– బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం
అమరావతి… రాష్ట్ర రైతాంగానికి సాగునీటిని అందించలేని ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు అవాకులు చవాకులు ప్రేలడం మానుకోవాలి. ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి ని విమర్శలు చేసే స్థాయి మీకు లేదు. ఈమేరకు బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం ఒక ప్రకటన మీడియా కు విడుదల చేశారు.
మద్యం స్కాం పై సిబిఐ విచారణ కోరగానే వైసీపి నేతలకు వణుకు పుడుతోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేస్తుంటే మంత్రి అంబటి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీల మద్యఉన్న రాజకీయ కక్షలను ఆసరాగా తీసుకుని పురందేశ్వరి పై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించ జాలమన్నారు.
బందుత్వాన్ని పురస్కరించుకుని పురందేశ్వరి గారికి ఏదో ఆపాదించాలని చూస్తే అదేవిధమై న విమర్శలు ఇటువైపునుండి కూడా చేస్తే తట్టుకోగలరా అని ప్రశ్నించారు నాగభూషణం. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని రాష్ట్రప్రభుత్వం పై ఆరోపణ చేస్తే సమాధానం చెప్పే దమ్ము వైసీపి ప్రనభుత్వానికి లేదు. మద్యం అమ్మకాల్లో నగదు ఎక్కడకు పొతోందని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత ఆరోపణలు అంబటి చేయడమేంటని ప్రశ్నించారు నాగభూషణం. సర్పంచ్ ల నిధులు దారిమళ్లించారని ఆరోపించి ప్రజలకు శ్వేత పత్రం విడుదల చేయమంటే ఇంతవరకు ప్రభుత్వోంలోని మంత్రులు ఎవ్వరూ నోరు మెదప లేదు.
మద్యం స్కాం పై సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోమంత్రిని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు కోరగానే అంబటి అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోవడానికి సిద్దంగా లేమని పాతూరి నాగభూషణం హెచ్చరించారు.