Suryaa.co.in

Andhra Pradesh

డీజీపీని కలిసిన అమరావతి జేఏసీ నేతలు

– అభినందించిన బొప్పరాజు
– మహిళా ఉద్యోగినుల రక్షణపై చర్యలు తీసుకోండి

మంగళగిరి: డీజీపీ సి.హెచ్.ద్వారకా తిరుమలరావు ని ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర కమిటి, అనుబంధ సంఘాల ఆద్వర్యంలో మర్యాదపూర్వకంగా కలసి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లులు,స్టేట్ సెక్రటరీజెనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి వి.వి.మురళీకృష్ణ నాయుడు మాట్లాడుతూ.. ఉద్యోగులపై ప్రధానంగా మహిళా ఉద్యోగులపట్ల వాళ్ళు పనిచేసే కార్యాలయాల్లో వారిపట్ల జరిగే ఉమెన్ హరాస్మెంట్ తదితర పరిస్దితులపై ఫిర్యాదులు వస్తే, వెంటనే చర్యలు తీసుకొని ఉద్యోగులంతా ఆత్మస్ద్యర్యంతో విధులు నిర్వహించుకొనే పరిస్దితులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిజిపి ద్వారకాతిరుమళరావు కి విజ్ఞప్తి చేయగా, డిజిపి సానుకూలంగా స్పంందించారు.

ఈ కార్యక్రమంలో ఏపిజేఏసి అమరావతిలో ఉన్న అనుబంధ సంఘాల రాష్ట్రనాయకులు ప్రధానంగా రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాస రావు, వారి కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర హోం గార్డ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యస్.గోవిందు వారి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,
ఏపి ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సంసాని శ్రీనివాసరావు, ఏపీ క్లాస్ -IV ఎంప్లాయీస్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యస్. మల్లేశ్వరరావు, ఏపీ జెఏసి అమరావతి మహిళా విభాగం చైర్ పర్సన్ పారే లక్ష్మి, సెక్రటరీ జెనరల్ పొన్నూరు విజయలక్ష్మి, సిటీ జేఏసీ మహిళా విభాగం చైర్ పర్సన్ శ్రీదేవి, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు వేల్పుల అర్లయ్య, మున్సిపల్ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ దోప్పలపూడి, ఎన్టీఆర్ జిల్లా జేఏసీ అమరావతి చైర్మన్ బత్తిన రామకృష్ణ, గుంటూరు జిల్లా జేఏసీ అమరావతి చైర్మన్ కే.సంగీతరావు, రెవెన్యూ అసోసియేషన్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తదితరులు డీజీపీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A RESPONSE