Suryaa.co.in

Andhra Pradesh

శవాలపై చిల్లర ఏరుకోవడం సిగ్గు సిగ్గు

-ఆంబోతు అంబటిని కేబినెట్ నుండి బర్త్ రఫ్ చేయాలి
-మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ కు ఫిర్యాదు చేసిన టీడీపీ బీసీ నేతలు

చనిపోయిన వారికి భరోసా ఇవ్వాల్సింది పోయి, మృతుడికి వచ్చే పరిహారంలో వాటా డిమాండ్ చేయడం సిగ్గుచేటు అని తెలుగుదేశం పార్టీ బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితుడికి ప్రభుత్వం నుండి అందిన పరిహారం సొమ్ములో సగం ఇవ్వకుంటే ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని, దాడి చేస్తామని మంత్రి అంబటి రాంబాబు బెదిరించడం మానవ హక్కుల్ని హరించడమే అన్నారు. ఈ మేరకు మహిళా కమిషన్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు.

పరిహారం డబ్బులో వాటా ఇవ్వాలంటూ బీసీ వర్గానికి చెందిన(వడ్డెర) మహిళను వేధించిన అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు టీడీపీ నేతల ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకు దిగారు. బీసీ వంచకుడు జగన్ రెడ్డి అన్నారు. శవాలపై చిల్లర ఏరుకునే అంబటి రాంబాబు.. సవాల్ మేరకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు టీడీపీ బీసీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. ఎక్కడా లంచం అడిగే పరిస్థితులు లేవు, అవినీతి లేదు అంటూ ప్రసంగాలు దంచే జగన్ రెడ్డి అంబటి రాంబాబు ఘటనలో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 20న అనిల్ అనే యువకుడు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ చనిపోతే.. ప్రభుత్వం నుండి వచ్చిన రూ.5లక్షల పరిహారంలో రూ.2.50 లక్షలు డిమాండ్ చేయడం వాస్తవం కాదా? ఇలాంటి అవినీతి పరుల్ని జగన్ రెడ్డి వెనకేసుకురావడం పేదలకు అండగా నిలవడమా?

బిడ్డపై ప్రమాణం చేసి.. అంబటి రాంబాబు వేధింపుల్ని వివరిస్తుంటే ముఖ్యమంత్రి ఎందుకు నోరు తెరవడం లేదు.? జగన్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే అంబటి రాంబాబును కేబినెట్ నుండి బర్త్ రఫ్ చేయాలి. మొన్నటికి మొన్న పుంగనూరులో రామచంద్రయాదవ్ ఇంటిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు దాడి చేస్తే కనీసం చర్యలు లేవు. 26 మంది బీసీలను చంపేశారు. నడిరోడ్డుపై బీసీల పీకలు కోస్తుంటే జగన్ రెడ్డి బీసీలను ఉద్దరించానని చెప్పుకుంటున్నాడు.

ఆదరవుగా నిలవాల్సిన కుమారుడు చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు సాయంలో వాటాలు అడగడం శవాలపై చిల్లర ఏరుకోవడం కాదా? ఇదే విషయంపై ప్రశ్నించిన ప్రతిపక్షాలపై దాడులు చేయడం, విమర్శలు చేయడం సిగ్గుచేటు. బీసీ వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తే తెలుగుదేశం పార్టీ నేతలు చూస్తూ ఊరుకోరు. స్వార్థ రాజకీయాల కోసం కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తే తీవ్రమైన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నాం. బీసీలను అలుసుగా చూస్తే తిరగబడతాం. బీసీలను చిన్నచూపు చూస్తే తరిమితరిమి కొడతాం. బాధిత కుటుంబానికి న్యాయం చేయకుంటే రాష్ట్ర వ్యాప్త నిరసనలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు.

కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి, బీసీ నేతలు తాడిబోయిన చంద్రశేఖర్ యాదవ్, పేరేపి ఈశ్వర్, సింగం వెంకన్న, మల్లెల ఈశ్వరరావు, మద్దిరాల గంగాధర్, ప్రసన్న ఆంజనేయరాజు, వల్లూరు మధుబాబు, వేముల కొండ శ్రీనివాసరావు, షేక్ బాబు, ఏడుకొండలు, గొడుగు శంకర్, తెలుగుమహిళ నేతలు మాల్పురి సాయి కళ్యాణి, వినీల, సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE