Suryaa.co.in

Andhra Pradesh

కాపులంటే రామోజీకి ఎందుకు కడుపు మంట?

– కాపులపై కేసులు పెట్టింది టీడీపీ.. ఎత్తివేసింది వైఎస్ఆర్సీపీ
– కాపులను సర్వనాశనం చేయడమే టీడీపీ లక్ష్యం
– రాజకీయ కుట్రతోనే తుని ఘటనలో కాపు నేతలపై కేసులు
– ముద్రగడ పద్మనాభాన్ని హింసించి పైశాచిక ఆనందం పొందిన సైకో చంద్రబాబు
– కాపుల్ని తీసుకెళ్ళి చంద్రబాబు దొడ్లో కట్టేయాలన్నదే పవన్ కల్యాణ్ లక్ష్యం
– సినిమాను అమ్మేసినట్టుగా కాపుల్ని అమ్మేయాలంటే కుదరదు పవన్ కల్యాణ్!
– టీ-కాఫీ అలవాటు లేని వంగవీటి రంగాకు టీ ఇచ్చానని చెప్పే అజ్ఞాని పవన్ కల్యాణ్
– పవన్ కలిసినా.. చంద్రబాబుతో కాపులు కలవరు
– రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి అంబటి రాంబాబు

రాజకీయ కుట్రతోనే తుని ఘటనలో కేసులు
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపుల్ని బీసీల్లో చేరుస్తామని హామీనిచ్చి విఫలమవుతున్న దశలో ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో పెద్ద ఎత్తున్న కాపు ఉద్యమం జరిగింది. తునిలో 2016 జనవరి 31న ముద్రగడ పద్మనాభం గారు ఆధ్వర్యంలో కాపు గర్జనకు పిలుపునిస్తే.. తెలుగురాష్ట్రాల్లోని కాపు సోదరులందరూ తరలివెళ్లారు. అక్కడ కొన్ని సంఘటనలు జరిగాయి. ఒక రైలు దగ్ధమైంది. తునిలో రైల్వేప్రోటెక్షన్‌ వారు ఒక కేసు కూడా దాఖలు చేశారు.ఆ సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వం.. కాపులపై అనేక కేసులు రిజిస్టర్‌ చేసింది. తుని రైలు ప్రమాదం కేసు విచారణ తర్వాత న్యాయవ్యవస్థ ఆకేసును కొట్టివేయడం హర్షణీయం. కాపు జాతి మొత్తం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ కేసులో ముద్రగడ పద్మనాభంతో పాటు ఇతర నేతలతో సంబంధం లేకపోయినా.. రాజకీయ కుట్రతో ఆ కేసులో కాపు నేతల్ని ఇరికించారు. అలాంటి కేసును కొట్టివేయడం మంచి పరిణామం. అయితే, కేసు కొట్టివేతపై కాపుజాతి అంతా సంతోషంగా ఉంటే, చంద్రబాబు మరియు అతనికి తాబేదారుగా ఉన్న రామోజీరావు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఈనాడులో ఈకేసు కొట్టివేతపై రాసిన కథనం చాలా విడ్డూరంగా ఉంది.

కాపు వ్యతిరేకి టీడీపీ
ఈసందర్భంలో కాపుల దృష్టికి, ఈ రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాల్ని తెలియజేస్తున్నాను.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కాపులకు వ్యతిరేకంగానే పనిచేస్తుంది. కాపులను ద్వేషించడం, హింసించడం, కాపులపై కేసులు పెట్టడం అనేది తెలుగుదేశం పార్టీ అనవాయితీగా, రాజకీయ కక్షగా పెట్టుకుంది. వంగవీటి మోహనరంగా ని చంద్రబాబు ప్రోద్భలంతోనే అతిదారుణంగా హత్య చేశారు. ఇది నేను చెబుతున్నమాట కాదు. స్వయాన హరిరామజోగయ్య , అప్పుడే అసలు ఏం జరిగిందనేది చెప్పారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే వంగవీటి మోహనరంగా ని చంపడమే కాకుండా ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అలజడులు జరిగితే, కాపులందరిపై కేసులు పెట్టారు. అప్పట్లో 302, 307 సెక్షన్‌లు కాపులపై పెట్టారు.

కాపులపై కేసులు పెట్టింది టీడీపీ.. ఎత్తివేసింది వైఎస్ఆర్సీపీ
ఆ తర్వాత పరిణామక్రమంలో ఎన్టీరామారావు ప్రభుత్వం చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో ఆ కేసుల్ని ఎత్తివేశారు. అప్పటికి నేను శాసనసభ్యుడ్ని. వంగవీటి హత్యగావించిన సమయంలో నేను రేపల్లెలో న్యాయవాదిగా ఉన్నాను. అప్పట్లో రంగా గారు హత్యకు గురైన తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం నామీద కూడా 11 క్రిమినల్‌ కేసులు పెట్టింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కాపుల మీద పెట్టిన కేసులన్నింటినీ ఒకే ఒక్క జీవోతో ఎత్తివేశారు. నేడు తుని ఘటనలో కేసుల్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. కాపు ఉద్యమం జరుగుతూ ఉంటే, ముద్రగడ పద్మనాభం నిరాహారదీక్ష చేస్తే.. దీక్షను చేయకుండా ఆయన్ను, వారి కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టి అనేక కేసులు పెట్టించాడు ఈ చంద్రబాబు.రాష్ట్రంలో ఉన్న అనేకప్రాంతాల్లో కాపులపై కూడా చంద్రబాబు కేసులు పెట్టించాడు. చంద్రబాబు కుట్రపన్ని మరీ కాపునేతలపై అనేక పోలీసు స్టేషన్‌లలో దాదాపు 69 కేసులు పెట్టించాడు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత 27.07.2020న ఒక జీవోను విడుదల చేసి, టీడీపీ పెట్టిన కేసులన్నింటినీ రద్దు చేశారు.తుని ఘటనలో రైలు తగలబెట్టారు కాబట్టి, రైల్వే అధికారులు కేసు నమోదు చేయడంతో, ఆరోజు రద్దు చేయడానికి వీల్లేనందున న్యాయవ్యవస్థలో విచారణ వరకు వచ్చిన తర్వాత.. కేసులో పెట్టిన వారు దోషులు కాదని, సాక్ష్యాల్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని తుదితీర్పు ఇస్తూ.. కేసును కొట్టివేశారు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, తెలుగుదేశం పార్టీ కాపులపై కేసులు పెట్టినప్పుడు గతంలో కాంగ్రెస్‌ పార్టీ వాటన్నింటినీ రద్దు చేస్తే.. ఇప్పుడు మరలా అదే అనవాయితీని చంద్రబాబు అనుసరించి కాపులుపై కేసులు పెడితే మా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఆ కేసుల్ని రద్దు చేసిందని గుర్తుచేస్తున్నాను.

కాపుల్ని సర్వనాశనం చేయడానికే పుట్టిన పార్టీ టీడీపీ
దీన్నిబట్టి రాష్ట్రంలోని కాపుసోదరులు అర్ధం చేసుకోవాల్సిందేమంటే, తెలుగుదేశం ఉంటే, చంద్రబాబు అధికారంలో ఉంటే కాపుల్ని హింసిస్తారు అని తెలుసుకోవాలి. కాపునేతలపై కేసులు పెడతారు. కాపుజాతిని సర్వనాశనం చేసేందుకు పుట్టిన పార్టీనే తెలుగుదేశం పార్టీ అని గ్రహించాలని కాపుసోదరులకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే, నాడు వంగవీటి మోహనరంగా గారు హత్య తర్వాత జరిగిన పరిణామాలు, కేసులు.. ఆ తర్వాత తునిలో ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టిన క్రమంలో కాపులందర్నీ చంద్రబాబు హింసించిన ఘటనల్నే ఉదాహరణలుగా చూడాలని కోరుతున్నాను.

