త్వరలో ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టాలో క్రాస్‌ చాటింగ్‌ బంద్‌

ప్రముఖ సామాజిక మాధ్యమాలు ఇన్‌స్టా గ్రామ్‌, ఫేస్‌ బుక్‌ విషయంలో టెక్‌ దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకుంది. క్రాస్‌ చాటింగ్‌ ఫీచర్‌ ను నిలిపి వేయబోతున్నట్లు తెలిపింది. డిసెంబర్‌ లోనే దీన్ని అమల్లోకి తెస్తామని వెల్లడించింది. ప్రస్తుతం ఫేస్‌ బుక్ మెసెంజర్‌ నుంచి ఇన్‌స్టా గ్రామ్‌ కు, ఇన్‌స్టా గ్రామ్ నుంచి మెసెంజర్‌ కు సందేశాలు పంపడం, కాల్స్‌ చేయడానికి అనుమతి ఉంది.

ఈ క్రాస్‌ చాటింగ్‌ ఫీచర్‌ ను 2020 లో తీసుకొచ్చారు. ఇన్‌స్టా లేదా మెసెంజర్‌ సెట్టింగ్‌ లలో ఆ మేరకు మార్పులు చేసుకొని ఈ ఫీచర్‌ ను ఉపయోగించు కోవచ్చు. కానీ, తాజాగా దీన్ని తొలగించ నుండటంతో ఫేస్‌ బుక్‌ నుంచి ఇన్‌స్టా కు, ఇన్‌స్టా నుంచి ఫేస్‌ బుక్‌ కు చాటింగ్‌, కాల్స్‌ చేయడం కుదరదు.. ఇప్పటి వరకు ఒక ప్లాట్‌ఫామ్‌ నుంచి మరో దానికి పంపిన, అందుకున్న సందేశాలు రీడ్‌-ఓన్లీ మెసేజ్‌ లుగా మిగిలిపోతాయి.

అలాగే, ఇన్‌స్టా నుంచి అందిన సందేశాలు ఫేస్‌ బుక్‌ మెసెంజర్‌ ఇన్‌బాక్స్‌ కు బదిలీ చేయబోమని మెటా స్పష్టం చేసింది. ఫేస్‌ బుక్‌, ఇన్‌స్టా మధ్య అనుసంధానానికి వీలు కల్పించిన ఈ ఫీచర్‌ ను తొలగించడానికి గల కారణాన్ని మాత్రం మెటా వెల్లడించలేదు..

Leave a Reply