-
అంచనాలకు మించి అనూహ్య స్పందన
-
2 రోజుల సదస్సుకు 11వేల మందికిపైగా రాక
-
సహకరించిన అందరికీ ధన్యవాలు
-
ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీ కె. దినేష్ కమార్
అమరావతి: రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 అంచనాలకు మించి విజయవంతమైందని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీ కె. దినేష్ కుమార్ తెలిపారు. రెండు రోజుల సదస్సును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు ప్రతినిధులతో పాటు సందర్భకులు కూడా భారీ సంఖ్యలో వచ్చారన్నారు. రెండు రోజులు పాటు మొత్తం 11 వేలకు పైగా సదస్సును, సదస్సులో ఏర్పాటు చేసిన డ్రోన్ ప్రదర్శనను సందర్శించారని వెల్లడించారు. రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో 4 వేల మందికిపైగా పాల్గొన్నారని, నాలుగు కీలకోపన్యాసాలతో పాటు మొత్తం 62 మంది వివిధ రంగాలకు చెందిన మేధావులు ప్యానెల్ స్పీకర్లుగా పాల్గొని అమూల్యమైన సలహాలు, సూచనలిచ్చారన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ఈ డ్రోన్ సదస్సును నిర్వహించామని, ఈ సదస్సు విజయవంతం కావడానికి వెన్నుతట్టి ప్రోత్సహించిన ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర పెట్టుబుడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి బీసీ జనార్థనరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, పెట్టుబుడలు, మౌలికసదుపాయాల శాఖ కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ఈ సదస్సు విజయవంతం చేయడంలో అలుపెరుగని కృషి చేసిన ప్రభుత్వ సిబ్బంది, పోలీసులు, ఏపీ ఫైబర్ నెట్, డ్రోన్ కార్పొరేష్, ఆర్టీజీఎస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ఈ స్థాయిలో విజయవంత అయ్యేలా తమ సహకారం అందించిన మీడియాకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ సదస్సు తమకు ఎంతో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఇచ్చిందన్నారు.