బీసీలపై జగన్ రెడ్డి సోషల్ మీడియా బందిపోట్లతో దాడి

-ఎన్టీఆర్, చంద్రన్న ప్రోత్సాహంతోనే బీసీలకు రాజకీయ ప్రోత్సాహం
-గడపగడపకూ వెళ్దాం.. జగన్ రెడ్డి బీసీలకు చేసిన దగా వివరిద్దాం
-తెలుగుదేశం బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర

గవర, దాసరి, అతిరస, నాగవంశం సాధికార సమితుల శిక్షణా కార్యక్రమంలో వక్తలు పిలుపు. బీసీలు రాజకీయాల్లో ఈ స్థాయిలో ఉండడానికి నాడు ఎన్టీఆర్ తీసుకున్న కల్పించిన రిజర్వేషన్లు, రాజకీయ అవకాశాలు, తర్వాత చంద్రబాబు నాయుడు అందించిన ఆర్ధిక, సామాజిక ప్రోత్సాహమే కారణం. బీసీల్లో నాయకత్వాన్ని పెంచాలి, తద్వారా వారి సామాజిక వర్గంలోని వెనుకబాటుతనాన్ని పారద్రోలేందుకు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు కంకణబద్దులై ఉన్నారని బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

ఈ మేరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి ఆధ్వర్యంలో గవర, దాసరి, అతిరస, నాగవంశం సాధికార సమితుల సభ్యులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆది నుండి బీసీల అభ్యున్నతే లక్ష్యంగా పని చేసింది. వారిని ఆర్ధికంగా ఎదిగేలా చేసినపుడే అసలైన స్వాతంత్ర్యం లభిస్తుందని నమ్మి పని చేస్తోందన్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా విజన్ 2020 అంటే కొందరు ఆశ్చర్యంగా చూశారు. కొందరు హేళన చేశారు.

కానీ నాడు రూపొందించిన విజన్.. హైదరబాద్‌ను ప్రపంచంలో అగ్రస్థాయి నగరాల జాబితాలో 65వ స్థానంలో నిలిపింది. మరో 10ఏళ్లలో టాప్ టెన్ లో నిలవడం తధ్యం. అదే రీతిలో అమరావతిని, రాష్ట్రాన్ని నిలపాలని చంద్రబాబు భావించారు. కానీ జగన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ముందుకు వెళ్లనీయకపోగా, వెనక్కి నెట్టారు. ఏపీని చూసి పక్క రాష్ట్రాల నాయకులు నవ్వే పరిస్థితికి తెచ్చారు. అందుకు ఇక్కడ కులాల పేరుతో జగన్ రెడ్డి చేస్తున్న రాజకీయమే కారణం. జగన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను, జగన్ రెడ్డి సోషల్ మీడియా మాఫియా చేసే దుష్ప్రచారాలను గ్రామ గ్రామాన చర్చించాలి. జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిద్దాం.

గవర, దాసరి, అతిరస, నాగవంశం సాధికార సమితుల్లోని సభ్యులంతా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలి. జరుగుతున్న అన్యాయాన్ని, ఏం చేస్తే మేలు జరుగుతుందో గుర్తించి, సమస్యల పరిష్కారానికి సాధికార సభ్యులే నాయకులుగా నిలవాలి. కుల వృత్తులు, చేతివృత్తుల్ని దశాబ్దాలుగా చులకన చేశారు. కానీ ఇప్పుడు వాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ గుర్తించి శిక్షణ ఇప్పించాలి. నైపుణ్యం పెంచి ఆర్ధికంగా వృద్ధిలోకి తెచ్చేలా ఏర్పాటు చేద్దాం. జిల్లాల వారీగా బీసీల సమస్యలు తెలుసుకునేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసి రాష్ట్రంలోని బీసీలందరినీ ఏకం చేద్దామన్నారు.

