Suryaa.co.in

Andhra Pradesh

మొక్కలు నాటి, మజ్జిగ పంపిణి చేసిన మున్సిపల్ టౌన్ హైస్కూల్ పూర్వ విద్యార్ధులు

రాజమండ్రి : మున్సిపల్ టౌన్ హైస్కూల్ 1987 బ్యాచ్ పూర్వ విద్యార్ధులు విన్నూత రీతిలో తమ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు. అక్షయతృతీయ పర్వదినాన్ని పురష్కరించుకుని మరియు వృక్షోరక్ష రక్షిత: ప్రాశాస్త్యన్ని చాటిచెప్పడానికి ఇన్నీసుపేటలోని శ్రీ గౌరీ సమేత విశేశ్వర ఆలయం పరిసరాల్లో “రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ చెర్మెన్ రౌతు సూర్యప్రకాశరావు , నాటి వారి ఉపాధ్యాయురాలు ధర్మవతి చే మొక్కలను నాటించి, సామాజిక బాధ్యతను చాటుకున్నారు. అదే విధంగా వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని స్ధానికులకు, పాదాచారులకు పండ్లు, చల్లని మజ్జిగ పంపిణీ చేశారు..

టౌన్ హై స్కూల్ -1987 బ్యాచ్ విద్యార్ధులైన శ్రీరామ ఆడిటర్ ఆధినేత దింటకుర్తి సత్యనారాయణ, తెలుగుబాష వేత్త ముడుంబై రామకృష్ణ చారి, న్యాయవాది తల్లాప్రగడ రాజేశ్వరావు, కోరాడ గోపి తదితరుల సహకారంతో టౌన్ హైస్కూల్ 1987 బ్యాచ్ పూర్వ విద్యార్ధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజికసేవా దృక్పథంతో ఈ తరహాలో పలు కార్యక్రమాలను మున్ముందు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న టౌన్ హైస్కూల్ పూర్వ విద్యార్ధులు కొవ్వాడ నగేష్, దారపురెడ్డి శ్రీనివాస్, పప్పుల గోవింద్ రామ్ , క్రికెట్ డివివి, పెరుమాళ్ల సూరిబాబు, ఆండ్ర వెంకట రమణ తదితరులు ఈ సందర్భంగా తెలిపారు.

ఈ మిత్ర బృందం గత ఐదు సంవత్సరాలుగా అనేక సామాజిక, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, పట్టణ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు. తమ పూర్వ గురువులకు సన్మానం చేయడం, తమ మిత్ర బృందంలోని కళాకారులకు చేయూతను ఇవ్వడం, తమకు ఉన్నంతలో తమ బందంలోని వారిని ఆదుకోవడం చేస్తున్నాయి. అంతేకాకుండా 50 వయస్సు వడిలో కూడా, క్రికెట్ మరియు వివిధ క్రీడా పోటీలను నిర్వహించడం చేస్తున్నాయి.

మిత్ర బృందం యొక్క సామాజిక బాధ్యత, సేవ తత్వాన్ని గుర్తించి, ఈ మిత్రబృందంలోని రచయిత శ్రీపాద శ్రీనివాసు , సామాజిక, ఆధ్యాత్మిక సేవావేత్త అంబటి భీమా శంకర సాయిబాబాలకు.. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు మద్దూరి అన్నపూర్ణయ్య పేరున నెలకొల్పిన స్మారక ఆవార్డును మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి వారు ఇటీవల ప్రధానం చేయడం జరిగింది.

ఈ విధంగా పూర్వ విద్యార్థుల, రిటైర్డ్ టీచర్, ఉద్యోగుల ఆత్మీయ సమావేశాలను నిర్వహించే పలు బృందాలను ఉత్తేజిత పరుస్తూ, రాజమండ్రిలో టౌన్ హైస్కూల్ 1987 మిత్ర బృందం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

LEAVE A RESPONSE