Suryaa.co.in

Andhra Pradesh

ముక్కుసూటి మనిషి..నందమూరి హరికృష్ణ

  • తెలుగు ప్రజలకు నందమూరి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం
  • తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు

దివంగత నటుడు నందమూరి హరికృష్ణ 6వ వర్థంతిని పురస్కరించుకొని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు స్థానిక నేతలతో కలిసి హరికృష్ణ చిత్రపటానికి పూలమాల విషయం నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్‌టీ ఆర్ రాజకీయ రంగ ప్రవేశంతో ఆయన చైతన్య రథ సారథిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే ఆ పార్టీ శ్రేణులతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన ఆయన తనయుడు నందమూరి హరికృష్ణ రాజకీయ ప్రయాణంలోనూ తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు.

టిడిపి తరుపున 2008లో రాజ్యసభకు ఎన్నికైన హరికృష్ణ రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ 2013 ఆగస్ట్‌ 4న రాజ్యసభ పదవికి రాజీనామా చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, శాసనసభ్యునిగా, మంత్రిగా రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు.

LEAVE A RESPONSE