-పెగాసస్ స్పై వేర్ తో చంద్రబాబు ఎవరిపై ప్రయోగించారు, ఏం రహస్యాలు తెలుసుకున్నాడో విచారణ జరగాలి
-చంద్రబాబు నాయుడు ఇల్లీగల్ పొలిటీషియన్.. ఆయనకు ఇక అండమాన్ జైలే గతి
-చంద్రబాబు రాజకీయాల్లో ఈవెంట్ మేనేజర్.. రాజకీయాలు అంటే బాబుకు మేనేజ్మెంటే..
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి గుడివాడ అమర్నాథ్
గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఏమన్నారంటే….
విశాఖ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో హోంశాఖ అంశం మీద మాట్లాడుతూ.. దేశ భద్రతకు భంగం కలిగించేటువంటి పెగాసస్ స్పై సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడుతూ ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసస్ స్పై సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేయాలని ఆ సంస్థ మాకు మంచి ఆఫర్ ఇస్తే దాన్ని మేము తిరస్కరించాం. అనంతరం ఆ సాఫ్ట్‌వేర్ ను చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మమతా బెనర్జీ చెప్పారు.
దీంతో పెగాసస్ స్పై సాఫ్ట్‌వేర్ అంశం దేశవ్యాప్తంగా కుదిపేసింది. దీనిపై అప్పట్లో విచారణ జరగాలని డిమాండ్ చేయడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇల్లీగల్ యాక్టివిటీని చేశారని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కర్మ సిద్ధాంతానికి వస్తే …ఎవరు చేసిన పనులకు వాళ్లే ఫలితం అనుభవిస్తారు. అలాగే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారని అందరికీ తెలుసు. ఇవన్నీ సృష్టిలో జరిగే అంశాలే. చంద్రబాబు పరిస్థితి కూడా అంతే..
చంద్రబాబు నాయుడు చేసిన పాపాలకు అనుభవించే రోజు వచ్చిందని మాట చెప్పడంలో ఏరకంగా వెనకడుగు వేయాల్సిన పరిస్థితి లేదు. చంద్రబాబు అనే వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో ఈవెంట్ మేనేజర్‌లాంటివాడు. రాజకీయాలంటే ఆయనకు మేనేజ్‌మెంట్ తప్ప, ప్రజల అభిమానం, మన్ననలు పొంది అధికారంలోకి రావాలనే ఆలోచన చేసిన సందర్భాలు లేవు. వాళ్ల సాయమో, లేకపోతే వాళ్ల, వీళ్ల భుజాల మీదో ఎక్కి అధికారంలోకి రావడం, ఎవరి కాళ్లు పట్టుకునో… ఎవరి కాళ్లు లాగేసో అధికారంలోకి రావడం చంద్రబాబు నైజం అని అందరికీ తెలుసు.
చంద్రబాబు జీవన విధానం చూస్తే ఆయన పెరిగిన వాతావరణం, ఆయన రాజకీయ చరిత్ర అంతా అనైతికమే. చంద్రబాబు చదువుకున్న రోజుల్లో ఎస్వీ యూనివర్శిటీ కథనాలు తెలుసు. సీటు ఇచ్చి రాజకీయ భవిష్యత్ ఇచ్చిన ఇందిరాగాంధీకి, పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచాడు. టెక్నాలజీకే పితామహుడిని అనే చంద్రబాబు నాయుడు సెల్‌ఫోన్ నేనే కనిపెట్టా, కంప్యూటర్ వాడే విధానం చూసి బిల్‌గేట్స్ ఆశ్చర్యపోయాడు అనే చంద్రబాబు మాటలు విన్నాం.
చివరకు దేశంలో, మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటుంటే… వినవచ్చనే టెక్నాలజీని చంద్రబాబు కొన్నాడంటే ఆ సాఫ్ట్‌వేర్‌ను రాజకీయ నాయకుల కోసమా, పారిశ్రామికవేత్తల కోసమా, ఎవరి కోసం కొనుగోలు చేశారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ చేయాలి. ఇది సామన్యమైన విషయం కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న స్వాతంత్ర్యాన్ని భంగం కలిగించడమే కాకుండా, దేశ భద్రతకు భంగం కలిగించే విషయంలో కీలకపాత్ర పోషిస్తుందనే అంశాన్ని గమనించి దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఇందులో ఎవరి పాత్ర ఉందో? ఎవరి సమాచారన్ని తీసుకోవడానికి ఈ కార్యక్రమం చేశారో అనేది బయటకు రావాలి. ఎవరి సంభాషణలు వినడానికి, ఏ సమాచారం కనుగొనడానికి పెగాసస్ స్పై సాఫ్ట్‌వేర్ ద్వారా ఫోన్ మాట్లాడుతున్నప్పుడే కాకుండా, ఫోన్‌లో ఉన్న సమాచారాన్ని, ఈమెయిల్, బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేసే అవకాశం ఉంది.
