కేంబ్రిడ్జిలో కొత్త లుక్‌ తో రాహుల్‌ గాంధీ

Spread the love

– ఫొటోలు వైరల్‌

నాలుగు నెలలకు పైగా కొనసాగిన భారత్‌ జోడో యాత్ర లో గడ్డంతో ఉన్న రాహుల్ గాంధీ ఇప్పుడు కొత్త లుక్‌ తో ఆకట్టుకుంటున్నారు. హెయిర్‌ కటింగ్‌, గడ్డం ట్రిమ్‌ చేయించుకొని తొలిసారి స్టైలీష్‌ లుక్‌లో ఉన్న ఆయన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తాను విద్యనభ్యసించిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు వెళ్లిన రాహుల్‌ అక్కడ సూట్‌తో డిఫరెంట్‌ లుక్‌లో కనబడుతున్నారు. ఇటీవల మూడు రోజుల పాటు రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ ప్లీనరీ ముగిసిన తర్వాత రాహుల్‌ నేరుగా యూకేకు బయల్దేరి వెళ్లిన రాహుల్.. వారం రోజుల పాటు లండన్‌లో పర్యటించనున్నారు.

రాహుల్ గాంధీ కేంబ్రిడ్జి వర్సిటీలో ”లెర్నింగ్‌ టు లిజన్‌ ఇన్‌ ద ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ” అనే అంశంపై ప్రసంగించేందుకు వెళ్లారు. రాహుల్‌ను ఆహ్వానిస్తూ కేంబ్రిడ్డ్ జేబీఎస్ ఈ మేరకు ట్వీట్ చేసింది. ”మా కేంబ్రిడ్జి ఎంబీఏ ప్రోగ్రామ్‌ కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీకి సాదరంగా స్వాగతిస్తోంది. ఆయన ఈరోజు విజిటింగ్ ఫెలో ఆఫ్ కేంబ్రిడ్జి జేబీఎస్‌గా ‘లెర్నింగ్ టు లిజన్ ఇన్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ” అనే అంశంపై ప్రసంగిస్తారు” అని పేర్కొంటూ నిన్న ట్వీట్‌ చేసింది.

మరోవైపు, భారత సంతతికి చెందిన ఫెలో, యూనివర్సిటీకి చెందిన కార్పస్‌ క్రిస్టీ కళాశాల డైరెక్టర్‌, ట్యూటర్‌, గ్లోబల్ హ్యుమానిటీస్‌ ఇనిషియేటివ్‌ కో డైరెక్టర్‌ అయిన శ్రుతి కపిలతో రాహుల్‌ గాంధీ బిగ్ డేటా అండ్ డెమోక్రసీ, భారత్‌- చైనా సంబంధాలు అనే అంశాలపై ప్రత్యేక సెషన్లలో పాల్గొననున్నారు.

లక్ష్మీశ్రీనివాస్

Leave a Reply