-
ఎంపీ వేమిరెడ్డి
-
నేషనల్ మెడికల్ కమిషన్ ఛైర్మన్ గంగాధర్‌కు విన్నపం
-
సానుకూలంగా స్పందించిన ఛైర్మన్
జిల్లాకు ప్రతిష్టాత్మకమైన నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌కు సంబంధించి కొత్తగా సీట్లు కేటాయించాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నేషనల్ మెడికల్ కమిషన్ ఛైర్మన్ బి.ఎన్ గంగాధర్ కి విన్నవించారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లిన ఎంపీ .. కమిషన్ కార్యాలయంలో గంగాధర్ ని కలిసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నెల్లూరు బ్రాంచ్ తరఫున వినతిపత్రాన్ని అందించారు.
2024-25 సంవత్సరానికి నెల్లూరు మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీకి సంబంధించి పీజీ సీట్లు కేటాయించాలని పేర్కొన్నారు. ఈ విభాగంలో కొత్తగా సీట్లు కేటాయించడం ద్వారా యువ డాక్టర్లకు సీట్లు అందుబాటులోకి వచ్చి పేదలకు మంచి వైద్యం అందుతుందన్నారు. జిల్లా వైద్యశాల అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన గంగాధర్ .. సీట్ల కేటాయింపుపై తప్పకుండా కృషి చేస్తామని అన్నారు.