Suryaa.co.in

Telangana

ఎన్టీఆర్‌ భవన్‌లో అంబేద్కర్‌ వర్థంతి

ఎన్టీఆర్‌ భవన్‌లో అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు ప్రసంగిస్తూ… అంబేద్కర్‌ అంటరాని తనం నిర్ములనకు తీవ్రంగా కృషి చేశారని పేర్కొన్నారు. భారతదేశానికి అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించిన ఘనత అంబేద్కర్‌కు దక్కుతుందని వారు పేర్కొన్నారు.

బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన నిరంతరం తపించారని వారు పేర్కొన్నారు. ప్రజలందరికీ సమాన అవకాశాలు లభించాలని ఆయన తపించారని పేర్కొన్నారు. అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం ఎన్టీఆర్‌, చంద్రబాబు కృషి చేశారని వారు కొనియాడారు. మనమంతా అంబేద్కర్‌ ఆశయాల సాధనకు కృషి చేయాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు కాట్రగడ్డ ప్రసూన, సామ భూపాల్‌ రెడ్డి, జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్న్స, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు అజ్మీర రాజునాయక్‌, ఆరీఫ్‌, జివిజి నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరి మండూరి సాంబశివరావుఅధికార ప్రతినిధి డా.ఎ.ఎస్‌.రావు, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు పి. అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE