Suryaa.co.in

Andhra Pradesh Telangana

అమీర్‌పేట కోచింగ్ సెంటర్లు ఖాళీ

-చలో ఆంధ్రా
-జగన్‌పై హైదరాబాద్‌లోనూ కనిపించిన వ్యతిరేకత

హైదరాబాద్‌లోని అమీర్‌పేట తెలుసుకదా? వివిధ ఉద్యోగాలు, ట్రైనింగ్ సెంటర్లకు కేంద్రమైన అమీర్‌పేట కోచింగ్ సెంటర్, యువకులు లేక బోసిపోయింది. కారణం ఆంధ్రాలో ఎన్నికలే. టీడీపీ నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పన, కొత్త పరిశ్రమల స్థాపన వంటి హామీలివ్వడంతో.. హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్న యువకులంతా, ఏపీలోని తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఫలితంగా అమీర్‌పేటలో నిత్యం కిటకిటలాడే కోచింగ్ సెంటర్లు వెలవెలపోయాయి. .
ఉద్యోగుల కంటే కసిగా ఈ నిరుద్యోగులు వెళుతున్నారు. 20 లక్షల జాబ్స్ లేదంటే నెల నెలా 3000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పిన చంద్రబాబు మీద నమ్మకం కావచ్చు. ఎందుకంటే ఇంట్లో అమ్మానాన్నలను అస్తమానం, నెల నెలా డబ్బులు అడగాలంటే.. చాలా చాలా బాధాకరం కదా. ఉద్యోగాలు ఇవ్వలేను. పెద్ద కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయా అని చేతులెత్తేసిన జగన్ పాలనపై, ఇంత కసి పొరుగు రాష్ట్రాల రోడ్డు కూడా చెబుతోంది..

LEAVE A RESPONSE