Suryaa.co.in

Andhra Pradesh Telangana

హలో ఏపీ.. బైబై వైసీపీ

-పోటెత్తనున్న యువత ఓటు
-చలో ఆంధ్రా
-ఖాళీ అవుతున్న హైదరాబాద్
-స్వగ్రామాలకు ప్రయాణం

ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఎన్నికల కోసం తెలంగాణలో ఉద్యోగ వ్యాపార రీత్యా ఉంటున్న వారు దాదాపుగా పూర్తిస్థాయిలో తమ ఓటు హక్కు వినియోగించుకొనుటకు స్వరాష్ట్రానికి వస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒక మిత్రుడు తో ఫోనులో మాట్లాడగా, రెగ్యులర్ గా తిరిగే రైళ్లు కాకుండా 68 ప్రత్యేక రైళ్లు రైల్వే శాఖ ఏర్పాటు చేసిందని, ఇంకొక గంటలో ఇంకొక రెండు ప్రత్యేక రైళ్లు కూడా ప్రకటించబోతున్నారని చెప్పారు.

అలాగే రోజు తిరిగే బస్సులు కాకుండా ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ సర్వీసులు గానీ ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసీ సర్వీసులు గానీ 1600 బస్సులు టికెట్లు బుక్ అయినట్లుగా చెప్పటం జరిగింది. అలాగే కర్ణాటక నుంచి సుమారు 600 బస్సులు ఇప్పటికే టికెట్స్ బుక్ అయినట్లు తెలిసింది.

బస్సులలో, రైళ్లలో వచ్చే వారి కంటే కార్లలో వచ్చేవారు దీనికంటే మూడు నాలుగు రెట్లు అదనంగా ఉండొచ్చని అన్నారు. రాష్ట్రానికి వచ్చే సరిహద్దుల్లో ఉన్న టోల్ గేట్ల దగ్గర పది నుంచి 12 కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయినట్లుగా కూడా సదరు మిత్రుడు చెప్పటం గమనార్హం.

ప్రతి ఒక్కరూ తమ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని, భవిష్యత్ తరాలకు రాష్ట్ర అభివృద్ధిని చూపించాలని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఎంతో బాధ్యతతో ఈ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకొనుటకు రావడం చాలా గొప్ప విషయం, ఆనందదాయకం. నిన్న ఈరోజుటి కంటే రేపు ఇంకా ఎక్కువ మంది రావచ్చని అంచనా.

LEAVE A RESPONSE