అసలు దీన్ని ఎవరెవరి మీద ప్రయోగించారో బయటకు రావాలి. రాష్ట్రంలోని అయిదు కోట్ల ప్రజల తాలుకా స్వతంత్ర్యాన్ని హరించడమే ఇది. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణను వినడం ఎంత అన్యాయమైన విషయం. షాపింగ్ మాల్‌లో సీసీ కెమెరాలు పెట్టి రికార్డు చేయడం ఎంత పాపమో, ఇద్దరు వ్యక్తులు ఫోన్‌లో మాట్లాడుకున్న మాటలు వినడం అంతకన్నా వెయ్యిరెట్లు పాపం, క్షమించరాని నేరమని మన చట్టాలు చెబుతున్న అంశాలు. అలాంటిది చంద్రబాబు నాయుడు అంతపెద్ద నేరానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోతే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సెక్షన్ 8, నాకూ ఏసీబీ, పోలీస్ వ్యవస్థ ఉందంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడావే?
ఇవాళ మమతా బెనర్జీగారు ఇంత పెద్ద స్టేట్‌మెంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు కనిపించడే? జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో దాక్కున్నారా? కరకట్ట కొంపలో కూర్చున్నారా? మీ అడ్రస్ ఎక్కడో చెప్పండి. తేలుకుట్టిన దొంగలా బయటకు రావడం లేదు ఎందుకు? దీనిమీద ఎందుకు మాట్లాడటం లేదని చెప్పాల్సిన అవసరం ఉంది.
పెగాసస్ స్పైవేర్ మీద మాట్లాడిన ముఖ్యమంత్రిగారు సామాన్య వ్యక్తి కాదు కదా? మీకులా బ్యాక్‌డోర్ మనిషి కాదు కదా?మీ అంత నీచమైన రాజకీయ చరిత్ర ఆమెకు లేదే? 2019లో మమతా బెనర్జీ కోసం ప్రచారం చేశారు. మరి మమతా మాట్లాడిన మాటలకు మీరు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? చంద్రబాబు నాయుడు ఇల్లీగల్ పొలిటీషియన్. లీగల్‌గా ఏరోజు రాజకీయాలు చేయలేదు, అధికారాన్ని సాధించలేదనేది ప్రజలందరికీ తెలుసు.
అండమాన్‌లో రెండు సీట్లు గెలిచారని మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో సంబరాలు చేసుకుంటున్నారు. మీరు చేసిన కుట్రలు, నేరాలు, కుతంత్రాలకు ఇక మీ చంద్రబాబు గతి అండమాన్ జైలే అన్న విషయాన్ని మర్చిపోవద్దు. నారా లోకేష్ మాట్లాడుతూ నిజంగా ఆ సాఫ్ట్‌వేర్ మా దగ్గర ఉంటే 2019లో అధికారంలోకి వచ్చేవాళ్లం కదా అంటాడు. ఇద్దరు వ్యక్తులు ఏం మాట్లాడుకుంటున్నారో వింటేనో.. మీకు ఓట్లు వేసేస్తారా?
2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్ర సృష్టిస్తే ఈవీఎంలను ట్యాపరింగ్ చేశారని ఆరోపణలు చేస్తారు. మరి మీకున్నంత సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ మాకు లేదు. మీ అంత నేర చరిత్ర కలిగిన ఆలోచనలు మాకు లేవు. ఇలాంటి ఆలోచనలు చేసి రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకోవడం సామాన్యమైన విషయం కాదు. జగన్ మోహన్ రెడ్డిగారు మీకులా పెగాసస్ స్పైవేర్‌లో, లేకుంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేది వినో… రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు.
2011లో వైయస్సార్ సీపీని స్థాపించి, ప్రజల తాలుకా గుండె చప్పుడు విని, గ్రామాలకు వెళ్లి వాళ్ల కష్టాలు తెలుసుకుని 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి.. తన సొంత కష్టం మీద అధికారంలోకి వచ్చారు.
అసెంబ్లీలో ఎవరో ఏదో అన్నారని, మీడియా అందరినీ పిలిచి భోరుభోరున, వెక్కివెక్కి ఏడ్చారే, మరి మమతా బెనర్జీ అంత మాట అంటే ఎందుకండి బయటకు వచ్చి ఏడ్వడం లేదు? ఏడవడం మాట అటుంచితే కనీసం బయటకు వచ్చి మాట్లాడటం లేదు? అనని దానికి ఏడ్చిన మీరు… అన్నందుకు ఎందుకు ఏడవడం లేదని రాష్ట్ర ప్రజల ప్రశ్న. ఆర్టీఏ ద్వారా అడిగితే పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేయలేదని అప్పటి డీజీపీ సవాంగ్ సమాధానం ఇచ్చారని చెప్పుకుంటున్నారు.
చేసేది దొంగపని. ఆ దొంగపని చేస్తూ ప్రభుత్వ డబ్బులతో కొంటారా.. అని మీరు చెబితే వినడానికి అమాయకులు ఎవరున్నారు ఈ రాష్ట్రంలో? మీ కుటుంబం, మీ రాజకీయ చరిత్ర, మీ తాలుకా ఇమేజ్ ఇవన్నీ.
