Suryaa.co.in

Andhra Pradesh

బాలకృష్ణ మీసాలు తిప్పాల్సింది బాబు వద్దే

– ఇదే సరైన అవకాశం… నందమూరి వంశం ప్రతాపాన్ని చూపండి
– రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

వారికి కావాల్సింది చర్చ కాదు…రచ్చ:
సభలో చంద్రబాబు అరెస్టుపై టీడీపీకి కావాల్సింది చర్చ కాదు..రచ్చ.
చంద్రబాబు అరెస్ట్, అవినీతిపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.
ఈ రోజు సభలో చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించడానికి మేం సిద్ధంగా ఉన్నాం.
కానీ టీడీపీ వారు మాత్రం సిద్ధంగా లేరు.. మీకు నిజంగా చర్చకు చిత్తశుద్ధి ఉంటే రండి.
మీకు నమ్మకం ఉంటే చంద్రబాబు నీతిమంతుడు, నిప్పు అనే విశ్వాసం ఉంటే చర్చలో పాల్గొనండి. పారిపోవద్దు.
మీసాలు తిప్పడం వల్ల ఏం ఉపయోగం లేదు. ముందుగా బాలకృష్ణ మీసాలు టీడీపీలో తిప్పాలి.
ఇప్పటికైనా, మీ తండ్రిగారైన నందమూరి తారకరామారావు వెన్నులో దించిన కత్తి తీసుకుని బయటకు రండి.
ఇది మీకు ఒక మంచి అవకాశం. మీ నాన్న పెట్టిన పార్టీని బతికించుకునేందుకు ఇదొక మంచి అవకాశం.
జన్మనిచ్చిన తండ్రికి క్లిష్ట సమయంలో మీరు సహాయం చేయలేదనే అపవాదు ఉంది.
ఆ అపవాదును తుడిచివేసే మహత్తర అవకాశం బాలకృష్ణకు వచ్చింది.
ఇప్పుడు మీ బావగారు జైల్లో ఉన్నారు.. మీ అల్లుడు ఢిల్లీలో ఉన్నాడు.. ఎందుకు ఉన్నాడో తెలియదు.

ఈ అవకాశం మళ్లీ రాదు..నందమూరి వంశ ప్రతాపాన్ని చూపండి..!:
ఈ అవకాశంతో పోయిన పార్టీ పగ్గాలు మళ్లీ తీసుకోండి…నందమూరి వంశం ప్రతాపాన్ని చూపించండి.
మీ పార్టీని బతికించుకోండి. అలా బతికించుకోడానికి ఇదొక చక్కని అవకాశం.
మీ నాన్న పెట్టిన పార్టీని బతికించుకునే చక్కని అవకాశం, మీపై పడిన మచ్చను మాపుకునే అవకాశం.
మీరు సమర్ధులే..అయితే ఆ పని చేయండి. మీరు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
మీ బావగారు ముఖ్యమంత్రిగా చేశారు.. ఒక సారి ఓడిపోయాడు.
మీ అల్లుడు అసలు ఎక్కడా గెలవకుండానే మంత్రిగా చేశాడు.
మీరు రెండు సార్లు గెలిచినా మంత్రిగా చేయలేకపోయారు.
మీ అన్న హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చినా తర్వాత తీసి పక్కన పెట్టాడు.
ఒక సారి గుర్తుకు తెచ్చుకోండి మీ కుటుంబానికి ఎంత అన్యాయం జరిగిందో గుర్తుకు తెచ్చుకోండి.
మీకు నాయకత్వ లక్షణాలున్నాయి…అలా అని శాసన సభలో కాదు మీసం తిప్పాల్సింది..మీ పార్టీలో తిప్పండి.
మా వ్యతిరేక పార్టీ అయినా సరే ఒక సూచన, సలహా ఇస్తున్నా.

నిన్న స్పీకర్‌పై దాడికి ప్రయత్నించారు:
నిన్న శాసనసభలో బాలకృష్ణ గారికి మొదటి హెచ్చరిక జారీ చేశారు..తప్పు చేస్తే రెండో హెచ్చరిక ఉంటుంది.
చంద్రబాబును అరెస్ట్‌ చేశారు కాబట్టి ఏదో ఒక గొడవ చేయాలని వస్తున్నారు.
పేపర్లు చించేసి, పోడియంపై ఉన్న మానిటర్‌ను పీకేశారు…స్పీకర్‌పై దాడి చేయాలనే పథకంతో వచ్చారు.
ఒకవేళ అరెస్ట్‌ అయితే.. ఆ తర్వాత స్పీకర్‌పై దాడి చేసిన తెలుగుదేశం అని ఎల్లో మీడియాలో బ్యానర్ వార్తల కోసం వారు తాపత్రయ పడ్డారు.
చర్చకు మేం అంగీకరించిన తర్వాత ఎందుకు గొడవ అనేది ప్రజలు కూడా ఆలోచించాలి.

LEAVE A RESPONSE