కేసు కొట్టేస్తే.. రామోజీకి ఎందుకు దుగ్ధ..?
ఈరోజు ఈనాడు రామోజీరావు కూడా కాపుల మీద అన్యాయంగా, అక్రమంగా కేసులు కొట్టేశారని తెగ బాధ పడుతున్నాడు. ప్రాసిక్యూషన్‌ ఫెయిల్‌ అయిపోయారని ఈయన విచారం వ్యక్తం చేస్తున్నాడు. సాధారణంగా పోలీసువారు కేసులు నమోదు చేస్తే.. దానికి తగ్గట్టు సాక్ష్యాల్ని నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమమైతే ఆ కేసుల్ని న్యాయమూర్తి కొట్టివేయడం సర్వసాధారణం. అన్యాయంగా, అక్రమంగా, రాజకీయ కుట్రతో పెట్టిన కేసులకు సాక్ష్యాలెందుకు ఉంటాయి..? ముద్రగడ్డ పద్మనాభం లాంటివారు అగ్గిపుల్లతో రైలుకు నిప్పు పెట్టారని రామోజీరావు భావిస్తున్నారా..? అది నిరూపితం కాలేదని ఆయన బాధ పడుతున్నారా..?రాజకీయకక్షతో చంద్రబాబు కుట్రగట్టి పెట్టిన కేసుల్ని కొన్నింటిని మా ప్రభుత్వం విత్‌డ్రా చేసుకుందని.. ఒక కేసును రైల్వేకోర్టు కొట్టివేసిందని .. ప్రత్యక్షసాక్షులున్నప్పటికీ.. వారిచేత నిజాల్ని చెప్పించలేకపోయారంటూ ప్రాసిక్యూషన్‌ విఫలమైందని రామోజీరావు రాతల ద్వారా ఏడుస్తున్నాడు. కేసు కొట్టేస్తే.. కేసు ప్రూవ్‌ కాకపోతే రామోజీ ఇంత ఆవేదన పడిపోవాల్నా.. ?అసలు, కాపులంటే ఆయనకెందుకు అంత కక్ష..? అంత బాధ, కడుపులో దుగ్ధ రామోజీకి ఎందుకు..? అని నిలదీస్తున్నాను. దీన్ని ప్రజాస్వామ్యవాదులే కాకుండా కాపులంతా గమనించాలని మనవి చేస్తున్నాను.

చరిత్ర తెలియని అజ్ఞాని పవన్‌కళ్యాణ్
చరిత్ర తెలియని, రాజకీయాల మీద అవగాహన లేని ఒక సినిమా ఆయన.. ఈరోజు చంద్రబాబుకు మద్ధతివ్వాలని మాట్లాడుతున్నారు. కాపుల పాలిట సైకోలాగా చంద్రబాబు వ్యవహరించారని తెలుసుకోకుండా పవన్‌కళ్యాణ్‌ ఈరోజు మాట్లాడుతున్నారు.కాపుల్ని బీసీల్లోకి చేరుస్తామని ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేకపోయావని ముద్రగడ్డ పద్మనాభం నాడు, చంద్రబాబు మీద గర్జించినప్పుడు పవన్‌కళ్యాణ్‌ ఇంట్లో నిద్రపోయాడు. ఈరోజు వచ్చి అదే బాబు గురించి నీతులు మాట్లాడుతున్నాడు.
కాపులంతా చంద్రబాబుకు ఊడిగం చేయాలని పవన్‌కళ్యాణ్‌- చరిత్ర తెలియని అజ్ఞానిలా మాట్లాడుతున్నాడు. ఆయనెంత అజ్ఞానంలో బతుకుతున్నాడంటే, వంగవీటి మోహనరంగా చనిపోయిన తర్వాత ఈయన టీ ఇచ్చాడంట. అసలు, కాఫీ, టీ అలవాటే లేని వంగవీటి మోహనరంగా మరణించిన తర్వాత, తాను టీ ఇచ్చానని చెప్పుకున్న అజ్ఞాని ఈ పవన్‌కళ్యాణ్‌.

కాపుల్ని అమ్మేద్దామంటే పప్పులుడకవ్
పవన్‌కళ్యాణ్‌ వెళ్లి చంద్రబాబును కలిసి మాట్లాడతాడు. చంద్రబాబు కూడా పవన్‌ దగ్గరకు వెళ్తాడు. మీరిద్దరూ కలిసి తిరిగితే మాకేం అభ్యంతరం లేదు. మీరు కలిస్తే కలవండి గానీ.. చంద్రబాబు వలన ఇంత హింసకు గురైన కాపులు మాత్రం మీతో కలవరు గాక కలిసే ప్రసక్తే ఉండదని స్పష్టం చేస్తున్నాను.
పవన్‌కళ్యాణ్‌ పిలుపునివ్వగానే కాపులంతా చంద్రబాబు పల్లకి మోస్తారని అనుకుంటూ భ్రమల్లో బతుకుతున్నారు గానీ.. తెలుగుదేశం పార్టీ పుట్టుక దగ్గర్నుంచి కాపుల్ని నాశనం చేయడానికే రాజకీయం చేస్తుందని కాపులెప్పుడో గుర్తించారు. పవన్‌కళ్యాణ్‌ అనే అజ్ఞాని… బాబు దగ్గర ప్యాకేజీ కొట్టేసి సినిమా అమ్మేసినట్టుగా, కాపుల్ని చంద్రబాబుకు అమ్మేయడం వంటి కార్యక్రమాన్ని ఈరోజు కాపులంతా కనిపెట్టి ఉండాలని కోరుతున్నాను. అదేదో సినిమాలో చెప్పినట్టుగా జరగాలి చెల్లికి పెళ్లి- మళ్లీ మళ్లీ.. అంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు మళ్లీమళ్లీ కలుస్తూనే ఉంటారు. వారెందుకు కలుస్తున్నారో మాకు అవసరం లేదు. బహుశా, ప్యాకేజీ లెక్కలు మాట్లాడుకోవడానికేమో.. కాకపోతే, ఇక్కడ అమలవుతున్న ప్రజా సంక్షేమ పథకాల్ని ఏవిధంగా నిలుపుదల చేద్దామా..? అనే కుట్రలు చేయడానికి కలయిక జరుగుతుందేమోననే అనుమానం ఉంది.

మీడియా ప్రశ్నలకు మంత్రి అంబటి సమాధానమిస్తూ..
పోలవరంపై తెలంగాణ మంత్రి కామెడీ
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చాలా కామెడీగా మాట్లాడతారు. ఆ కామెడీలకు మేం సమాధానం చెప్పనవసరంలేదు. పోలవరం నిర్మిస్తే భద్రచలం మునిగిపోతుందని గతంలో ఇదే మల్లారెడ్డి అన్నారు. మరి, ఈరోజు పోలవరం మేమే నిర్మిస్తామని అంటున్నారు. అసలు, పోలవరం నిర్మించడానికి వాళ్లెవరు..? పోలవరం అనేది మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టు. దాన్ని పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌ చిత్తశుద్దిగా పనిచేసి సాకారం చేస్తారు. కేసీఆర్ గానీ, మల్లారెడ్డి గానీ కట్టాల్సిన అవసరం లేదు. పోలవరంను వ్యంగ్యం చేయకుండా.. నీటిపంపకాల్లో మా వాటా మాకు ఇవ్వడంలో సానుకూలంగా వ్యవహరిస్తే మంచిదని మనవిచేస్తున్నాను.

LEAVE A RESPONSE