-నారా లోకేష్ చిరుతిళ్లకు రూ.30లక్షలు ఖర్చు అయిందని ఒక దినపత్రిక వార్త రాస్తే వందకోట్ల రూపాయిలు పరువునష్టం దావా వేశారే?
మరి దేశంలోనే సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను మీరు కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడితే ..ఆమె మీద ఎంత కు పరువునష్టం దావా వేస్తారు? దానికి సమాధానం చెప్పరు. వెయ్యి, పదివేలకోట్లుకు పరువునష్టం దావా వేస్తారా? మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తప్పించుకునేందుకు ప్రభుత్వంపై నోటికి వచ్చిన మాటలు మాట్లాడటం సహజం అయిపోయింది.
తండ్రి ఇల్లీగల్, కొడుకేమో ఇన్ ఎఫీషియెంట్. తండ్రేమో అక్రమాలు, కొడుకేమో సోమరిపోతు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు, ఆయన కొడుకు అక్రమాలతో ముందుకు వెళుతున్నారు. ఆవు చేలో మేస్తే… దూడ గట్టున మేస్తుందా అనే సామెతలా తండ్రీకొడుకులిద్దరూ ఆరకంగానే ఉన్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి కల్తీసారా, మద్యం అంటూ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. పెగాసస్ అంశం నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి నాటుసారా, మద్యం అంటూ ఉద్యమం చేద్దామంటూ అందర్నీ రోడ్డెక్కించారు.
జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 20మంది చనిపోయారంటూ అసెంబ్లీ సమావేశాలను అడ్డుకోవడం రాష్ట్ర ప్రజలంతా చూశారు.పేదవాళ్లు అంటే టీడీపీకి ఎంత ప్రేమ వచ్చిందండి? ప్రేమ, ఈ అభిమానం, దాత్వతృం, బాధ, ఆవేదన… మీరు అధికారంలో ఉన్నప్పుడు, రైతులను పిట్టలను కాల్చినట్టు కాల్చిసినప్పుడు లేదా అని ప్రశ్నిస్తున్నాం. మీ సినిమా షూటింగ్‌ల కోసం రాజమండ్రి పుష్కరాల్లో 29మంది ప్రాణాలను బలిగొన్నపుడు లేదా? చనిపోయిన వారి కుటుంబసభ్యులను కనీసం పరామర్శిచలేదే? మీకు రాష్ట్రంలో ఏదైనా మృతదేహం కనిపిస్తే శవ రాజకీయాలు చేయడమే పనిగా పెట్టుకున్నారు.
రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీ పరిధిలో సంఘటనపై ప్రజలకు వివరించడం జరిగింది. టీడీపీ తన రాజకీయ అవసరాల కోసం అక్కడక్కడ జరిగిన మరణాలను అన్నీ ఒక దగ్గరకు తెచ్చి నాటుసారా మరణాలు అంటూ.. అసత్య ప్రచారాలు చేశాయి. చనిపోయినవారు కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నరనే విషయాన్ని మృతుల కుటుంబాలు కూడా చెప్పాయి. అయినా రాజకీయల కోసం ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలి.
టీడీపీ ఎలా దిగజారిపోయిందంటే.. భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఉన్న చినజీయర్ స్వామి మీద కూడా అభా0 డాలు వేసి దుష్పచారం ఎలా చేసిందో చూస్తున్నాం. చంద్రబాబుకు నచ్చితే స్వర్గం, నచ్చకపోతే నరకం. ఆయనను తప్ప ఎవరినీ ప్రశంసిస్తే భరించలేడు. ఇలాంటి నాయకుడి మాటలు, చేష్టలు చూస్తే ..శిఖండి కూడా సిగ్గుపడిపోతారు. మీ మాటలు వింటే ఊసరవెల్లి కూడా ఉరేసుకుని చచ్చిపోతుంది. ఇలాంటి కుట్రలు, కుతంత్రాల రాజకీయాలు చేసే వ్యక్తి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం దురదృష్టకరం. చేసిన పాపాల నుంచి తప్పించుకునే శక్తి ఎవరికీ లేదు. ఆ పాపాలు చేసిన చంద్రబాబు నాయుడు శిక్షార్హుడే.
ఇల్లీగల్ పనులుకి ప్రభుత్వం ఎందుకు వత్తాసు పలుకుతుంది. ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటుంటే వినడం తప్పు. మీరు చేసింది చట్ట విరుద్ధం. మమతా మాటలకు ప్రశాంత్ కిషోర్‌కు ఏమి సంబంధం..? వైయస్సార్ సీపీకి మాట్లాడే ధైర్యం లేదా? మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు ఒకటే కూటమి. పెగాసస్ స్పైవేర్ కొనుగోలుపై కేంద్రప్రభుత్వాన్ని విచారణ కోరతాం.