చిన్న ఫిర్యాదు కూడా లేకున్నా.. ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్‌లపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. వందల ఫిర్యాదులున్నా వైసీపీ నేతల వ్యాపారాలపై కనీసం చర్యలు తీసుకోవడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బెదిరింపులకు తలొగ్గలేదనే కక్షతో బీసీ కుటుంబంపై కేసులు పెట్టారు. ఇలా చూసుకుంటే నాలుగేళ్లలో చంద్రయ్య, జల్లయ్య యాదవ్, పద్మ, ఇలా ఎంతో మంది బీసీలపై వైసీపీ మూక అరాచకాలకు పాల్పడ్డారు. చేయని నేరానికి 52 రోజులు జైల్లో పెట్టి వేధించారని తనపై నమోదైన హత్య కేసు గురించి పేర్కొన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. చంద్రబాబు నాయుడు పునర్జన్మ ఇచ్చారంటూ భావోద్వేగానికి గురయ్యారు.

తెలుగుదేశం పార్టీ నాలెడ్జి సెంటర్ ఛైర్మన్ గురజాల మాల్యాద్రి మాట్లాడుతూ.. నందిని పంది అని నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. నాలుగేళ్లుగా సంక్షేమం పేరుతో దగా చేస్తున్నారు. సగానికి పైగా జనాభా ఉన్నప్పటికీ బీసీలకు బడ్జెట్ కేటాయింపులు, అందిస్తున్న సంక్షేమంలో చేస్తున్న మోసాన్ని తెలుసుకున్నపుడే బీసీల బలం జగన్ రెడ్డికి తెలిసొస్తుంది. ఒకే అబద్దాన్ని పదేపదే చెబుతూ.. బీసీలను ఇంకా నయవంచనకు గురి చేస్తున్నారు. రూ.75 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు.

8వేల ఎకరాలకు పైగా అసైన్డ్ భూములు లాక్కున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కుదించాడు. విద్యా పథకాలు దూరం చేసి చదువుకోకుండా చేస్తున్నాడు. 28 బీసీ పథకాలు రద్దు చేశాడు. అయినా బీసీలను ఉద్దరించానని చెప్పుకుంటున్నాడు. బీసీలు అంతా జగన్ రెడ్డి చేస్తున్న దగాపై అవగాహన చెందితే జగన్ రెడ్డికి శ్రీకృష్ణ జన్మస్థానమే దిక్కని తెలిసే బీసీలను విడగొట్టి రాజకీయం చేస్తున్నాడు. మనం అవగాహన చెందడమే కాకుండా, మనతోటి వారికి కూడా జగన్ రెడ్డి దగా గురించి వివరించాలని పిలుపునిచ్చారు.

కోనేరు సురేష్ మాట్లాడుతూ.. ఎన్నికల కోసం ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రచారం చేసినా, ఎన్నికల జాబితా సరిగా లేకుంటే ఎవరూ ఏమీ చేయలేమని, ఓటర్ల విషయంలో పక్క ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రతి ఒక్క సభ్యుడు కూడా తమ పరిధిలోని ఓటర్ జాబితాను ప్రతి మూడు నెలలకు ఒకసారి పరిశీలించి జాబితాను సరి చూసుకోవాలి. ఓటర్ జాబితాను మేనిప్యులేట్ చేయడంలో జగన్ రెడ్డి సిద్ధహస్తుడని, దొంగ ఓట్ల చేరికలపై జగన్ రెడ్డి ఎక్కువగా దృష్టిపెట్టినందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బీసీ సెల్ సాధికార సమితి సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గంజాం రాఘవేంద్ర మాట్లాడుతూ.. బీసీ సెల్ తరఫున మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లకుంటే ప్రయోజనం ఉండదు. అందుకే సోషల్ మీడియా వినియోగంపై బీసీలు అవగాహన పొందాలి. గ్రామగ్రామాన ఉండే బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను సోషల్ మీడియా వేధికగా ప్రజల్లోకి తీసుకెళ్లి హోరెత్తిద్దామని, జగన్ రెడ్డికి బీసీల సత్తా ఏంటో చాటిచెబుదామన్నారు.

కార్యక్రమంలో.. సాధికార కమిటీల కోఆర్డినేటర్ కాకినాడ రామారావు, రాజమండ్రి నారాయణ , సాధికార కమిటీల కన్వీనర్లు ఏర్రబోతు రమణ రావు(నాగవంశం), తుపాకుల అప్పారావు (దాసరి), మళ్ళ సురేంద్ర (గవర), వెంకట సత్యనారాయణ (అతిరస) సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply