– ఎంపీ విజయసాయిరెడ్డి
ఎస్సీ ఉప ప్రణాళిక అమలుతో పాటు ఎస్సీ కుటుంబాలకు సహాయం చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఆగ్రస్థానంలో నిలిచిందని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు.
దేశంలోని మరే ఇతర రాష్ట్రం అమలు చేయని విధంగా ఎస్సీ ఉప ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేసినట్టు కేంద్ర గణాంకాలు,కార్యక్రమాలు అమలు మంత్రిత్వశాఖ నివేదికలో వెల్లడించిందన్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం 34.68 లక్షల కుటుంబాలకు తోడ్పటును అందిస్తే,ఇందులో ఏపీలోనే 33.57 లక్షల ఎస్సీ కుటుంబాలకు సాయం అందిందన్నారు.
గ్రామీణులకు వరంలా మారిన ఫ్యామిలీ ఫిజీషియన్
ఫ్యామిలీ ఫిజీషియన్ వ్యవస్థతో తమ ఊరికే వచ్చి వైద్యులు పరీక్షలు చేస్తుండటంతో క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకునే అవకాశం లభించిందని చెప్పారు, గ్రామంలోనే స్ర్కీనింగ్ చేసి, క్యాన్సర్ ని గుర్తిస్తే రోగిని పెద్దాసుపత్రులకు తరలిస్తున్నరని అన్నారు.దీని ద్వారా క్యాన్సర్ రోగికి తొలిదశలో వైద్యం అందుతోందన్నారు. సకాలంలోనే చికిత్స అందడంతో రోగులకు మేలు జరగుతోందన్నారు. ఈ సేవాలపై ప్రజల నుండి సర్వత్రా హర్ష వ్యక్తం అవుతుదన్నారు.
కార్మికుల కర్షకుల సంక్షేమమే జగన్ ప్రభుత్వ ధ్యేయం..
కార్మికుల, కర్షకుల సంక్షేమమే ధ్యేయంగా సిఎం జగన్ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. అసంఘటిత కార్మికులకు భీమ కల్పిస్తోందని, అన్ని విధాలుగా కర్షకులకు ప్రతిఫలం దక్కేల చూస్తున్నదన్నారు. అత్యుత్తమ పారిశ్రామిక విధానంతో రాష్ట్రానికి జాతీయ,అంతర్జాతీయ సంస్ధల రాకతో కార్మికులకు ఉపాధితో పాటు మంచి వేతనాలు లభించనున్నాయని చెప్పారు. మే డే సందర్బంగా కార్మికులందరికి శుభాకాంక్షలు తెలిపారు.