంవీవీ సత్యనారాయణ, మాధవ్,బెల్లన చంద్రశేఖర్,బ్రహ్మానంద రెడ్డి,తలారి రంగయ్య తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE