– గత ప్రభుత్వం అవినీతి చేస్తే మంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?
• టీడీపీ ప్రభుత్వంలో ఉపాధిహామీ పనుల్లో అవినీతి జరిగితే అధికారంలోఉన్న మీరెందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు
• తన అసమర్థత, వైసీపీప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చడానికే పంచాయతీ రాజ్ మంత్రి టీడీపీ అవినీతి చేసిందంటున్నాడు
• జగనన్నకాలనీలపేరుతో రూ.7వేలకోట్ల ఉపాధిహామీ నిధుల్ని వైసీపీ ఎమ్మెల్యేలు దోచుకున్నారు
• నిజంగా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఉపాధిహామీ పనుల్లో అవినీతి లేకపోతే తక్షణమే రిటైర్డ్ జడ్జితో జగన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి
– మాజీమంత్రి ఎన్. అమర్నాథ్ రెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టీడీపీప్రభుత్వంలో ఉపాధిహామీ పనుల్లో అవినీతి జరిగినట్టు మూడేళ్లతరువాత గుర్తురావడం శోచ నీయంగా ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఎన్. అమర్నాథ్ రెడ్డి ఎద్దేవాచేశారు.శనివారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయనమాటల్లోనే …
వైసీపీప్రభుత్వం వచ్చిన ఈమూడేళ్లలో కేవలం ఒక్కసంవ్సరం లోనే ఉపాధిహామీపథకంలో జరిగిన అవినీతికి సంబంధించి లక్ష కేసులునమోదయ్యాయనే వాస్తవాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఎందుకు విస్మరించారు? కేంద్ర స్టాండింగ్ కమిటీ విచారణలో రూ.261కోట్ల వరకు అవినీతిజరిగినట్లు తేలినవిషయం ఆయనకు తెలియదా.. లేక తెలియనట్టు నటిస్తున్నారా? దేశవ్యాప్తంగా రూ.970కోట్లకు పైగా అవినీతిజరిగితే దానిలో రూ.261కోట్ల అవినీతిఏపీలోనే జరిగింది.
టీడీపీప్రభుత్వంలో ఉపాధిహామీ పనుల్లో నిజంగా అవినీ తి జరిగుంటే, వైసీపీప్రభుత్వం, మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి. అధికారంచేతిలో ఉంచుకొని కూడా అవినీతికి పాల్పడినవారిని శిక్షించకుండా ఊరికే ఉపన్యాసా లు ఎందుకుఇస్తున్నారని ఈ సందర్భంగా మంత్రిని ప్రశ్నిస్తున్నాం. అవినీతి జపంచేస్తూ మూడేళ్లనుంచి టీడీపీహాయాంలో జరిగిన పనులతాలూకాబిల్లులను ఇంతవరకు చెల్లించలేని అసమర్థులు ఇప్పుడున్నపాలకులు.
ప్రభుత్వనిర్లక్ష్యంతో బిల్లులుఅందక ఇప్ప టికే 50మంది అప్పులభారంతో చనిపోయింది నిజమా..కాదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.26వేలకోట్ల వరకు ఉపాధిహామీ నిధులు కేంద్రంనుంచి రాష్ట్రానికివస్తే, వాటితో ఎన్నిరోడ్లు వేశారో, ఇతరత్రా అభివృద్ధికార్యక్రమాలు ఏం నిర్వహిం చారో మంత్రి సమాధానంచెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.
నరేగానిధులతో ప్రజలకుఉపయోగపడే పని ఒక్కటికూడా ఈప్రభు త్వంచేయలేకపోయింది. టీడీపీప్రభుత్వ ఐదేళ్లపాలనలో నరేగా నిధులతో చేపట్టిన పనుల్లో రాష్ట్రంముందువరసలో నిలిచి, దేశానికే ఆదర్శంగా నిలిచింది. లెక్కకుమిక్కిలి అవార్డులు కేంద్రంనుంచి వచ్చింది నిజమా…కాదా? గ్రామాల్లో 24వేలకిలోమీటర్ల వరకు సిమెంట్ రోడ్లు, 14వేలకిలోమీటర్లు బీటీరోడ్లు, టీడీపీప్రభుత్వం వేసింది నిజమా..కాదా?
38లక్షల మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు, 21లక్షల ఎల్ఈడీ వీథిదీపాలను టీడీపీప్రభుత్వంలో ఏర్పాటు చేసింది నిజమోకాదో మంత్రిపెద్దిరెడ్డే చెప్పాలని డిమాండ్ చేస్తు న్నాం. ఇప్పటికీ టీడీపీప్రభుత్వంలో వేసిన ఎల్ ఈడీ లైట్లు పాడైపో తే, వాటిస్థానంలో ఈప్రభుత్వం కొత్తవి ఏర్పాటుచేయలేని దౌర్భాగ్యపుస్థితిలోఉంది. టీడీపీహాయాంలో ఉపాధిహామీ నిధులతో 4,590 పంచాయతీ భవనాలు, 5525 అంగన్ వాడీభవనాలు నిర్మించడంతోపాటు, 2,220కుపైగా శ్మశానవాటికలను అభివృద్ధి చేయడం జరిగింది.
10వేలకుపైగా చెత్తతయారీకేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన ఘనతకూడా చంద్రబాబుకే దక్కింది. ఇలా…కళ్లముందు టీడీపీహాయాంలో జరిగిన అభివృద్ధిపనులు కళ్లముందుకనిపిస్తుంటే, సిగ్గులేకుండా అవినీతి జరిగిందని చెప్పడం అవినీతిపరులకే చెల్లింది. వైసీపీప్రభుత్వం వచ్చాక టీడీపీహాయాంలో నిర్మించిన పంచాయతీభవనాలు, చెత్తసంపద కేంద్రాలు, శ్మశానవాటికలకు తమపార్టీ రంగులు వేసుకుంది తప్ప, ఎక్కడా అదనంగా ఒక్కనిర్మాణంచేయలేకపోయింది. తమ ప్రభుత్వంలో ఈవిధంగా లెక్కకుమిక్కిలి అభివృద్ధిపనులు ఉపాధి హామీనిధులతో జరిగితే, ఆ విషయాన్ని ఎర్రచందనం దోచుకొ నే మంత్రి గుర్తించకపోతే ఎలా?
ఉపాధి హామీ నిధులతో పాటు, నీరుచెట్టు కార్యక్రమంకింద టీడీపీప్రభుత్వంలో 3 నుంచి 3.50 మీటర్ల వరకు భూగర్భజలాలు రాష్ట్రవ్యాప్తంగా పెరిగాయి. టీడీపీ హాయాంలో నిర్మించిన చెరువులు, కుంటలు, చెక్ డ్యాముల కార ణంగా నేటికీ రైతులు పంటలుసాగుచేసుకుంటున్నారు. చంద్రబాబు గారి హాయాంలో నీరు-చెట్టుపథకం కింద, 7లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడింది. ఇవన్నీమేం గొప్పలు చెప్పడంకాదు…కళ్లముందు జరిగినకార్యక్రమాలు. నేటికీ కనిపి స్తున్న అభివృద్ధిపనులు. అంతగొప్పగా టీడీపీహాయాంలో జరిగినన పనులుతాలూకా బిల్లులుచెల్లించకుండా , జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేటికీ కాంట్రాక్టర్లను, ఉపాధిహామీపనులుచేసిన వారిని ఏడిపిస్తున్నది నిజమా..కాదా?
జగనన్నకాలనీలపేరుతో ఈ ప్రభుత్వం దాదాపు రూ.7వేలకోట్ల ఉపాధిహామీనిధుల్ని దుర్వినియోగంచేసింది. ఆసొమ్మంతా వైసీపీ ఎమ్మెల్యేలు, కిందిస్థాయినేతలజేబుల్లోకి వెళ్లింది తప్ప, క్షేత్రస్థాయి లో ఎక్కడా ప్రజలకు ఉపయోగపడే పనులుజరగలేదు. ఆవిధంగా జరిగిన పనుల్లోని అవినీతి బయటపడిందనే మంత్రిపెద్దిరెడ్డి, పాత పాటేపాడుతూ టీడీపీఅవినీతి చేసిందంటున్నాడు. నిజంగా తమ ప్రభుత్వంలో అవినీతిజరిగితే అధికారంచేతిలోఉంచుకున్నవారు, చర్యలు తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు?
నిజంగా మీకు దమ్ము,ధైర్యం ఉంటే అవినీతిపరులపై చర్యలు తీసుకోండి. గతప్రభుత్వాలపై ఇంకా బురదజల్లి, పబ్బం గడుపుకుందామంటే ప్రజలు హర్షిస్తారు అనుకోకండి. నిజంగా ఈప్రభుత్వంలో ఉపాధి హామీ పనులు గొప్పగాజరిగితే, ప్రజలకుఉపయోగపడేలా ఉంటే, రిటైర్డ్ న్యాయమూర్తితో సదరుపనుల తీరుతెన్నులపై విచారణ జరిపించాలని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం.